...
...
Next Story

Obsession in Telugu: గుడ్ న్యూస్.. రూ.5 వేల కోట్ల హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులోనూ.. మరో నాలుగు భాషల్లో..

Obsession in Telugu: హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే శుభవార్త. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' ఎట్టకేలకు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. జియోహాట్‌స్టార్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Nov 13, 2026, 19:34:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Obsession in Telugu: ఓటీటీలోకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ అబ్సెషన్ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ కేవలం ఇంగ్లిష్, హిందీ వెర్షన్ మాత్రం ఉండగా.. తాజాగా తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలనూ అందుబాటులోకి తీసుకొచ్చారు.

అబ్సెషన్.. బాక్సాఫీస్ సెన్సేషన్

Obsession in Telugu: గుడ్ న్యూస్.. రూ.5 వేల కోట్ల హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులోనూ.. మరో నాలుగు భాషల్లో..
Obsession in Telugu: గుడ్ న్యూస్.. రూ.5 వేల కోట్ల హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులోనూ.. మరో నాలుగు భాషల్లో..

హాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశమైన ఇండిపెండెంట్ హారర్ చిత్రాలలో 'అబ్సెషన్' అగ్రస్థానంలో నిలుస్తుంది. యువ దర్శకుడు కర్రీ బార్కర్ (Curry Barker) రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం 7.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 7 కోట్లు) అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందింది.

2025 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, థియేటర్లలో విడుదలయ్యాక ఏకంగా 524.5 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 5 వేల కోట్లు) వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో మైఖేల్ జాన్స్టన్ (Michael Johnston), ఇండే నవారెట్ (Inde Navarrette), కూపర్ టామ్లిన్సన్, మేగాన్ లాలెస్, ఆండీ రిక్టర్ ప్రధాన పాత్రలు పోషించారు.

కోరిక తీరింది.. కానీ పీడకల మొదలైంది: అసలు కథేంటి?

"ఏదైనా కోరుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు" అనే సూత్రం ఆధారంగా ఈ సినిమా కథ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఒక మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే బేర్ (మైఖేల్ జాన్స్టన్) తన ప్రాణ స్నేహితురాలు నిక్కీ (ఇండే నవారెట్) ను రహస్యంగా ప్రేమిస్తుంటాడు. అయితే తన ప్రేమను ఆమెకు చెప్పుకోలేక లోలోపలే మథనపడుతుంటాడు. ఒకరోజు బేర్ అనుకోకుండా ఒక వింత వస్తువును ('One Wish Willow' అనే విష్ స్టిక్) కొనుగోలు చేస్తాడు. నిక్కీ తనను పిచ్చిగా ప్రేమించాలని, తనపై విపరీతమైన వ్యామోహం (Obsession) పెంచుకోవాలని కోరుకుంటూ ఆ స్టిక్‌ను విరుస్తాడు.

గత అక్టోబర్ 30న హాలోవీన్ సందర్భంగా జియోహాట్‌స్టార్ (The Peacock Hub)లో ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదలై భారీ వ్యూస్ రాబట్టింది. దక్షిణాది ప్రేక్షకుల నుంచి వచ్చిన విశేష స్పందన నేపథ్యంలో.. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం 1 గంట 49 నిమిషాల క్రిస్ప్ రన్ టైమ్ ఉండటం వల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా, చివరి వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను అందిస్తుంది.

రొమాన్స్ ముసుగులో సాగే భయానక హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి 'అబ్సెషన్' ఒక అద్భుతమైన వీకెండ్ ఛాయిస్. వెంటనే ఈ సినిమాను జియోహాట్‌స్టార్ లో చూసేయండి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks