బాలీవుడ్ ఐకాన్, సీనియర్ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24న 89 ఏళ్ల వయసులో మరణించిన విషయం తెలుసు కదా. ఇప్పుడు మూడు రోజుల తర్వాత అతని భార్య, నటి హేమా మాలిని సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తమ పెళ్లి రోజు ఫొటోలు షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఇది వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని చెప్పింది.
ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్న హేమ

గత కొన్ని సంవత్సరాలలో ధర్మేంద్రతో గడిపిన సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ హేమమాలిని పలు అరుదైన చిత్రాలను పంచుకుంది. ఒక ఫొటోలో వారిద్దరూ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కెమెరాకు నవ్వుతూ పోజులిచ్చారు. పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్నట్లు ఆ ఫొటో చూస్తే తెలుస్తోంది.
మరొక ఫొటోలో ధర్మేంద్ర.. హేమ ఇచ్చిన పూల బొకేను పట్టుకొని కనిపించాడు. ఆ ఫొటోలో 'నా లైఫ్ లవ్ కు జన్మదిన శుభాకాంక్షలు' అనే స్వీట్ నోట్ ఉంది. మూడవ ఫొటోలో ధర్మేంద్ర, కుమార్తె ఈషా డియోల్ ఇద్దరూ ఒకేలాంటి తెల్లటి షర్టులు ధరించి, కెమెరాకు నవ్వుతూ కనిపించారు.
ఈ ఫొటోలను షేర్ చేస్తూ హేమ ఇలా రాసింది. “కొన్ని మధురమైన కుటుంబ క్షణాలు.. ఇవి దాచుకున్న ఫోటోలు” అని చెప్పింది. మరొక పోస్ట్‌లో ఆమె స్పందిస్తూ.. "నేను ఈ ఫోటోలను చూసినప్పుడు నా భావోద్వేగాలు ఉబికి వస్తున్నాయి. అందుకే ఇన్ని ఫోటోలు షేర్ చేశాను. ఈ ఫోటోలు ఇంతవరకు ఎక్కడా పబ్లిష్ చేయలేదు" అని తెలిపింది.
హేమ, ధర్మేంద్ర లవ్ స్టోరీ
ధర్మేంద్ర 1954లో తన 19వ ఏట ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు (సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజీత) ఉన్నారు. ముంబైకి మకాం మార్చిన తరువాత ధర్మేంద్ర మొదటిసారి హేమమాలినిని కలుసుకున్నారు.
{{/usCountry}}ధర్మేంద్ర 1954లో తన 19వ ఏట ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు (సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజీత) ఉన్నారు. ముంబైకి మకాం మార్చిన తరువాత ధర్మేంద్ర మొదటిసారి హేమమాలినిని కలుసుకున్నారు.
{{/usCountry}}'షరాఫత్', 'తుమ్ హసీన్ మై జవాన్' చిత్రాల నుండి మొదలుపెట్టి 'నయా జమానా', 'సీతా ఔర్ గీత', 'రాజా జానీ', 'జుగ్ను', 'పత్థర్ ఔర్ పాయల్', 'ప్రతిజ్ఞ', 'షోలే' వంటి అనేక చిత్రాలలో వారు కలిసి నటించారు. వారిద్దరూ ఒక హిట్ జోడీగా మారారు.
అప్పటికే ధర్మేంద్రకు పెళ్లి అయినప్పటికీ 1980లో హేమను పెళ్లి చేసుకున్నాడు. దీనిపై బహిరంగంగానే విమర్శలు వచ్చినా.. దశాబ్దాలుగా వాళ్ల బంధం నిలిచింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఈషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. వార్ డ్రామా మూవీ ‘ఇక్కిస్’లో ఆగస్త్య నందాతో కలిసి ధర్మేంద్ర చివరిసారిగా తెరపై కనిపించనున్నాడు.