కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ సంచలన కామెంట్లకు మద్దతు పెరుగుతోంది. హీరోయిన్లను బ్యాక్ సైడ్ నుంచి జూమ్ చేస్తూ బాడీ పార్ట్స్ పై ఫోకస్ పెట్టేలా ఫొటోలు, వీడియోలు తీయొద్దని సప్తమి గౌడ్ రిక్వెస్ట్ చేసింది. ఇలా ఇబ్బంది పెట్టే యాంగిల్స్ లో ఫొటోలు తీయడాన్ని ఖండించింది. ఇప్పుడు సప్తమి గౌడకు హీరోయిన్లు ఆషికా రంగనాథ్, రుక్మిణి వసంత్, దివ్య సపోర్ట్ గా నిలిచారు.
హీరోయిన్ల సపోర్ట్

సప్తమి గౌడ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ఆషికా రంగనాథ్, రుక్మిణి వసంత్, దివ్య తమ మద్దతు తెలిపారు. సప్తమి పోస్టును తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో షేర్ చేశారు. ‘‘రెస్పెక్ట్ అనేది ఉండాలి. కావాలని తీసే జూమ్ ఇన్ ఫొటోలు, అనుచితమైన యాంగిల్స్ అగౌరవాన్ని కలిగిస్తాయి. ఇవి ఆమోదయోగ్యం కాదు’’ అని ఆషికా రంగనాథ్ పేర్కొంది.
సప్తమి గౌడ పోస్ట్
మహిళా సెలబ్రిటీల వెనుక నుండి ఫోటోలు తీయడంపై సప్తమి గౌడ ఫైర్ అయింది. బయట ఈవెంట్లలో హీరోయిన్లను ఇలా అగౌరవపరిచేలా వీడియోలు, ఫొటోలు తీయడాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సప్తమి తీవ్రంగా ఖండించింది. అలాంటి కంటెంట్ ను సహించకూడదని పేర్కొంది.
{{/usCountry}}మహిళా సెలబ్రిటీల వెనుక నుండి ఫోటోలు తీయడంపై సప్తమి గౌడ ఫైర్ అయింది. బయట ఈవెంట్లలో హీరోయిన్లను ఇలా అగౌరవపరిచేలా వీడియోలు, ఫొటోలు తీయడాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సప్తమి తీవ్రంగా ఖండించింది. అలాంటి కంటెంట్ ను సహించకూడదని పేర్కొంది.
{{/usCountry}}"సినిమా ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులుగా మేం ఎప్పుడూ రిపీట్ అవుతున్న సమస్యను పరిష్కరించడానికి కలిసి నిలబడతాం. బయట ఈవెంట్లలో హీరోయిన్లను అనుచిత యాంగిల్స్ నుంచి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. మేం చేసే పనిపై ఫోకస్ చేయకుండా మా బాడీ పార్ట్స్ పై దృష్టి పెడుతూ జూమ్ చేసి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు’’ అని సప్తమి తన పోస్టులో పేర్కొంది.
సినిమా కోసం
‘‘కొద్దిమంది వ్యక్తులు ఇలా ప్రవర్తించడం సరికాదు. ఇది అగౌరవపరిచినట్లే. దీన్ని సహించేది లేదు. ఇది ఆమోదయోగ్యం కాదు. మేం యాక్టింగ్ చేయడం కోసమే ఇక్కడున్నాం. మేం సినిమా కోసమే పని చేస్తున్నాం. కావాలని జూమ్ చేసి ఫొటోలు తీయడాన్ని, అనుచితమైన యాంగిల్స్ లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈవెంట్ కు వచ్చే ఫొటోగ్రాఫర్లు తమ మర్యాదను పాటించాలని ఆశిస్తున్నాం’’ అని సప్తమి ఫైర్ అయింది.
సపోర్ట్ చేయాలని
‘‘లేడీస్ ను అసభ్యంగా క్యాప్చర్ చేసి, ప్రొజెక్ట్ చేసే విషయంలో క్రూరంగా వ్యవహరించే కొంతమందికి వ్యతిరేకంగా నిలవాలి. మాకు మీడియా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి. ఇది సరైన పద్ధతి కాదు. హీరోయిన్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అనుచితంగా ఫొటోలు తీసేవాళ్లను అడ్డుకోవాలి’’ అని సప్తమి గౌడ్ తన ఇన్ స్టా పోస్టులో పేర్కొంది.