...
...
Next Story

కాంతార ఛాప్టర్ 1 అందుకే ఇంత త్వరగా ఓటీటీలోకి.. థియేటర్లలోనూ ఆడుతుంది.. ఆ ఒప్పందం వల్లే ఇలా: నిర్మాత క్లారిటీ

కాంతార ఛాప్టర్ 1 ఊహించిన దాని కంటే చాలా త్వరగానే ఓటీటీలోకి రానుండటంపై మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరైన చలువే గౌడ క్లారిటీ ఇచ్చారు. ఓటీటీలోకి వచ్చినా థియేటర్లలో ఆడుతుందని, హిందీ వెర్షన్ ఇప్పుడు రావడం లేదని స్పష్టం చేశాడు.

Published on: Oct 28, 2025, 20:51:08 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

కాంతార ఛాప్టర్ 1 ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ.800 కోట్లకుపైగా వసూలు చేసి ఈ ఏడాది అత్యధిక వసూళ్ల ఇండియన్ మూవీగా నిలిచింది. అయితే నాలుగు వారాలు కూడా కాకుండానే ఈ సినిమాను అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయనుంది. దీనిపై ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత అవసరం ఏంటన్న విమర్శల మధ్య ప్రొడ్యూసర్ చలువే గౌడ క్లారిటీ ఇచ్చారు.

ఆ ఒప్పందం వల్లే ఇలా..

కాంతార ఛాప్టర్ 1 అందుకే ఇంత త్వరగా ఓటీటీలోకి.. థియేటర్లలోనూ ఆడుతుంది.. ఆ ఒప్పందం వల్లే ఇలా: నిర్మాత క్లారిటీ
కాంతార ఛాప్టర్ 1 అందుకే ఇంత త్వరగా ఓటీటీలోకి.. థియేటర్లలోనూ ఆడుతుంది.. ఆ ఒప్పందం వల్లే ఇలా: నిర్మాత క్లారిటీ

'కాంతార ఛాప్టర్ 1' మూవీ నిర్మాత చలువే గౌడ ఇండియా టుడేతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా సినిమాను చాలా త్వరగా ఓటీటీలోకి తీసుకువస్తుండటంపై స్పందించాడు. చలువే గౌడ మాట్లాడుతూ.. "ప్రస్తుతం సినిమా దక్షిణాది భాషల (తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం) వెర్షన్లు మాత్రమే ఓటీటీలో విడుదల అవుతాయి. హిందీ వెర్షన్ కాదు.

హిందీ వెర్షన్ ఎనిమిది వారాల తర్వాత వస్తుంది. ఈ విడుదల విండోకు సంబంధించిన ఒప్పందం వాస్తవానికి మూడేళ్ల కిందటే జరిగింది. కాబట్టి ఇది మా వైపు నుంచి ఒక బాధ్యత మాత్రమే. అప్పట్లో ఈ ఒప్పంద పద్ధతులు భిన్నంగా ఉండేవి" అని అన్నాడు.

ఓటీటీ విండోలో మార్పులు

దక్షిణాది సినిమాల్లో ఇప్పుడు తక్కువ ఓటీటీ విండోలు సర్వసాధారణంగా మారాయని చలువే గౌడ అన్నాడు. "చాలా దక్షిణాది సినిమాలు ఇప్పుడు నాలుగు వారాల విండోను అనుసరిస్తున్నాయి. కొన్ని ఎక్కువ కాలం నడుస్తాయి. మరికొన్ని మూడు నుండి నాలుగు వారాలలో ముగుస్తాయి. ప్రతి సినిమాకు దాని సొంత ఒప్పందం, టైమ్‌లైన్ ఉంటుంది.

కోవిడ్‌కు ముందు అన్ని సినిమాలకు ఎనిమిది వారాలు ఉండేది. కోవిడ్ తర్వాత కూలీ వంటి పెద్ద సినిమాలు కూడా అన్ని భాషల్లో.. హిందీతో సహా నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. కాబట్టి ఆ సమయంలో ఏది పనిచేస్తుందో దాని ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు" అని వివరించాడు.

థియేటర్లలో రన్ కొనసాగుతుంది

రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి లీడ్ రోల్లో నటించిన మూవీ కాంతార ఛాప్టర్ 1. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజైంది. అయితే నెల రోజులు కూడా గడవక ముందే అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe