...
...
Next Story

Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో స్ఫూర్తిదాయక వెబ్ సిరీస్ వచ్చేసింది.. ఈ ఫిజిక్స్ వాలా సక్సెస్ స్టోరీ మీకు తెలుసా?

Netflix: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో స్ఫూర్తిదాయకమైన వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సిరీస్ పేరు హలో బచ్చో (Hello Bachhon). సక్సెస్‌ఫుల్ ఎడ్ టెక్ ఫిజిక్స్ వాలా ఫౌండర్ అలఖ్ పాండే సక్సెస్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు.

Published on: Mar 06, 2026 02:55 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'హలో బచ్చో' (Hello Bachhon) వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లోకి శుక్రవారం (మార్చి 6) అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన 'ఫిజిక్స్‌వాలా' (PhysicsWallah) వ్యవస్థాపకుడు అలఖ్ పాండే స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ సిరీస్ మన కళ్ళకు కట్టబోతోంది. మరి ఈ ఫిజిక్స్ వాలా సక్సెస్ స్టోరీ ఏంటన్నది మీకు తెలుసా? ఆ సిరీస్ చూసే ముందే ఆ విషయం తెలుసుకోండి.

'హలో బచ్చో' వెబ్ సిరీస్ వివరాలు

Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో స్ఫూర్తిదాయక వెబ్ సిరీస్ వచ్చేసింది.. ఈ ఫిజిక్స్ వాలా సక్సెస్ స్టోరీ మీకు తెలుసా?
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో స్ఫూర్తిదాయక వెబ్ సిరీస్ వచ్చేసింది.. ఈ ఫిజిక్స్ వాలా సక్సెస్ స్టోరీ మీకు తెలుసా?

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన హలో బచ్చో వెబ్ సిరీస్ ప్రముఖ ఎడ్ టెక్ ఫిజిక్స్‌వాలా ఎదుగుదల, వారు ఎదుర్కొన్న సవాళ్లు, నేటికీ వారు సాగిస్తున్న పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ స్ఫూర్తిదాయక వెబ్ సిరీస్ లో వినీత్ కుమార్ సింగ్ (అలఖ్ పాండే పాత్రలో), విక్రమ్ కొచ్చర్, గిరిజా ఓక్ గోడ్బోలేలాంటి వాళ్లు నటించారు. ప్రతీష్ మెహతా డైరెక్ట్ చేశాడు. యువతలో స్ఫూర్తి నింపే ఎన్నో వెబ్ సిరీస్ నిర్మించిన ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) ఈ సిరీస్ ను కూడా నిర్మించింది.

ఫిజిక్స్‌వాలా ప్రయాణం: ఆరంభం నుండి శిఖరాగ్రం వరకు

అలఖ్ పాండే ప్రయాణం ఒక సామాన్య ఉపాధ్యాయుడు ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో చెప్పే గొప్ప ఉదాహరణ. మొదట యూట్యూబ్ ద్వారా గుర్తింపు (2016-2020) అందుకున్నాడు. అలఖ్ పాండే తన టీచింగ్ స్టైల్ తో యూట్యూబ్‌లో విద్యార్థులకు చేరువయ్యాడు. క్లిష్టమైన ఫిజిక్స్ పాఠాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత.

2022 నాటికి ఫిజిక్స్‌వాలా సుమారు 97.8 కోట్ల లాభాలను ఆర్జించి ఎడ్‌టెక్ రంగంలో సంచలనం సృష్టించింది. ఆన్‌లైన్ నుండి ఆఫ్‌లైన్‌కు విస్తరిస్తూ 'విద్యాపీఠ్' సెంటర్లను 152 నగరాల్లో ప్రారంభించారు. 2025 నాటికి ఈ సంస్థ విలువ సుమారు 35,000-40,000 కోట్లుగా అంచనా వేశారు.

ఎదుర్కొన్న సవాళ్లు, ఆర్ధిక ఒడిదుడుకులు

ఆఫ్‌లైన్ సెంటర్ల అద్దెలు, వేగంగా చేసిన విస్తరణ, ఇతర దిగ్గజ ఎడ్‌టెక్ సంస్థల నుండి ఎదురైన పోటీ ఈ నష్టాలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ సంస్థ ఐపీవో ద్వారా సుమారు 3,820 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ జర్నీ మొత్తాన్ని చూపిస్తూ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన హలో బచ్చో వెబ్ సిరీస్ సాగుతుంది. తెలుగు ఆడియోతోనూ అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe