టీ20 ప్రపంచకప్ ను వరుసగా రెండు సార్లు సొంతం చేసుకున్న టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 8న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను భారత్ ఓడించింది. ఈ విక్టరీ తర్వాత టీమిండియ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, అతని గర్ల్ ఫ్రెండ్ రొమాన్స్ శ్రుతి మించిందనే విమర్శలు వస్తూనే ఉన్నాయి.
హార్దిక్, మహీకా

టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా విక్టరీ తర్వాత హార్దిక్ పాండ్య, మహీకా శర్మ గ్రౌండ్ లో ఓవర్ గా బిహేవ్ చేశారనే ట్రోల్స్ వస్తున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత మహీకా గ్రౌండ్ లోకి వచ్చింది. హార్దిక్ పాండ్యను హగ్ చేసుకుంది. అతనితో కలిసి డ్యాన్స్ చేసింది. తర్వాత హార్దిక్ కు కిస్ ఇచ్చింది. టీమ్ అంతా ఒక చోట ఉంటే వీళ్లిద్దరు మాత్రం గ్రౌండ్ లోని స్టేజీపై ఓ పక్కన పడుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మహీకా రియాక్షన్
హార్దిక్ పాండ్య, మహీకా శర్మ బిహేవియర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా త్రివర్ణ పతాకాన్ని భుజాల పై నుంచి ముడివేసుకుని హార్దిక్ ఇలా చేయడం కరెక్ట్ కాదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై హార్దిక్ ఇంకా స్పందించలేదు. కానీ మహీకా వీటిని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఆమె స్పందిస్తూ ఓ మీమ్ ను పోస్టు చేసింది.
నెవర్ సెటిల్
ట్రోల్స్ కు రియాక్టవుతూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మహీకా శర్మ ఓ కౌంటర్ పోస్టు చేసింది. ఆమె ఒక మీమ్‌ను పంచుకుంది. దానిలో "జా తూ, మహీకా జిత్నా లక్ మేరీ జిందగీ మే ఆనా (నువ్వు వెళ్లు, నా జీవితంలోకి కూడా మహికా లాంటి అదృష్టం ఉన్న అమ్మాయి రావాలని కోరుకుంటున్నాను)” అని రాసి ఉంది. అందులో ఒక వ్యక్తి ఓ అమ్మాయికి చేతులు జోడిస్తున్నట్లు కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో దీన్ని రీ-షేర్ చేస్తూ.. "ఎప్పుడూ రాజీ పడకండి (నెవర్ సెటిల్)” అని మహీకా రాసింది.
హార్దిక్ పై కంప్లైంట్
టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ మహీకాతో హార్దిక్ పాండ్య ప్రవర్తించిన తీరుపై పోలీసులకు ఓ లాయర్ కంప్లైంట్ చేశాడు. భారత జాతీయ జెండాను హార్దిక్ అగౌరవపరిచాడని పూణేకు చెందిన ఒక న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్రివర్ణ పతాకాన్ని చుట్టుకున్న హార్దిక్.. తన ప్రియురాలు మహీకా శర్మతో కలిసి స్టేజిపై పడుకున్నాడని, ఇది జాతీయ జెండాను అగౌరవపరచడమే అని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు.
{{/usCountry}}టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ మహీకాతో హార్దిక్ పాండ్య ప్రవర్తించిన తీరుపై పోలీసులకు ఓ లాయర్ కంప్లైంట్ చేశాడు. భారత జాతీయ జెండాను హార్దిక్ అగౌరవపరిచాడని పూణేకు చెందిన ఒక న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్రివర్ణ పతాకాన్ని చుట్టుకున్న హార్దిక్.. తన ప్రియురాలు మహీకా శర్మతో కలిసి స్టేజిపై పడుకున్నాడని, ఇది జాతీయ జెండాను అగౌరవపరచడమే అని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు.
{{/usCountry}}