Payal Rajput: సోషల్ మీడియా వేదికగా తన శరీరాకృతిపై వస్తున్న అసభ్యకర కామెంట్లు, వైరల్ అవుతున్న వీడియోలపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఎక్స్ (ట్విట్టర్)లో విరుచుకుపడింది. బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్న నెటిజన్లకు ఆమె గట్టిగా బుద్ధి చెప్పింది.
మీకు సిగ్గుండాలి

మంగళవారం (అక్టోబర్ 20) అర్ధరాత్రి దాటిన తర్వాత పాయల్ రాజ్‌పుత్ తన ఎక్స్ అకౌంట్లో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది.
"మీకు సిగ్గుండాలి. నా శరీరం గురించి అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ, ఆ వీడియోలను షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. నా శరీరం, నా సైజ్, నా గర్వం. ఇవి మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు లేదా మీ అశ్లీలతకు సంబంధించిన విషయాలు కావు. మీ పరిధిలో మీరు ఉండండి, మీ పని మీరు చూసుకోండి" అని పాయల్ పోస్టు చేసింది.
పాయల్ కు కోపం
పాయల్ తాజా పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హీరోయిన్ల బాడీని ట్రోల్స్ చేయడం, వాళ్ల వీడియోలను ఏఐతో మార్ఫింగ్ చేసి పోస్టు చేయడం ఎక్కువైంది. ఈ విషయంపై ఇప్పటికే డిబేట్ జరుగుతోంది. ఈ సమయంలో హీరోయిన్ పాయల్ ట్వీట్ చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఆర్ఎక్స్ 100 సంచలనం
ఢిల్లీకి చెందిన పాయల్ రాజ్‌పుత్ హిందీ టెలివిజన్ రంగంతో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ‘సప్నోన్ సే భరే నైనా’ వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత పంజాబీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి సినిమా ‘చన్నా మేరేయా’ (2017)తోనే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పంజాబీ అవార్డును దక్కించుకుంది.
అయితే, తెలుగులో కార్తికేయ సరసన నటించిన ఆర్ఎక్స్ 100 (2018) సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులోని ఇందు పాత్రలో ఆమె అద్భుతమైన నటన, గ్లామర్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుని రాత్రికి రాత్రే ఆమెను స్టార్‌గా నిలబెట్టాయి.
ఈ సినిమాలు
{{/usCountry}}అయితే, తెలుగులో కార్తికేయ సరసన నటించిన ఆర్ఎక్స్ 100 (2018) సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులోని ఇందు పాత్రలో ఆమె అద్భుతమైన నటన, గ్లామర్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుని రాత్రికి రాత్రే ఆమెను స్టార్‌గా నిలబెట్టాయి.
ఈ సినిమాలు
{{/usCountry}}‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఆమె వరుసగా ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి క్రేజీ ప్రాజెక్టులలో భాగమైంది. ఇటీవల (2023) దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన మంగళవారం సినిమాలో ఆమె ప్రదర్శించిన డీ-గ్లామర్, బోల్డ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘రక్షణ’ (2024) చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది.
సరిహద్దులు దాటవద్దంటూ హెచ్చరిక
పాయల్ కేవలం సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ ఎంతో ధైర్యంగా, ముక్కుసూటిగా ఉంటారు. ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఛానెల్‌పై వస్తున్న అంచనాలకు స్పందిస్తూ.. "ఎవరైనా కేవలం హాట్ పిక్చర్స్ లేదా బోల్డ్ కంటెంట్ కోసమే సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే దయచేసి చేయవద్దు. ఇది కేవలం నా తెరవెనుక నిజ జీవితాన్ని పంచుకోవడానికే" అని స్పష్టం చేసింది.