...
...
Next Story

Web Series: ఆరేళ్లుగా ఇండియాలో నంబర్ 1 వెబ్ సిరీస్ ఇదే.. మీర్జాపూర్, పంచాయత్‌లను వెనక్కి నెట్టి.. టాప్ ఐఎండీబీ రేటింగ్

Web Series: ఇండియాలో నంబర్ వన్ వెబ్ సిరీస్ ఏదో తెలుసా? ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ఈ వెబ్ సిరీస్ పేరు స్కామ్ 1992. సోనీలివ్ ఓటీటీలో ఆరేళ్లుగా ఈ సిరీస్ తిరుగులేని ఆదరణతో దూసుకెళ్తోంది.

Published on: Jun 18, 2026, 21:43:02 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Web Series: ఇండియన్ ఓటీటీ (OTT) వరల్డ్‌లో బెస్ట్ వెబ్ సిరీస్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లు 'పంచాయత్', 'ది ఫ్యామిలీ మ్యాన్', 'మీర్జాపూర్' లేదా 'పాతాల్ లోక్'. కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్‌లు కోట్ల మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాయి.

Web Series: ఆరేళ్లుగా ఇండియాలో నంబర్ 1 వెబ్ సిరీస్ ఇదే.. మీర్జాపూర్, పంచాయత్‌లను వెనక్కి నెట్టి.. టాప్ ఐఎండీబీ రేటింగ్
Web Series: ఆరేళ్లుగా ఇండియాలో నంబర్ 1 వెబ్ సిరీస్ ఇదే.. మీర్జాపూర్, పంచాయత్‌లను వెనక్కి నెట్టి.. టాప్ ఐఎండీబీ రేటింగ్

అయితే గ్లోబల్ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb)లో ఈ పాపులర్ షోల కంటే అత్యధిక రేటింగ్ సాధించి, గత ఆరేళ్లుగా నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ఒక హిందీ వెబ్ సిరీస్ ఉందనే విషయం మీకు తెలుసా? అవును బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన ఆ మాస్టర్‌పీస్ వెబ్ సిరీస్ రికార్డును ఇప్పటివరకు ఏ ఒక్క ఇండియన్ ఓటీటీ కంటెంట్ కూడా బ్రేక్ చేయలేకపోయింది.

ఐఎండీబీ చార్ట్స్‌లో టాప్: ఆ వెబ్ సిరీస్ ఏంటంటే?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా నడిచే ఐఎండీబీలో పదికి 9.2 మైండ్‌బ్లోయింగ్ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది 'స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ' (Scam 1992: The Harshad Mehta Story). సోనీలివ్ (SonyLIV) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఇండియన్ డిజిటల్ స్పేస్‌లోనే ఒక విప్లవాన్ని సృష్టించింది. 2020లో విడుదలైన ఈ సిరీస్ దాదాపు 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా.. నేటికీ రేటింగ్స్ పరంగా దీని దరిదాపుల్లోకి ఏ ఇతర బిగ్ బడ్జెట్ సిరీస్ రాలేకపోయింది.

టాప్ ఇండియన్ వెబ్ సిరీస్ ఐఎండీబీ రేటింగ్స్ (2026 అప్‌డేట్)

- గుల్లక్ (Gullak) — 9.1 / 10

- ఆస్పిరెంట్స్ (Aspirants) — 9.1 / 10

- పంచాయత్ (Panchayat) — 9.0 / 10

- ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man) — 8.7 / 10

- మీర్జాపూర్ (Mirzapur) — 8.5 / 10

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 'సప్నే వర్సెస్ ఎవ్రీవన్' అనే మరో వెబ్ సిరీస్ కూడా 9.2 రేటింగ్ సాధించినప్పటికీ.. పాపులారిటీ, వ్యూవర్‌షిప్ పరంగా 'స్కామ్ 1992' టాప్‌లో కొనసాగుతోంది.

రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రతీక్ గాంధీ

ఈ వెబ్ సిరీస్ సాధించిన అసాధారణ విజయానికి ముఖ్య కారణం లీడ్ రోల్ పోషించిన గుజరాతీ థియేటర్ ఆర్టిస్ట్ ప్రతీక్ గాంధీ. స్టాక్ మార్కెట్ బుల్ హర్షద్ మెహతా పాత్రలో ఆయన జీవించేశారు. బాడీ లాంగ్వేజ్ నుండి డైలాగ్ డెలివరీ వరకు ప్రతీక్ చూపించిన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.

ఈ వెబ్ సిరీస్‌లోని "లోచా, లాఫా యా లాప్సీ.. ఈ మూడింటికీ దూరంగా ఉండాలి", అలాగే "సక్సెస్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ తర్వాత వచ్చే నెక్స్ట్ చాప్టర్" వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. దీనితో పాటు దీని ఐకానిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

స్కామ్ 2003 ఎందుకు క్లిక్ అవ్వలేదు?

'స్కామ్ 1992' ఇచ్చిన బూస్ట్‌తో దర్శకుడు హన్సల్ మెహతా, సోనీలివ్ సంస్థ ఈ ఫ్రాంచైజీలో భాగంగా రెండో సీజన్‌గా 'స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ' (Scam 2003: The Telgi Story)ని తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద స్టాంప్ పేపర్ స్కామ్ కింగ్‌పిన్ అబ్దుల్ కరీమ్ తెల్గీ జీవితం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది.

అయితే కథనంలో మొదటి సీజన్ లాంటి గ్రిప్పింగ్ డ్రామా లేకపోవడంతో ఇది ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఫలితంగా ఐఎండీబీలో ఈ సిరీస్ కేవలం 7.9 రేటింగ్‌కే పరిమితమైంది.

మంచి ఇంటెన్స్, రియలిస్టిక్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడేవారు, స్టాక్ మార్కెట్ ప్రపంచంలో జరిగిన అతిపెద్ద సంచలనాన్ని అందులోని లొసుగులతో సహా తెలుసుకోవాలనుకుంటే సోనీలివ్‌లో ఉన్న 'స్కామ్ 1992'ను అస్సలు మిస్ అవ్వకండి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe