...
...
Next Story

Horror Web Series: ఎటు వెళ్లినా అదే సిటీలోకి.. వెన్నులో వణుకు పుట్టించే హారర్ మిస్టరీ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో!

Horror Web Series: ఆకట్టుకునే మిస్టరీ ఎలిమెంట్స్ తో, వెన్నులో వణుకు పుట్టించే హారర్ స్టోరీతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఒకేసారి మూడు సీజన్లో హిందీ డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అసలు ఈ వెబ్ సిరీస్ ఏంటీ? స్టోరీ ఏంటీ? అనే విషయాలు చూసేయండి.

Published on: Nov 24, 2026, 11:01:44 IST
Advertisement

Horror Web Series: సస్పెన్స్, హారర్, సర్వైవల్ థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే ఓటీటీ ఆడియన్స్ కు ‘ఫ్రమ్’ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తొలి సీజన్ నుంచే అంతుచిక్కని మలుపులతో, ఊహించని భయానక సన్నివేశాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం విశేషం.

‘ఫ్రమ్’ వెబ్ సిరీస్ కథ ఏంటి?

ఎటు వెళ్లినా అదే సిటీలోకి.. వెన్నులో వణుకు పుట్టించే హారర్ మిస్టరీ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో!
ఎటు వెళ్లినా అదే సిటీలోకి.. వెన్నులో వణుకు పుట్టించే హారర్ మిస్టరీ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో!

అమెరికాలోని ఓ అంతుచిక్కని సీక్రెట్ సిటీ చుట్టూ హారర్ థ్రిల్లర్ ‘ఫ్రమ్’ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రయాణిస్తూ రోడ్డుపై పడి ఉన్న ఒక చెట్టును దాటుకుని ఈ పట్టణంలోకి అడుగుపెట్టిన వారు ఎవరూ తిరిగి బయటకు వెళ్లలేరు. ఎంత దూరం ప్రయాణించినా మళ్లీ అదే పట్టణానికి చేరుకుంటూ ఒక విచిత్రమైన లూప్ లో చిక్కుకుపోతారు.

రాత్రి అయితే నరకమే

పగటిపూట సాధారణంగానే కనిపించే ఆ నగరంలో, చీకటి పడిందంటే అసలైన నరకం మొదలవుతుంది. చుట్టుపక్కల ఉన్న దట్టమైన అడవి నుంచి మనుషుల రూపంలో ఉండే భయంకరమైన రాక్షస జీవులు బయటకు వచ్చి వేటాడుతాయి.

ఒక ప్రత్యేకమైన రక్షణ కవచంలా పనిచేసే రాయి ఉన్న ఇళ్లలో తలుపులు వేసుకుని ఉంటే తప్ప ప్రాణాలు దక్కని పరిస్థితి నెలకొంటుంది. ఆ ఊరి వెనుక ఉన్న రహస్యం ఏంటి, అక్కడి ప్రజలు ప్రాణాలు కాపాడుకుంటూ బయటపడే మార్గాన్ని ఎలా వెతుకుతారు అనే అంశాలతో ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

మూడు సీజన్ల రన్‌టైమ్ వివరాలు

భాషల విషయానికి వస్తే, ఇంగ్లీష్ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు భారతీయ ప్రేక్షకుల కోసం హిందీ డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది. అయితే తెలుగు, తమిళ్, మలయాళం డబ్బింగ్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇంగ్లీష్ లేదా హిందీ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ సహాయంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సిరీస్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

థ్రిల్లర్ ప్రియులకు పక్కా బింజ్ వాచ్

సాధారణ హారర్ సిరీస్‌లాగా కేవలం భయపెట్టడానికే పరిమితం కాకుండా, బలమైన మిస్టరీ, మానసిక సంఘర్షణ, మనుగడ పోరాటాన్ని ‘ఫ్రమ్’ ఎంతో ఆసక్తికరంగా చూపిస్తుంది. వీకెండ్ లో లేదా తీరిక సమయంలో వరుసగా చూసేందుకు ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కోసం వెతుకుతున్న వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. నెట్‌ఫ్లిక్స్‌లో మూడు సీజన్లతో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ కచ్చితంగా అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks