...
...
Next Story

Malayalam Thriller OTT: ఇవాళ రెండు ఓటీటీల్లోకి మైండ్ బ్లోయింగ్ మలయాళం థ్రిల్లర్.. ఇరుముడి పాప సినిమా.. తెలుగులోనూ!

Malayalam Thriller OTT: ఓటీటీ లవర్స్ అలర్ట్! మీకు థ్రిల్ అందించేందుకు అదిరిపోయే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. వారణాసి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా, ఇరుముడి పాప నక్షత్ర కీలక పాత్రలో నటించిన ఓ ఇంటెన్స్ డ్రామా డిజిటల్ డెబ్యూ చేసింది. ఈ మూవీ ఏంటీ? అనేది ఇక్కడ చూసేయండి.

Published on: Aug 25, 2026, 10:15:29 IST
Advertisement

Malayalam Thriller OTT: కొత్త వారం వచ్చిందంటే ఓటీటీలోకి ఏ మలయాళం సినిమాలు వస్తున్నాయని సెర్చ్ చేసే తెలుగు ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. అలాంటివాళ్లకు కిక్కిచ్చే న్యూస్ ఇది. రీసెంట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఓటీటీలోకి వచ్చేసింది. ఒకే సారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఐ, నోబడీ ఓటీటీ

ఇవాళ రెండు ఓటీటీల్లోకి మైండ్ బ్లోయింగ్ మలయాళం థ్రిల్లర్.. ఇరుముడి పాప సినిమా.. తెలుగులోనూ!
ఇవాళ రెండు ఓటీటీల్లోకి మైండ్ బ్లోయింగ్ మలయాళం థ్రిల్లర్.. ఇరుముడి పాప సినిమా.. తెలుగులోనూ!

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), పవర్‌హౌస్ నటి పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu) కాంబినేషన్‌లో తెరకెక్కించిన సైకలాజికల్ హీస్ట్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ (I, Nobody). ఈ మలయాళం థ్రిల్లర్ ఈ రోజు (ఆగస్టు 25, 2026) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

‘రోర్‌షాక్’ (Rorschach) ఫేమ్ నిసామ్ బషీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జియోహాట్‌స్టార్ (JioHotstar), సింప్లీసౌత్ (SimplySouth) ప్లాట్‌ఫామ్‌లలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో రిలీజైంది.

ఇరుముడి నక్షత్ర

ప్రస్తుతం థియేటర్లలో ఎక్కడ చూసినా ఇరుముడి మేనియా కనిపిస్తోంది. రవితేజ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇందులో రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర అద్భుతంగా నటించింది. బేబీ నక్షత్ర ఈ ఐ, నోబడీ మూవీలో హీరో కూతురిగా కీలక పాత్ర పోషించింది.

రూ.17 కోట్ల బ్యాంక్ దోపిడీ

థియేటర్లలో జులై 9న విడుదలైన ఈ ఐ,నోబడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ అందుకుంది. థ్రిల్లర్ లవర్స్‌కు మాత్రం మైండ్-బెండింగ్ అనుభూతిని అందిస్తుందని చెప్పొచ్చు.

కేవలం నేరం ఎవరు చేశారనేది మాత్రమే కాకుండా, ఒక సామాన్యుడు వ్యవస్థలోని లోపాల మధ్య, క్రిమినల్ గ్యాంగ్స్ మధ్య ఎలా నలిగిపోయాడనేది నిసామ్ బషీర్ మార్క్ డార్క్ హ్యూమర్, సస్పెన్స్‌తో ఆవిష్కరించారు. పృథ్వీరాజ్ వినూత్న శైలి నటనతో పాటు పార్వతి తిరువోతు, హక్కీమ్ షాజహాన్, విజయరాఘవన్ కీలక పాత్రల్లో మెప్పించారు.

ఎందుకు చూడాలంటే?

ఇటీవలి కాలంలో మలయాళంలో వచ్చిన చాలా డార్క్/సైకలాజికల్ థ్రిల్లర్లు థియేటర్లలో కంటే ఓటీటీ వేదికలపైనే భారీ వ్యూవర్‌షిప్, కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నాయి. ‘రోర్‌షాక్’ తరహాలోనే ఈ చిత్రంలోనూ స్లో-బర్న్ నెరేటివ్ ఉంటుంది. థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు ఇది స్లోగా అనిపించినా, ఓటీటీలో పర్సనల్ స్క్రీన్‌లపై చూసే థ్రిల్లర్ ప్రియులకు పర్ఫెక్ట్ ఛాయిస్.

పాన్-ఇండియా రేంజ్‌లో జియోహాట్‌స్టార్‌లో తెలుగు సహా 5 భాషల ఆడియోతో రిలీజ్ చేయడం వల్ల సౌత్ అండ్ నార్త్ ఓటీటీ వ్యూవర్స్‌కు ఇది మస్ట్ వాచ్ గా మారింది. నిసామ్ బషీర్ కాన్సెప్ట్ మేకింగ్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటెన్స్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం. థియేటర్లలో మిస్ అయిన ఇన్వెస్టిగేటివ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేమికులు జియోహాట్‌స్టార్‌లో ‘ఐ, నోబడీ’ని అస్సలు మిస్ కాకుండా చూడవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks