Idupu Kayitham Teaser: ప్యూర్ ఎమోషన్స్.. మనసును తాకే మట్టి మాటలు.. అదిరిపోయిన ఇడుపు కాయితం టీజర్.. హైప్ పెంచేలా!
Idupu Kayitham Teaser: స్వచ్ఛమైన ఎమోషన్స్, మనసును తాకే మాటలు, అరే ఇది మన సినిమానే కదా అనిపించేలా స్టోరీ.. ఇలా ఇడుపు కాయితం టీజర్ రిలీజ్ అయిన వెంటనే జనాలకు కనెక్ట్ అయిపోతుంది. ఇవాళ మేకర్స్ రిలీజ్ చేసిన ఇడుపు కాయితం టీజర్ తో ఈ మూవీపై హైప్ మరింత పెరిగిపోయింది.
Idupu Kayitham Teaser: టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే అందరి ఫోకస్ తన వైపు తిప్పుకొన్న సినిమా ‘ఇడుపు కాయితం’. ఆ తర్వాత పాటలతో అంచనాలు పెంచేసింది. ఇప్పుడు తాజాగా టీజర్ తో ఈ మూవీపై హైప్ మరింత పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఇడుపు కాయితం మూవీ టీజర్ ను ఇవాళ (నవంబర్ 12) మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇడుపు కాయితం టీజర్
టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, కొత్త హీరోయిన్ నాగదుర్గ జంటగా నటిస్తున్న 'ఇడుపు కాయితం' సినిమా టీజర్ గురువారం విడుదలైంది. సుకుమార్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ తెలంగాణ పల్లెటూరి కథ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. డిసెంబర్ 11న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
మనసును తాకే స్టోరీ
ఇవాళ మేకర్స్ రిలీజ్ చేసిన ఇడుపు కాయితం టీజర్ తో ఈ మూవీపై హైప్ మరింత పెరిగిపోయింది. తెలంగాణ మట్టి వాసన ఉట్టిపడేలా, పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. సాధారణంగా పల్లెటూరి కథలు అనగానే ఎక్కడో ఒకచోట మన జీవితాలకు దగ్గరగా అనిపిస్తాయి. అలాంటి సహజత్వాన్ని ఈ టీజర్లో దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి అద్భుతంగా ఆవిష్కరించారు.
చాగంటి డైలాగ్ తో
ఇడుపు కాయితం టీజర్ ఆరంభమే ఒక ఆసక్తికరమైన డైలాగ్ తో మొదలవుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన "రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రామాయణం ముందుకు వెళుతుంది" అనే వాయిస్ ఓవర్ తో టీజర్ ను కట్ చేశారు.
ఈ డైలాగ్ కు తగ్గట్టుగానే కథలో 'శ్రీలత' పాత్ర చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చూపులు, ప్రేమ, పెళ్లి తర్వాత వచ్చే మనస్పర్థలు, విడాకులు అనే ఎమోషనల్ పాయింట్స్ తో టీజర్ ఆసక్తి రేపుతోంది.
ప్రియదర్శి, నాగదుర్గల కెమిస్ట్రీ
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే ప్రియదర్శి పులికొండ ఈ సినిమాలో శ్రీనివాస్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జానపద పాటల ద్వారా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పాపులర్ అయిన నాగదుర్గ తెలుగులో ఫస్ట్ ప్రధాన మూవీ చేస్తోంది. శ్రీలత పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, పల్లెటూరి అమాయకత్వం, కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.
ప్రతిష్టాత్మక నిర్మాణం
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ వాస్, తబితా సుకుమార్ సంయుక్తంగా ఇడుపు కాయితం చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన 'శ్రీలత', 'గడప', 'బరాత్ బీట్' లాంటి పాటలు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.
డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్
'ఇడుపు కాయితం' చిత్రం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఈ టీజర్ బాగా ట్రెండ్ అవుతోంది. కచ్చితంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


