Allu Arjun: మలయాళంలో రికార్డుల వేట సాగించిన బ్లాక్‌బస్టర్ సూపర్‌హీరో మూవీ 'లోకా' (Lokah: Chapter 1 - Chandra) డైరెక్టర్ డొమినిక్ అరుణ్ రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని కలిసి సర్‌ప్రైజ్ చేశారు. పుష్ప రాజ్ అల్లు అర్జున్ తన సినిమా గురించి ప్రశంసలు కురిపించడంతో డొమినిక్‌కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ ఊహించని కలయికకు సంబంధించిన క్యూట్ ఫొటోను డొమినిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాశారు.
"నోట మాట రాలేదు బాస్!" - డొమినిక్ ఎమోషనల్ పోస్ట్

అల్లు అర్జున్‌తో దిగిన పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డొమినిక్ అరుణ్.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
"ఒక బిగ్ ఫ్యాన్‌బాయ్ మూమెంట్. 'ది' అల్లు అర్జున్‌ని కలిసే అద్భుతమైన అవకాశం నాకు దక్కింది. 'లోకా' సినిమాపై ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు స్వయంగా విన్నాను. సినిమాపై ఆయన చూపించిన ప్రేమ, రాబోయే చాప్టర్లకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నాకు నిజంగా చాలా చాలా స్పెషల్. కొన్నేళ్లుగా మనం ఎంతగానో అభిమానించే వ్యక్తిని కలిసినప్పుడు, ఏం మాట్లాడాలో కూడా మర్చిపోతాం కదా. నాకు ఈరోజు అలాగే అనిపించింది. ఆయన చూపించిన లవ్, చెప్పిన మంచి మాటలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్యూ సర్!" అంటూ ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.
బాక్సాఫీస్‌ని షేక్ చేసిన మలయాళం సూపర్ హీరో మూవీ
దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ 'లోకా' మూవీ మలయాళ చిత్రసీమలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫాంటసీ సూపర్‌హీరో థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. కల్యాణి ప్రియదర్శన్ టైటిల్ రోల్‌లో అదరగొట్టగా.. నస్లేన్, శాండీ మాస్టర్ కీలక పాత్రల్లో అలరించారు.
యంగ్ టాలెంట్‌కి ఐకాన్ స్టార్ సపోర్ట్
ఇండియన్ సినిమా రేంజ్‌ని గ్లోబల్ లెవల్‌కి తీసుకెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వేరే భాషల్లో వచ్చిన కొత్త ప్రయోగాలను, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లను ఎప్పుడూ ముందుండి ప్రోత్సహిస్తుంటారు. ఆ మధ్య 'లోకా' మూవీ చూసిన అల్లు అర్జున్, సినిమా మేకింగ్ శైలి, డొమినిక్ అరుణ్ విజన్ చూసి ఫిదా అయ్యారట. నెక్స్ట్ రాబోయే 'లోకా ఛాప్టర్ 2' ప్రొజెక్ట్ కోసం డొమినిక్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు.
{{/usCountry}}ఇండియన్ సినిమా రేంజ్‌ని గ్లోబల్ లెవల్‌కి తీసుకెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వేరే భాషల్లో వచ్చిన కొత్త ప్రయోగాలను, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లను ఎప్పుడూ ముందుండి ప్రోత్సహిస్తుంటారు. ఆ మధ్య 'లోకా' మూవీ చూసిన అల్లు అర్జున్, సినిమా మేకింగ్ శైలి, డొమినిక్ అరుణ్ విజన్ చూసి ఫిదా అయ్యారట. నెక్స్ట్ రాబోయే 'లోకా ఛాప్టర్ 2' ప్రొజెక్ట్ కోసం డొమినిక్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు.
{{/usCountry}}ప్రస్తుతం డొమినిక్ అరుణ్ 'లోకా ఛాప్టర్ 2' స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. లోకా సినిమాటిక్ యూనివర్స్‌ని భారీ స్కేల్‌లో బిల్డ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి బిగ్ నేమ్ నుంచి ప్రశంసలు రావడం, లోకా చాప్టర్ 2 పై ఉన్న హైప్‌ని పాన్ ఇండియా లెవల్లో మరింత పెంచేసింది.