OTT Horror: దెయ్యాలు లేవనే ఫ్రెండ్స్ గ్యాంగ్..ఛాలెంజ్ చేసే బాబా.. అదిరే సస్పెన్స్.. మరో ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్

OTT Horror: ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. దెయ్యాలు, ఆత్మలు లేవని నిరూపించే ఫ్రెండ్స్ గ్యాంగ్, ఓ బాబాకు మధ్య ఛాలెంజ్ ఈ మూవీలో అదిరిపోయింది. విజువల్స్ తో భయపెట్టే ఈ హారర్ సినిమా ఏది? దాని కథ ఏంటో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 16, 2026, 05:57:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Horror: తెలుగు చిత్రసీమలో డిజిటల్ మార్కెట్ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. థియేటర్లలో కలెక్షన్లు రాబట్టలేకపోయిన చిన్న, మధ్య తరహా చిత్రాలు ఓటీటీ వేదికగా సెకండ్ ఇన్నింగ్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి తెలుగు హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది.

దెయ్యాలు లేవనే ఫ్రెండ్స్ గ్యాంగ్..ఛాలెంజ్ చేసే బాబా.. అదిరే సస్పెన్స్.. మరో ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్
దెయ్యాలు లేవనే ఫ్రెండ్స్ గ్యాంగ్..ఛాలెంజ్ చేసే బాబా.. అదిరే సస్పెన్స్.. మరో ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్

రెండు ఓటీటీల్లో ఈషా

శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో వచ్చిన ‘ఈషా’ సినిమా గత ఏడాది డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, డిజిటల్ విండోలో మాత్రం ఈ హారర్ థ్రిల్లర్ సినిమా లైఫ్‌టైమ్ వాల్యూను మేకర్స్ అద్భుతంగా క్యాష్ చేసుకుంటున్నారు. ఓటీటీలో ఈ సినిమా సత్తాచాటుతోంది. ఇప్పుడు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

జియోహాట్‌స్టార్‌లో

మొదట ఈషా చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్కడ ఓవర్సీస్ ఆడియన్స్‌తో పాటు ఇండియన్ వీక్షకులను అలరించిన తర్వాత, ఇప్పుడు ఆరు నెలల గ్యాప్‌లో జియోహాట్‌స్టార్‌లోకి కూడా ఈ మూవీ ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అదే కారణం

హిందీ బెల్ట్ లేదా ఉత్తరాది డిజిటల్ ఆడియన్స్‌కు టాలీవుడ్ బోల్డ్ హారర్, మిస్టరీ థ్రిల్లర్లంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ లేని మాస్ ఆడియన్స్‌ను, జియోహాట్‌స్టార్‌లోని భారీ యూజర్ బేస్ ద్వారా రీచ్ అవ్వడమే ఈ సరికొత్త వ్యూహం వెనుక ఉన్న అసలు కారణం. ఒకే కంటెంట్‌ను మల్టిపుల్ ప్లాట్‌ఫామ్స్‌కు నాన్-ఎక్స్‌క్లూజివ్ డీల్ ద్వారా రీ-సెల్ చేయడం వల్ల నిర్మాతలకు అదనపు లాభాలు సమకూరుతాయి.

భయపెట్టే మూవీ

ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈషా చిత్రంలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్, సీనియర్ నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో మెప్పించారు.

స్టోరీ ఏంటంటే?

నలుగురు ఫ్రెండ్స్ నయన, అపర్ణ, కళ్యాణ్, వినయ్ దెయ్యాలు, ఆత్మలు లేవని నమ్ముతారు. వీటి పేరుతో ప్రజలను మోసం చేస్తున్న దొంగ స్వామీజీలు, ఫేక్ బాబాల గుట్టు రట్టు చేస్తుంటారు. వీళ్లంతా ఒక టీమ్ గా ఏర్పడి బాబాల అసలు విషయాలను బయటపెడతారు.

ఈ క్రమంలోనే ఆది దేవ్ అనే బాబా గురించి తెలుస్తుంది. ఆ బాబా సంగతి కూడా చూడాలని ఈ నలుగురు ఫ్రెండ్స్ వెళ్తారు. కానీ ఆ బాబా మాత్రం వీళ్లకే ఛాలెంజ్ విసురుతాడు. ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయని అంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ నలుగురిని చంపాలనుకున్నది ఎవరు? అనేది ఈషా సినిమాలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More