హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'వెపన్స్' (Weapons) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జాక్ క్రెగ్గర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మంచి విజయం సాధించింది. జనవరి 8 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా కథ, విశేషాలు ఇవే.
హారర్ థ్రిల్లర్ వెపన్స్ ఓటీటీ స్ట్రీమింగ్

కొత్త ఏడాదిని (2026) ఒక మంచి హారర్ థ్రిల్లర్‌తో మొదలుపెట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసం 'వెపన్స్' సిద్ధంగా ఉంది. 'బార్బేరియన్' వంటి డిఫరెంట్ హారర్ సినిమా తీసిన దర్శకుడు జాక్ క్రెగ్గర్ తెరకెక్కించిన తాజా సినిమా ఇది. ఆగస్టు 2025లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను భయపెట్టడానికి వస్తోంది.
వచ్చే ఏడాది జనవరి 8న ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఉంటుంది. జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. ఇంతకుముందు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు జియోహాట్‌స్టార్ తోపాటు ఓటీటీప్లే ప్రీమియర్ సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి రానుంది.
వెన్నులో వణుకు పుట్టించే కథ
మేబ్రూక్ అనే ఊరిలో జరిగే కథే ఈ వెపన్స్ మూవీ. రాత్రి 2:17 గంటలకు.. ఇళ్లలో ఉన్న 17 మంది చిన్న పిల్లలు ఒకేసారి మాయమైపోతారు. వాళ్లు తిరిగి రారు. ఒక స్కూల్ క్లాస్ రూమ్‌లో మిగిలిన పిల్లలందరూ మాయమైపోతే.. ఒక్క పిల్లాడు (అలెక్స్ లిల్లీ) మాత్రమే మిగులుతాడు. దీంతో అందరి అనుమానం ఆ క్లాస్ టీచర్ జస్టిన్ (జూలియా గార్నర్) మీద పడుతుంది. అసలు ఆ పిల్లలు ఏమయ్యారు? ఆ టీచర్ పాత్ర ఏంటి? ఆ ఒక్క పిల్లాడు ఎలా మిగిలాడు? అనేది ఉత్కంఠ రేపుతుంది.
వెపన్స్ మూవీ గురించి..
కేవలం 38 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ వెపన్స్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 269 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2400 కోట్లు) వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో జూలియా గార్నర్, జోష్ బ్రోలిన్ (థానోస్ ఫేమ్), ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్ కీలక పాత్రల్లో నటించారు.
{{/usCountry}}కేవలం 38 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ వెపన్స్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 269 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2400 కోట్లు) వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో జూలియా గార్నర్, జోష్ బ్రోలిన్ (థానోస్ ఫేమ్), ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్ కీలక పాత్రల్లో నటించారు.
{{/usCountry}}జియోహాట్‌స్టార్ ఈ సినిమా ప్రోమోను షేర్ చేస్తూ.. "రాత్రి 2:17 గంటలకు 17 మంది పిల్లలు అదృశ్యమయ్యారు.. వాళ్లు ఎక్కడికి వెళ్లారు?" అంటూ ఆసక్తిని రేకెత్తించింది. హారర్, సస్పెన్స్ ఇష్టపడేవారికి ఈ వెపన్స్ మూవీ మంచి ఛాయిస్. జనవరి రెండో వీకెండ్ ఈ మూవీని చూడొచ్చు.