...
...
Next Story

Hero Vishal Tweet : 'డియర్ విజయ్... మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు' - గవర్నర్ కు హీరో విశాల్ ప్రశ్నలు

Hero Vishal Tweet OnTVK Government : తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠపై నటుడు విశాల్ స్పందించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన నిబంధనలనే విజయ్ విషయంలోనూ పాటించాలని…. ప్రజల తీర్పును గౌరవించాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు.

Published on: May 7, 2026, 16:27:32 IST
Advertisement

Hero Vishal Tweet On TVK Government Formation : తమిళనాడు రాజకీయాల్లో టీవీకే (TVK) అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం ఇప్పుడు చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి విజయ్‌కు అవకాశం ఇవ్వడంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ జాప్యం చేస్తున్నారంటూ ప్రముఖ నటుడు(హీరో) విశాల్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.

అలా ఎందుకు చేయటం లేదు..? హీరో విశాల్ ప్రశ్నలు

విజయ్ - విశాల్ (ఫైల్ ఫొటో)
విజయ్ - విశాల్ (ఫైల్ ఫొటో)

2017-18 కాలంలో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎదురైన రాజకీయ పరిస్థితులను విశాల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. "ఆయా రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ లేకపోయినప్పటికీ, అతిపెద్ద పార్టీలను లేదా కూటములను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్లు ఆహ్వానించారు. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా 'ఫ్లోర్ టెస్ట్' ద్వారా బలాన్ని నిరూపించుకోమని ఆదేశించారు. మరి అదే పద్ధతిని తమిళనాడులో విజయ్…. విషయంలో ఎందుకు అనుసరించడం లేదు…?" అని విశాల్ ప్రశ్నించారు.

విజయ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "డియర్ విజయ్… మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక ఓటరుగా నేను అదే కోరుకుంటున్నాను" అంటూ హీరో విశాల్ తన మద్దతును ప్రకటించారు.

ప్రస్తుతం టీవీకే కూటమికి 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, మేజిక్ ఫిగర్ 118కి మరో ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశాల్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks