Ramayana Twitter Review: రామాయణం ట్విట్టర్ రివ్యూ.. ర‌ణ్‌బీర్‌, సాయి పల్లవి, యశ్ మూవీ హిట్టా? ఫ్లాపా?.. పబ్లిక్ టాక్!

Ramayana Part 1 Twitter Review: భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం 'రామాయణం: పార్ట్ 1' (Ramayana). ర‌ణ్‌బీర్‌ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

Published on: Nov 5, 2026, 08:25:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana Part 1 Twitter Review: థియేటర్లలో రిలీజైన ‘రామాయణం పార్ట్ 1’ మూవీపై నెటిజన్ల నుంచి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. రామాయణం కథ మనందరికీ తెలిసిందే అయినప్పటికీ, దర్శకుడు ఈ కథను ప్రెజెంట్ చేసిన విధానం, విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయని టాక్. 3D ఎక్స్ పీరియన్స్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ (VFX) పనితీరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

రామాయణం ట్విట్టర్ రివ్యూ.. ర‌ణ్‌బీర్‌, సాయి పల్లవి, యశ్ మూవీ హిట్టా? ఫ్లాపా?.. పబ్లిక్ టాక్! (x)
రామాయణం ట్విట్టర్ రివ్యూ.. ర‌ణ్‌బీర్‌, సాయి పల్లవి, యశ్ మూవీ హిట్టా? ఫ్లాపా?.. పబ్లిక్ టాక్! (x)

యశ్ 'రావణ' విశ్వరూపం

రామాయణం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాకింగ్ స్టార్ యశ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రావణాసురుడి పాత్రలో యశ్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచిందని ట్విట్టర్ రివ్యూ టాక్. స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ తో యశ్ వన్ మ్యాన్ షో చేశాడని చెబుతున్నారు. రావణుడి పది తలలు మాట్లాడే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు.

ర‌ణ్‌బీర్‌ కపూర్ , సాయి పల్లవి ఎలా చేశారంటే?

శ్రీరాముడి పాత్రలో ర‌ణ్‌బీర్‌ కపూర్ కపూర్ చాలా ప్రశాంతంగా, హుందాగా కనిపించాడు. రాముడికి ఉండాల్సిన ధైర్యం, విలువలని ర‌ణ్‌బీర్‌ కపూర్ పర్ఫెక్ట్ గా తెరపై చూపించాడు. శివ ధనుస్సు విరిచే సన్నివేశం హైలైట్ గా నిలిచింది. ఇక సీతమ్మగా సాయి పల్లవి తనదైన ఎమోషనల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇదొక విజువల్ ట్రీట్ అని, ర‌ణ్‌బీర్‌ కపూర్, సాయి పల్లవి అద్భుతంగా నటించారని, యశ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని ప్రశంసించారు.

ఆ ఎమోషన్ మిస్సింగ్!

అయితే కొంతమంది నెటిజన్లు రామాయణం మూవీపై నెగెటివ్ గానూ రియాక్టవుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథనం కాస్త నెమ్మదించిందని నెటిజన్లు చెబుతున్నారు. డ్రామా ఎక్కువగా ఉండటం వల్ల కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుందట. అలాగే రాముడు, సీత మధ్య ఉండాల్సిన డివైన్ ఆరా, బలమైన ఎమోషనల్ కనెక్షన్ తెరపై పూర్తిగా వర్కౌట్ కాలేదని కొందరు పెదవి విరుస్తున్నారు.

మ్యూజిక్ అండ్ బీజీఎమ్

ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సీన్స్ లో బీజీఎమ్ ఇంటర్నేషనల్ స్థాయిలో అదిరిపోయినా, మరికొన్ని కీలక సన్నివేశాల్లో తేలిపోయిందని చెబుతున్నారు.

ఫైనల్ గా ట్విట్టర్ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే 'రామాయణ: పార్ట్ 1' అనేది ఒక గ్రాండ్ విజువల్ స్పెక్టాకిల్. కొన్ని చోట్ల నెమ్మదించిన కథనం, ఎమోషన్స్ మిస్ అయినప్పటికీ.. అద్భుతమైన విజువల్స్, యశ్ - ర‌ణ్‌బీర్‌ కపూర్ నటన కోసం ఈ సినిమాను థియేటర్లలో కచ్చితంగా ఒక్కసారైనా చూడొచ్చని మెజారిటీ నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. కొత్త తరానికి మన పురాణాలను పరిచయం చేయడానికి ఇదొక బెస్ట్ అప్ గ్రేడ్ మూవీ అని చెప్పాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More