...
...
Next Story

illu illalu pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు మాజీ ప్రేమ సీమంతం..భార్య కాళ్లు పట్టిన భర్త..లావణ్య ఫొటోలు వైరల్..లుక్కేయండి

illu illalu pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మొదటి నుంచి ప్రేమగా అలరించిన లావణ్య భరద్వాజ్ గుర్తుందా? ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె సీరియల్ నుంచి తప్పుకొంది. తాజాగా లావణ్య సీమంతం జరిగింది. ప్రేమగా తన కాళ్లు పడుతున్న భర్త ఫొటోను లావణ్య పోస్టు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

Published on: Aug 26, 2026, 12:07:26 IST
Advertisement

illu illalu pillalu: స్టార్ మాలో టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తోంది ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్. ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్ లవ్, కామెడీ.. ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఈ సీరియల్ ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సీరియల్ లో ఒకప్పుడు ప్రేమ క్యారెక్టర్ ప్లే చేసిన లావణ్య భరద్వాజ్ సీమంతం తాజాగా జరిగింది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు మాజీ ప్రేమ సీమంతం..భార్య కాళ్లు పట్టిన భర్త..లావణ్య ఫొటోలు వైరల్..లుక్కేయండి (instagram-lavanya.laav_official)
ఇల్లు ఇల్లాలు పిల్లలు మాజీ ప్రేమ సీమంతం..భార్య కాళ్లు పట్టిన భర్త..లావణ్య ఫొటోలు వైరల్..లుక్కేయండి (instagram-lavanya.laav_official)

రామరాజు కుటుంబం వర్సెస్ భద్రావతి కుటుంబం అనే కథతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కొనసాగుతోంది. ఇందులో మెయిన్ గా రామరాజు కుటుంబం ఉంది. రామరాజు చిన్న కొడుకు ధీరజ్ భార్య ప్రేమగా లావణ్య భరద్వాజ్ నటించింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో తెలుగు జనాల మనసులు గెలుచుకుంది.

ప్రెగ్నెన్సీ రావడంతో

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ధీరజ్, ప్రేమల గిల్లి కజ్జాలు.. అత్త వేదవతి, తోడి కోడలు నర్మదతో కలిసి ప్రేమ చేసే అల్లరి ఆడియన్స్ కు మంచి ఫీల్ ఇచ్చేవి. అయితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో ప్రేమ క్యారెక్టర్ నుంచి లావణ్య తప్పుకొంది. పూర్తిగా సీరియల్ కు దూరమైపోయింది. ఆమె ప్లేస్ లో మన్విత జగదీష్ ఇప్పుడా ప్రేమ క్యారెక్టర్ ప్లే చేస్తోంది.

సీమంతం ఫొటోలు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి తప్పుకొన్నప్పటికీ లావణ్య భరద్వాజ్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రేమ క్యారెక్టర్లో అద్భుతమైన నటనతో ఆమె అలరించడమే అందుకు కారణం. లావణ్య తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను ఇవాళ (ఆగస్టు 26) లావణ్య పోస్టు చేసింది. వీటిని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

భార్య కాళ్లు

శ్రీరస్తు శుభమస్తు సీరియల్ తో పేరు తెచ్చుకున్న లావణ్య.. ఇల్లు ఇల్లాలు పిల్లలుతో మరింత పాపులర్ అయింది. ఈ కన్నడ భామ తెలుగు ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. అయితే ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత లావణ్య రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks