Ramayana Yash: రావణాసురుడిగా యశ్ కాస్ట్యూమ్స్ బరువు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అన్ని కిలోల నగలు ఎలా మోశాడయ్యా!

Ramayana Yash: నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రామాయణం' సినిమాలో రావణాసురుడిగా నటించిన కన్నడ సూపర్ స్టార్ యశ్ కాస్ట్యూమ్స్ గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఆ భారీ దుస్తులు, కిరీటం బరువు గురించి డిజైనర్ సానియా సర్ధారియా కీలక విషయాలను పంచుకున్నారు.

Published on: Nov 10, 2026, 13:44:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana Yash: హిందూ ఇతిహాసం 'రామాయణం' లాంటి గొప్ప కథతో సినిమాను తెరకెక్కించడం ఒక ఎత్తైతే.. అందులోని పాత్రలను ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించడం మరో ఎత్తు. పౌరాణిక సినిమాల్లో ఆ కాలానికి తగ్గట్లుగా ఉండే దుస్తులు, ఆభరణాలు ఆయా పాత్రలకు ప్రాణం పోస్తాయి. ఆ పాత్రల్లో నటించే నటీనటులు కూడా ఆ బరువును మోస్తూ ఎంతో కష్టపడితే తప్ప సీన్‌లో ఆ ఫీల్ రాదు. తాజాగా రామాయణం సినిమాలో రావణాసురుడిగా యశ్ అలాంటి కష్టమే పడ్డారు.

రావణాసురుడిగా యశ్ కాస్ట్యూమ్స్ బరువు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అన్ని కిలోల నగలు ఎలా మోశాడయ్యా! (x/WorldOfRamayana)
రావణాసురుడిగా యశ్ కాస్ట్యూమ్స్ బరువు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అన్ని కిలోల నగలు ఎలా మోశాడయ్యా! (x/WorldOfRamayana)

దుస్తుల బరువే 33 కిలోల వరకు..

తాజాగా నితీశ్ తివారీ దర్శకత్వంలో వచ్చిన 'రామాయణం'లో రావణుడి పాత్ర కోసం యశ్ పడిన కష్టం గురించి, ఆయన ధరించిన భారీ కాస్ట్యూమ్స్ గురించి కాస్ట్యూమ్ స్టైలిస్ట్ సానియా సర్ధారియా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

రావణాసురుడి లుక్ కోసం యశ్ ధరించిన దుస్తులు చాలా బరువుగా ఉండేవట. సాధారణంగా రోజువారీ షూటింగ్ సమయంలో యశ్ ధరించిన కాస్ట్యూమ్స్, ఆభరణాల బరువు 16 నుంచి 20 కిలోల వరకు ఉండేదని సానియా తెలిపారు. అయితే కొన్ని ప్రత్యేక సన్నివేశాల్లో ఈ బరువు అమాంతం పెరిగిపోయేదట.

ముఖ్యంగా లంకాధిపతిగా సింహాసనంపై కూర్చునేటప్పుడు, రావణుడి పెళ్లి సన్నివేశంలో, అలాగే శూర్పణఖ వివాహం సమయంలో యశ్ ధరించిన దుస్తుల బరువు ఏకంగా 30 నుంచి 33 కిలోల వరకు ఉండేదని ఆమె గుర్తుచేసుకున్నారు.

కిరీటం బరువే 1.8 కిలోలు

రావణుడి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంలో అత్యంత క్లిష్టమైన భాగం అతని 'కిరీటం' అని సానియా చెప్పారు. తలపై ఎంత తక్కువ బరువు పెట్టినా అది నటీనటులకు భారంగానే అనిపిస్తుందని, అందుకే కిరీటం బరువు తగ్గించేందుకు ఎన్నో ప్రయోగాలు చేశామని ఆమె వెల్లడించారు.

ముందుగా డిజైన్ పక్కాగా కుదిరాక, చాలా 3D నమూనాలను తయారు చేసి దాని బరువును తగ్గించేందుకు రివర్స్ ఇంజనీరింగ్ విధానాన్ని కూడా వాడారట. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఆ కిరీటం బరువును 1.8 కిలోల కంటే తగ్గించలేకపోయామని సానియా స్పష్టం చేశారు.

కష్టమైనా చిరునవ్వుతోనే

అంత బరువైన దుస్తులు, కిరీటం ధరించి నటించడం మామూలు విషయం కాదు. ఈ భారీ కాస్ట్యూమ్స్ వల్ల కదలికలు కూడా చాలా పరిమితం అవుతాయి. శారీరకంగా ఎంతో అసౌకర్యంగా ఉన్నప్పటికీ, యశ్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఎంతో డెడికేషన్ తో పనిచేశారని సానియా ప్రశంసించారు.

షూటింగ్ సమయంలో అలసిపోయినా యశ్ తన ముఖంలో ఆ అసౌకర్యం కనిపించనివ్వలేదట. పైగా సెట్ లోని తోటివారిని సరదాగా ఆటపట్టిస్తూ, తన కాస్ట్యూమ్స్ కు ఉన్న పదునైన అంచులతో అందరినీ భయపెడుతూ కష్టాన్ని మర్చిపోయేలా సందడి చేసేవారని ఆమె చెప్పుకొచ్చారు.

రామాయణం మూవీ విశేషాలు

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్ తో 'రామాయణం' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సీతాదేవిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More