...
...
Next Story

Niti Taylor: పడుకుంటేనే మరో సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. సౌత్ డైరెక్టర్‌పై హీరోయిన్ నీతి టేలర్ సంచలన ఆరోపణలు!

Niti Taylor: హీరోయిన్ నీతి టేలర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో ట్రెండింగ్ లోకి వచ్చారు. ఆమె ఓ సౌత్ డైరెక్టర్ పై సెన్సేషనల్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు తనతో పడుకోవాలని ఆ డైరెక్టర్ అడిగాడని నీతి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Published on: Oct 13, 2026, 10:54:00 IST
Advertisement

Niti Taylor: తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి నీతి టేలర్. ఆమె కెరీర్ ఆరంభంలో సౌత్ చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెడుతూ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, గతంలో తాను పనిచేసిన ఒక దర్శకుడే మరో సినిమా అవకాశం ఇస్తానని చెప్పి, అందుకు ప్రతిఫలంగా తనతో పడుకోవాలని అసభ్యకరమైన డిమాండ్ చేశాడని వెల్లడించారు.

అసలేం జరిగింది?

పడుకుంటేనే మరో సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. సౌత్ డైరెక్టర్‌పై హీరోయిన్ నీతి టేలర్ సంచలన ఆరోపణలు!
పడుకుంటేనే మరో సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. సౌత్ డైరెక్టర్‌పై హీరోయిన్ నీతి టేలర్ సంచలన ఆరోపణలు!

కెరీర్ ప్రారంభంలో సౌత్ ఇండస్ట్రీలో రెండు సినిమాలు చేసిన తర్వాత జరిగిన సంఘటనను నీతి టేలర్ గుర్తు చేసుకున్నారు. తన మొదటి సినిమాకు పనిచేసిన సదరు డైరెక్టర్.. కొత్త ప్రాజెక్ట్ ఉందని చెబుతూ ఫోన్ చేశారని నీతి పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన నేరుగా.. "మరో సినిమా ఆఫర్ ఉంది. కానీ ఆ రోల్ కావాలంటే నాతో పడుకోవాల్సి ఉంటుంది" అని అడిగినట్లు నీతి తెలిపారు.

ఏడుస్తూ తల్లికి ఫోన్

డైరెక్టర్ నుంచి ఆ మాట వినగానే తీవ్రమైన షాకింగ్ కు గురయ్యానని, ఏం మాట్లాడాలో తోచక వెంటనే కాల్ కట్ చేసి అతడి నంబర్ బ్లాక్ చేశానని నీతి టేలర్ చెప్పారు. వెంటనే ఏడుస్తూ తల్లికి ఫోన్ చేసి ఈ విషయాన్ని పంచుకున్నానని ఆమె పేర్కొన్నారు.

ఆ డైరెక్టర్ అంతకుముందు ఇతర మహిళలతో అసభ్యంగా వ్యవహరించడం చూశానని, కానీ తనతో కూడా అలా ప్రవర్తిస్తాడని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చేదు ఘటనతో తీవ్రంగా కలత చెందిన నీతి టేలర్.. ఆ తర్వాత సౌత్ సినిమాలకు పూర్తిగా దూరమై టెలివిజన్ రంగంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

టాలీవుడ్‌లో చేసిన సినిమాలు

• పెళ్లి పుస్తకం (2013): ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ సరసన రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి పుస్తకం' సినిమాలో నీతి టేలర్ నటించారు.

• లవ్ డాట్ కామ్: 'లవ్ డాట్ కామ్' అనే చిన్న చిత్రంలోనూ నీతి టేలర్ కనిపించారు.

ఈ చిత్రాల తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చినా, డైరెక్టర్ చేసిన అసభ్యకర డిమాండ్ కారణంగా ఆమె టాలీవుడ్ సహా సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్‌లకు గుడ్ బై చెప్పారని టాక్.

నీతి టేలర్ కెరీర్

సినిమాలకు దూరమైనప్పటికీ హిందీ టెలివిజన్ రంగంలో నీతి టేలర్ టాప్ స్టార్ గా ఎదిగారు. 2009లో ప్యార్ కా బంధన్ సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టిన ఆమె, ఎంటీవీలో ప్రసారమైన యూత్ పాపులర్ షో 'కైసీ యే యారియాన్' (Kaisi Yeh Yaariaan) ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇందులో నందిని మూర్తిగా ఆమె పాత్ర, పార్థ్ సమథాన్‌తో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఆ తర్వాత గులామ్, ఇష్క్‌బాజ్, బడే అచ్ఛే లగ్తే హైన్ 2 వంటి విజయవంతమైన సీరియల్స్‌లో లీడ్ రోల్స్ పోషించారు. పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్‌లా జా 10 లో కంటెస్టెంట్‌గా పాల్గొని సెమీఫైనల్ వరకు వెళ్లి ప్రేక్షకులను మెప్పించారు. 2020లో చిన్ననాటి స్నేహితుడు, ఆర్మీ అధికారి అయిన అంకిత్ బావాలను ఆమె వివాహం చేసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks