Manasa Varanasi: ఇదేం పిచ్చి? తిరుమలలో సెల్ఫీల కోసం మానస వారణాసిని చుట్టేసిన జనాలు.. హీరోయిన్ పరుగో పరుగు.. వీడియో వైరల్

Manasa Varanasi: ప్రశాంతంగా తిరుమలేశుని దర్శనం చేసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ మానస వారణాసికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆమె గుడిలో నుంచి బయటకు రాగానే సెల్ఫీలంటూ జనాలు తనను చుట్టుముట్టేశారు. దీంతో పరుగో పరుగని ఆమె కారు దగ్గరకు పరుగెత్తుకెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Published on: Aug 15, 2026, 13:58:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Manasa Varanasi: పబ్లిక్ ప్లేస్ ల్లో సెలబ్రిటీలు కనపడితే చాలు జనాలు ఎగబడిపోతున్నారు. ఫొటోలు, వీడియోలంటూ తోసేసుకుంటున్నారు. షాపింగ్ మాల్స్, షూటింగ్ స్పాట్స్ పక్కనపెడితే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలోనూ ఇదే పద్ధతి కనిపిస్తోంది. తాజాగా తిరుమలలో టాలీవుడ్ హీరోయిన్ మానస వారణాసికి ఇలాంటి షాకింగ్ సంఘటనే ఎదురైంది.

ఇదేం పిచ్చి? తిరుమలలో సెల్ఫీల కోసం మానస వారణాసిని చుట్టేసిన జనాలు.. హీరోయిన్ పరుగో పరుగు.. వీడియో వైరల్
ఇదేం పిచ్చి? తిరుమలలో సెల్ఫీల కోసం మానస వారణాసిని చుట్టేసిన జనాలు.. హీరోయిన్ పరుగో పరుగు.. వీడియో వైరల్

తిరుమలలో మానస వారణాసి

అందంతో పాటు అభినయంతోనూ అలరించే టాలీవుడ్ హీరోయిన్ మానస వారణాసి రీసెంట్ గా తిరుమలకు వెళ్లింది. ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అయితే బయటకు వచ్చిన తర్వాత మాత్రం మానస వారణాసికి ఊహించిన సంఘటన ఎదురైంది. ఆమెతో సెల్ఫీలు తీసుకోవడం కోసం జనాలు ఎగబడ్డారు.

సెల్ఫీల కోసం

గుడి బయట మానస వారణాసిని చూసిన జనాలు ఆమెతో సెల్ఫీల కోసం చుట్టుముట్టేశారు. ఇందులో సేవకులు కూడా ఉండటం గమనార్హం. మానసతో ఫొటో తీసుకోవడం కోసం ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఆమెపైకి దూసుకెళ్లారు. ఈ హఠాత్పరిణామంతో షాక్ అయిన మానస వారణాసి తన కార్లోకి ఎక్కడానికి పరుగులు కూడా పెట్టింది.

కారు దగ్గర కూడా

మానస వారణాసి అక్కడి నుంచి తప్పించుకునేందుకు తన కారు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. అయినా కూడా జనాలు వదల్లేదు. కారులోకి ఎక్కనీయకుండా మరీ ఫొటోలు తీసుకున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో మానస వారణాసి ఉండిపోయింది.

వీడియో వైరల్

మానస వారణాసికి తిరుమలలో జరిగిన సంఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మానస వారణాసి తప్పించుకొని పరుగెత్తుతున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

సినిమా సెలబ్రిటీల పట్ల జనాల్లో ఆరాధన భావం ఉండటంలో తప్పు లేదు. అభిమానించడంలోనూ ఎలాంటి సమస్యా లేదు. కానీ ఆ సెలబ్రిటీలు ఇలా బయటకు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగించడం మాత్రం కరెక్ట్ కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలతో ఫొటోలు దిగి స్టేటస్ పెట్టుకుంటే గొప్ప అని జనాలు ఫీల్ అవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

మానస వారణాసి గురించి

మిస్ ఇండియా 2020లో విన్నర్ గా నిలవడంతో ఒక్కసారిగా తెలంగాణ అమ్మాయి అయిన మానస వారణాసి పేరు మార్మోగిపోయింది. ఆమె మిస్ వరల్డ్ 2022లో పోటీపడింది. టాప్ 13లో నిలిచింది. 2024లో వచ్చిన దేవకీ నందన వాసుదేవ సినిమాతో మానస వారణాసి డెబ్యూ చేసింది.

2026లో సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో మానస వారణాసి సక్సెస్ అందుకుంది. ఈ మూవీతో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More