...
...
Next Story

సెక్సీ లింగరీ వేసుకోమన్నారు.. నా బాడీని చూస్తామన్నారు.. లైంగిక వేధింపులపై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యంగా తెలుగు ఆడియన్స్ కు చాలా దగ్గరైన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. యాక్టింగ్ లో అదరగొట్టే ఈ భామ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. తనను లింగరీ (లో దుస్తులు) వేసుకోమన్నారని, శరీరాన్ని చూస్తామన్నారని ఆరోపించింది.

Published on: Jan 31, 2026, 16:41:14 IST
Advertisement

తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువైంది. అయితే ఈ హీరోయిన్ చిత్ర పరిశ్రమల్లో స్టార్‌గా ఎదిగే ముందు ఒక ఫోటోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది.

ఐశ్వర్య రాజేష్ ఆరోపణలు

ఐశ్వర్య రాజేష్
ఐశ్వర్య రాజేష్

హీరోయిన్ గా వెలుగులోకి రాకముందు తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని ఐశ్వర్య రాజేష్ పంచుకుంది. నిఖిల్ విజయేంద్ర సింహాతో జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో యంగ్ ఏజ్ లో ఒక ఫోటోషూట్ సమయంలో ఫొటోగ్రాఫర్ లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఐశ్వర్య తెలిపింది. లింగరీ (లో దుస్తులు) ధరించాలని, బాడీ చూస్తామని అన్నాడని చెప్పింది.

సెక్సీ లో దుస్తులు

ఐశ్వర్య రాజేష్ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. “నేను సినిమాల్లోకి రాకముందు ఈ ఘటన జరిగింది. నన్ను ఓ ఫోటోషూట్‌కు పిలిచారు. నేను నా బ్రదర్ తో కలిసి వెళ్లా. నా బ్రదర్ ను బయట ఉండమనిన చెప్పారు. నన్ను లోపలికి తీసుకెళ్లారు. నాకు సెక్సీ లోదుస్తులు ఇచ్చి.. ‘ఇవి వేసుకో, నీ శరీరాన్ని చూడాలి’ అని ఫొటోగ్రాఫర్ అన్నాడు’’ అని తెలిపింది.

ఒప్పించాలని చూశారు

‘‘అప్పటికీ వయసులో చిన్నదాన్ని కాబట్టి ఏం జరుగుతోందో వెంటనే నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్, ఇతరులు నన్ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. వారు నన్ను మరింతగా ఫోర్స్ చేసి ఉంటే వాటిని వేసుకునేదాన్నేమో. కానీ నేను నా సోదరుడిని అడుగుతానని చెప్పి బయటకు వచ్చేశా. అక్కడి నుంచి వెళ్లిపోయా. ఎంతమంది చిన్న అమ్మాయిలతో వారు ఇలా ప్రవర్తించారో అని షాక్ కు గురయ్యా’’ అని ఐశ్వర్య రాజేష్ వెల్లడించింది.

ఐశ్వర్య రాజేష్ కెరీర్

1995లో వచ్చిన 'రాంబంటు' చిత్రంలో బాలనటిగా కనిపించింది ఐశ్వర్య రాజేష్. 2010లో వచ్చిన తమిళ చిత్రం 'నీథానా అవన్' తో డెబ్యూ చేసింది ఐశ్వర్య. 2015లో వచ్చిన 'కాకా ముట్టై' చిత్రంతో సక్సెస్ చూసింది. 2025 సంక్రాంతికి రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరో. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks