Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'కొరియన్ కనకరాజు' నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఎప్పటినుంచో ఈ సినిమా డీటెయిల్స్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కు మేకర్స్ ఓ స్పెషల్ న్యూస్ చెప్పారు. టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ తెరకెక్కుతున్న ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ మూవీ ఫైనల్ గా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
మెర్లపాక గాంధీ మార్క్ యాక్షన్ డ్రామా

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మెర్లపాక గాంధీ ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్', 'ఎక్స్ ప్రెస్ రాజా' లాంటి హిట్స్ తో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గాంధీ.. ఈసారి తన మార్క్ కామెడీ టైమింగ్ కు హారర్ ఎలిమెంట్స్ మిక్స్ చేశాడు.
విభిన్న సంస్కృతుల మధ్య నలిగిపోయే ఒక వ్యక్తి అయోమయం, గుర్తింపు కోసం చేసే పోరాటం చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుందని తెలుస్తోంది. ఇక స్టార్ కమెడియన్ సత్య ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ కామెడీ రోల్ లో కనిపించబోతున్నాడు. వరుణ్, సత్య మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయని టాక్.
తమన్ మ్యూజిక్.. రితికా నాయక్ హీరోయిన్
ఈ కొరియన్ కనకరాజు మూవీలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. తమన్ మార్క్ ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ హారర్ కామెడీకి మెయిన్ పిల్లర్ గా నిలవబోతోంది.
టాలీవుడ్ లో భారీ సినిమాలు తీసే యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ ప్రాజెక్ట్ ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాయి. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
వరుణ్ తేజ్ వింటేజ్ కంబ్యాక్
{{/usCountry}}టాలీవుడ్ లో భారీ సినిమాలు తీసే యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ ప్రాజెక్ట్ ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాయి. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
వరుణ్ తేజ్ వింటేజ్ కంబ్యాక్
{{/usCountry}}వరుణ్ తేజ్ కెరీర్ లో 15వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ మధ్య ఓ ఫన్నీ వీడియోతో మూవీ స్టోరీ లైన్, ఇందులో ఉండబోతున్న హారర్, కామెడీ ఎలిమెంట్స్ గురించి ఓ చిన్న హింట్ ఇచ్చారు. ముఖ్యంగా కమెడియన్ సత్య క్యారెక్టర్ సినిమాకు ప్రధాన బలంగా ఉండబోతున్నట్లు ఆ వీడియో ద్వారా స్పష్టమైంది. గతంలో 'తొలిప్రేమ', 'గద్దలకొండ గణేష్' లాంటి డిఫరెంట్ జానర్స్ తో అదరగొట్టిన వరుణ్.. ఇప్పుడు ఈ 'కొరియన్ కనకరాజు'తో మరోసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడం పక్కా అని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు.