...
...
Next Story

Yash Toxic: టాక్సిక్ 8 నిమిషాల సీన్లు చూశా.. యష్ విజువల్స్ నెక్ట్స్ లెవెల్.. ఫ్యాన్స్‌కు పండగే: బాలీవుడ్ నటి

Yash Toxic: యష్ టాక్సిక్ మూవీపై బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఇచ్చిన అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని విజువల్స్ నెక్ట్స్ లెవెల్ అని, యష్ అభిమానులకు పండగే అని ఆమె చెప్పడం విశేషం. 8 నిమిషాల ఓ వీడియో చూసినట్లు చెప్పింది.

Published on: Jun 29, 2026, 21:58:54 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Yash Toxic: రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ (Toxic: A Fairy Tale for Grown-ups) మూవీ నుంచి ఒక క్రేజీ ఇంటర్నేషనల్ రేంజ్ అప్‌డేట్ లీకైంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటి హుమా ఖురేషి.. టాక్సిక్ సినిమాకు సంబంధించిన సుమారు 8 నుండి 9 నిమిషాల రఫ్ కట్ విజువల్స్ చూశానని చెప్పి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పవర్‌ఫుల్ గ్లింప్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయిందని, థియేటర్లలో యష్ ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని ఆమె హింట్ ఇచ్చింది.

కేజీఎఫ్ రికార్డులను బద్దలు కొట్టేలా టాక్సిక్ ప్లానింగ్

Yash Toxic: టాక్సిక్ 8 నిమిషాల సీన్లు చూశా.. యష్ విజువల్స్ నెక్ట్స్ లెవెల్.. ఫ్యాన్స్‌కు పండగే: బాలీవుడ్ నటి
Yash Toxic: టాక్సిక్ 8 నిమిషాల సీన్లు చూశా.. యష్ విజువల్స్ నెక్ట్స్ లెవెల్.. ఫ్యాన్స్‌కు పండగే: బాలీవుడ్ నటి

ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టుల్లో టాక్సిక్ ఒకటిగా నిలిచింది. కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి హిస్టారికల్ బాక్సాఫీస్ సక్సెస్ తర్వాత యష్ చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను లైన్ లో పెట్టాడు.

అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ డార్క్ క్రైమ్ డ్రామాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను మేకర్స్ చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఇలాంటి టైంలో హుమా ఖురేషి చేసిన కామెంట్స్ నార్త్ నుండి సౌత్ వరకు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

హాలీవుడ్ రేంజ్ విజువల్స్.. గీతూ మోహన్ దాస్ మార్క్!

ఈ టాక్సిక్ సినిమా విజువల్ గొప్పతనం గురించి హుమా ఖురేషి మాట్లాడుతూ.. సినిమా అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వస్తోందని ప్రశంసల వర్షం కురిపించింది. గీతూ మోహన్ దాస్ టేకింగ్, మేకింగ్ స్టైల్ హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్ లో ఉందని చెప్పింది.

కేజీఎఫ్ సిరీస్ లో రాకీ భాయ్‌ను చూసి ఊగిపోయిన ఆడియన్స్‌కు.. ఈ సినిమాలో యష్ సరికొత్త మాస్ అవతార్ ఒక బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్‌లా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తోంది.

బాక్సాఫీస్ టార్గెట్ 2000 కోట్లు

హుమా ఖురేషి ఒక పవర్‌ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేస్తోందని సమాచారం. వరల్డ్‌వైడ్‌గా బిగ్గెస్ట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ లేదా గ్లింప్స్ రిలీజ్ డేట్‌ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాను ఆగస్టు 26న రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మధ్యే వెల్లడించిన విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe