...
...
Next Story

హీరోయిన్‌ పక్కన క్యారెక్ట‌ర్ అని పిలిచి అవ‌మానించారు.. క‌ట్ చేస్తే కీర్తి సురేష్‌తో హ‌గ్‌.. సుహాస్ కామెంట్స్ వైరల్

నేచురల్ యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకున్న హీరో సుహాస్. తన విలక్షణ నటనతోనూ విలన్ గానూ అదరగొట్టాడు. ఇప్పుడు హే బల్‌వంత్‌ అంటూ థియేటర్లకు రాబోతున్నాడు. గతంలో తనకు జరిగిన అవమానం గురించి హే హే బల్‌వంత్‌ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో సుహాస్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: Feb 18, 2026, 09:13:03 IST
Advertisement

చిన్న హీరోగా మొదలై ఇప్పుడు తనకంటూ ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నాడు. మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి సుహాస్ ఒకప్పుడు తనకు అవమానం జరిగిన విషయాన్ని తాజాగా బయటపెట్టాడు. ఈ కామెంట్లు వైరల్ గా మారాయి.

హే బల్‌వంత్‌ ప్రి రిలీజ్

ప్రి రిలీజ్ ఈవెంట్లో శివాని, సుహాస్, సందీప్ కిషన్ (x/connect2vamsi)
ప్రి రిలీజ్ ఈవెంట్లో శివాని, సుహాస్, సందీప్ కిషన్ (x/connect2vamsi)

సుహాస్, శివాని నాగారం జంటగా నటించిన మూవీ ‘హే బల్‌వంత్‌’. ఈ చిత్రం ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం (ఫిబ్రవరి 17) మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సందీప్ కిషన్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో సుహాస్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా కోసం అని పిలిచి అవమానించారని పేర్కొన్నాడు.

సినిమా కోసం పిలిచి

హే బల్‌వంత్‌ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో సుహాస్ మాట్లాడుతూ.. ‘‘ఒక పెద్ద హీరోయిన్ సినిమాలో మంచి క్యారెక్టర్ అని పిలిచారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ హీరోయిన్, నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండే క్యారెక్టర్ అని చెప్పారు. ఓ పెద్దాయన ఏమో ఇతణ్ని ఎందుకు పిలిచారని నా ముందే అన్నాడు. థ్యాంక్స్ అండి. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సుహాస్, కీర్తి సురేష్ కలిసి ఉప్పుకప్పురంబు అనే సినిమా వచ్చింది’’ అని సుహాస్ వెల్లడించాడు.

కీర్తి సురేష్ హగ్

హీరో అంటే

‘‘హీరో అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. మీ ముందు ఏ క్వాలిటీస్ లేని పెద్ద ఎగ్జాంపుల్ నేనే. నేనే హీరో అయినప్పుడు మీరందరూ ఈజీగా అయిపోవచ్చు’’ అని సుహాస్ తన స్పీచ్ లో పేర్కొన్నాడు.

2020లో వచ్చిన కలర్ ఫొటోతో హీరోగా డెబ్యూ చేసిన సుహాస్ ఒక్కో మెట్టు ఎక్కుతూ సాగుతున్నాడు. ఓ వైపు క్యారెక్టర్లు చేస్తూనే మరోవైపు హీరోగానూ అదరగొడుతున్నారు. హిట్ ది సెకండ్ కేస్ లో విలన్ గానూ భయపెట్టాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks