ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ ఆనంద్ వంటి ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకోగా, తాజాగా హృతిక్ రోషన్ కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే అతడు కేవలం పొగడ్తలతో సరిపెట్టకుండా, సినిమాలోని రాజకీయ అంశాలపై తన భిన్నాభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఇదే పలువురు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
హృతిక్ రోషన్ దురంధర్ రివ్యూ ఇలా..

ప్రస్తుతం బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న సినిమా దురంధర్. ఇది బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం (డిసెంబర్ 10)నాడు హృతిక్ రోషన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ధురంధర్' పోస్టర్‌ను షేర్ చేస్తూ ఒక నోట్ రాశాడు.
"నేను సినిమాను ప్రేమిస్తాను. కథలో పూర్తిగా లీనమైపోయేవాళ్లను నేను ప్రేమిస్తాను. కథే మనల్ని కంట్రోల్ చేసేలా, మనల్ని కుదిపేసేలా ఉండాలి. 'ధురంధర్' దానికి ఒక ఉదాహరణ. స్టోరీటెల్లింగ్ నాకు బాగా నచ్చింది. ఇదీ సినిమా అంటే" అని హృతిక్ రాసుకొచ్చాడు.
"నేను ఈ సినిమాలోని రాజకీయాలతో విభేదించవచ్చు. ప్రపంచ పౌరులుగా ఫిల్మ్ మేకర్లకు ఉండాల్సిన బాధ్యతల గురించి వాదించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఒక సినిమా విద్యార్థిగా నేను ఈ సినిమాను ఎంతగా ప్రేమించానో, దీని నుంచి ఎంత నేర్చుకున్నానో విస్మరించలేను. అమేజింగ్" అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.
అయితే ఇందులో తప్పు ఏముంది అంటూ అభిమానులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల దారుణమైన దాడులను చూపించారు.. వాళ్లకు మీరు మద్దతిస్తున్నారా అని కొందరు హృతిక్ ను ప్రశ్నించగా.. ఓ రాజకీయ పార్టీని పొగిడినట్లు అతనికి అనిపించి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.
సెలబ్రిటీల ప్రశంసలు
రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన దురంధర్ సినిమాపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. "సినిమా చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. గ్రిప్పింగ్ స్టోరీ.. ఆదిత్య ధర్ అదరగొట్టేశాడు. మన కథలను ఇలా బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది" అని ట్వీట్ చేశాడు.
{{/usCountry}}రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన దురంధర్ సినిమాపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. "సినిమా చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. గ్రిప్పింగ్ స్టోరీ.. ఆదిత్య ధర్ అదరగొట్టేశాడు. మన కథలను ఇలా బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది" అని ట్వీట్ చేశాడు.
{{/usCountry}}'వార్' దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పందిస్తూ.. ఈ సినిమాను ఒక 'నషా' (మత్తు) అని వర్ణించాడు. మరో డైరెక్టర్ మధుర్ భండార్కర్ స్పందిస్తూ.. అక్షయ్ ఖన్నా నటన ఒక మాస్టర్ క్లాస్ అని, రణ్‌వీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కొనియాడాడు.
దురంధర్ సినిమా గురించి..
పాకిస్థాన్ నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ ఇది. లియారీలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లలోకి చొరబడే భారతీయ గూఢచారిగా రణ్‌వీర్ సింగ్ నటించాడు. ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దూసుకెళ్తోంది. Sacnilk రిపోర్టు ప్రకారం ఇప్పటివరకు ఈ మూవీ రూ. 177.74 కోట్లు వసూలు చేసింది.