...
...
Next Story

మకుటం నుంచి నచ్చాకే వచ్చేరా సాంగ్ రిలీజ్- దర్శకులందరి టెక్నిక్స్ వాడాను- అర్జున్, ఆర్జీవీకి థ్యాంక్స్- విశాల్ కామెంట్స్

Vishal Comments In Makutam Nachchaake Vachera Song Launch: హీరో విశాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న లేటెస్ట్ మూవీ మకుటం. ఇటీవల మకుటం సినిమా నుంచి నచ్చాకే వచ్చేరా సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో హీరో విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ అర్జున్, ఆర్జీవీకి థ్యాంక్స్ చెప్పారు.

Published on: Jun 30, 2026, 12:14:15 IST
Advertisement

Vishal Comments In Makutam Nachchaake Vachera Song Launch: సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో విశాల్

మకుటం నుంచి నచ్చాకే వచ్చేరా సాంగ్ రిలీజ్- దర్శకులందరి టెక్నిక్స్ వాడాను- అర్జున్, ఆర్జీవీకి థ్యాంక్స్- విశాల్ కామెంట్స్
మకుటం నుంచి నచ్చాకే వచ్చేరా సాంగ్ రిలీజ్- దర్శకులందరి టెక్నిక్స్ వాడాను- అర్జున్, ఆర్జీవీకి థ్యాంక్స్- విశాల్ కామెంట్స్

ఈ మూవీ నుంచి వచ్చిన మకుటం టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ అఫ్ లింగా’ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 28) నాడు సెకండ్ సింగిల్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

విశాల్ మాట్లాడుతూ .. "‘మకుటం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నందుకు ఆనందంగా ఉంది. ఈ సారి దర్శకుడిగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. ‘శివ’ చూసిన తరువాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది" అని అన్నారు.

నేను 45వ వ్యక్తిని

"ఈరోజు ఆర్‌బీ చౌదరి గారిని నేను మిస్ అవుతున్నాను. 99వ ప్రాజెక్ట్‌ బాధ్యతల్ని ఆయన నాకు ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీకి దర్శకుడిగా మారాను. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానే అనుకుంటున్నాను. ఆయన బ్యానర్ నుంచి పరిచయం అయిన దర్శకుల్లో నేను 45వ వ్యక్తిని. సుబ్రహ్మణ్యం గారు నా మీద పెట్టుకున్న నమ్మకంతోనే ‘మకుటం’ ఈ స్థాయి వరకు వచ్చింది" అని విశాల్ తెలిపారు.

"దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. నన్ను నమ్మి ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన తోటి ఆర్టిస్టులందరికీ థాంక్స్. నేను ఇంత వరకు పని చేసిన దర్శకులందరి టెక్నిక్స్‌ను ఇందులో వాడాను. ఈ సినిమా కోసం నా బెస్ట్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. మూవీ గురించి నేను ఎక్కువగా చెప్పను. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఆడియెన్స్ మాట్లాడతారు" అని హీరో విశాల్ ధీమా వ్యక్తం చేశారు.

"మా నాన్న జీకే రెడ్డి గారి వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను. ‘పందెంకోడి’ మూవీని ఆయనే పట్టుబట్టి తెలుగులో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దర్శకుడిగా మీ ముందుకు రాబోతోన్నాను. నన్ను ప్రభావితం చేసిన అర్జున్ గారికి, ఆర్జీవీ గారికి థాంక్స్" అని చెప్పుకొచ్చారు విశాల్.

22 ఏళ్లలో 35 సినిమాలు

"గత 22 ఏళ్లలో 35 చిత్రాలు చేశాను. ఇంత వరకు నన్ను అభిమానించిన, ఆదరించిన ప్రేక్షకదేవుళ్లకు థాంక్స్. ‘మకుటం’ ఎలా ఉంది అనేది నేనే ఆడియెన్స్ వద్దకు వచ్చి తెలుసుకుంటాను. ‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు. ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాను" అని హీరో విశాల్ తన స్పీచ్ ముగించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe