KD The Devil: 'సర్కే చునార్' పాటపై ఇడియట్ హీరోయిన్ రక్షిత సంచలన వ్యాఖ్యలు-అభ్యంతరం ఇప్పుడెందుకు? పీలింగ్స్ సాంగ్ పేరుతో

KD The Devil: దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్న కన్నడ చిత్రం కేడీ ది డెవిల్ సినిమాలోని 'సర్కే చునార్' పాట వివాదాస్పదంగా మారింది. బూతు పాట అంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ భార్య, ఇడియట్ హీరోయిన్ రక్షిత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందులోకి పుష్ప 2 సినిమాలో పీలింగ్స్ పాటను కూడా లాగింది.

Published on: Mar 18, 2026, 09:25:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కన్నడ స్టార్ దర్శకుడు ప్రేమ్ రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కేడీ ది డెవిల్ (KD: The Devil)’. ఈ సినిమాలోని ‘సర్కే చునార్’ పాట విడుదలైనప్పటి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నోరా ఫతేహి, సంజయ్ దత్ స్టెప్పులేసిన ఈ పాటలో సాహిత్యం (Lyrics) అత్యంత అసభ్యకరంగా ఉందని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై దర్శకుడి భార్య, మాజీ నటి రక్షిత సంచలన వ్యాఖ్యలు చేసింది.

సర్కే చునార్ పై రక్షిత సంచలన వ్యాఖ్యలు
సర్కే చునార్ పై రక్షిత సంచలన వ్యాఖ్యలు

అప్పుడు ఓకే.. ఇప్పుడెందుకు తప్పు?

ఇడియట్ మూవీ హీరోయిన్ రక్షిత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చింది. "గతంలో ‘పీలింగ్స్’, 'చోళీ కే పీచే', 'డ్రీమమ్ వేకపమ్' వంటి వందలాది పాటలు వచ్చినప్పుడు అందరికీ బాగానే అనిపించింది కదా? ఇప్పుడు ఈ ఒక్క పాట మీదనే ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు?" అని రక్షిత ప్రశ్నించింది.

పీలింగ్స్ సాంగ్

కేవలం ఒక పాటను బట్టి దర్శకుడి ప్రతిభను లేదా అతని వ్యక్తిత్వాన్ని తక్కువ చేయలేమని రక్షిత చెప్పింది. బూతు పాట, అసభ్యకరమైన స్టెప్పులు అంటూ సర్కే చునార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వివాదంలోకి పుష్ప 2 సినిమాలోని ‘పీలింగ్స్’ పాటను కూడా రక్షిత లాగింది.

రక్షిత ఇన్ స్టా స్టోరీస్
రక్షిత ఇన్ స్టా స్టోరీస్

రక్తపాతం, సెక్స్ ఉన్న సినిమాలు చూడట్లేదా?

ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఎక్కువ రక్తపాతం, లైంగిక కంటెంట్ ఉన్న సినిమాలను బహిరంగంగానే చూస్తున్నారని రక్షిత పేర్కొంది. మరి ‘సర్కే చునార్’ పాట విషయంలోనే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని రక్షిత నిలదీసింది. తన భర్త ప్రేమ్ ఒక కన్నడిగుడిగా సినిమాను మార్కెట్ చేయడానికి, థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ మూవీ

‘‘ఒక సినిమా మొత్తంలో నటీనటులు సెక్సువల్ ఇంటర్ కోర్స్ గురించే మాట్లాడుకుంటారు. కానీ ఈ మూవీ బాగానే అనిపించింది. ఎలాంటి ప్రాబ్లెం లేదు. కానీ ఇప్పుడు ఒక సాంగ్ మాత్రం సెన్సేషనల్ గా మారింది. నేను దీన్ని సమర్థించడం లేదు. కానీ అర్థం చేసుకోవడానికి అడుగుతున్నా’’ అని రక్షి తన స్టోరీస్ లో రాసుకొచ్చింది.

రక్షిత ఇన్ స్టా స్టోరీస్
రక్షిత ఇన్ స్టా స్టోరీస్

చట్టపరమైన చిక్కుల్లో పాట

సర్కే చునార్ పాటలోని ప్రారంభ పంక్తులు లైంగిక సంపర్కాన్ని అసభ్యంగా వర్ణిస్తున్నాయని ఆరోపిస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తో పాటు కంగనా రనౌత్ వంటి ప్రముఖులు ఇప్పటికే ఖండించారు.

  • అంతేకాకుండా ఢిల్లీ పోలీసు సైబర్ సెల్‌లో ఒక క్రిమినల్ కేసు కింద ఫిర్యాదు నమోదైంది.
  • మైనర్లకు హానికరంగా ఉందని, ఈ పాటను తక్షణమే నిషేధించాలని ఒక న్యాయవాది సెన్సార్ బోర్డును (CBFC) కోరారు.
  • ఇప్పటికే ఈ పాట హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుండి డిలీట్ చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వర్షన్ సాంగ్ వీడియోలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ పాటను మంగ్లీ పాడింది.
  • భారీ అంచనాలతో రూపొందుతున్న కేడీ ది డెవిల్ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.
  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More