...
...
Next Story

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. తెగించేసిన ధీరజ్.. అర్ధరాత్రి దొంగలా భద్రావతి ఇంటికి.. ప్రేమకు లిప్ కిస్

Illu Illalu Pillalu: స్టార్ మాలో దూసుకుపోతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో అదిరే ట్విస్ట్ చోటు చేసుకోనుంది. ఏదైతే అది అని ధీరజ్ తెగించేశాడు. అర్ధరాత్రి దొంగలా భద్రావతి ఇంట్లోకి దూకేశాడు. ప్రేమ గదిలోకి వెళ్లిపోయాడు. ఇంకా ఏం చేశాడంటే?

Published on: Aug 14, 2026, 14:27:05 IST
Advertisement

Illu Illalu Pillalu: తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే క్రేజ్ ఉన్న సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. స్టార్ మాలో ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ కు ఫాలోవర్లు ఎక్కువే. సీరియల్ కూడా ఎప్పటికప్పుడూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ సాగుతోంది. తాజాగా ఓ పెద్ద ట్విస్ట్ చేసుకోబోతోంది.

ధీరజ్ బాధ

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. తెగించేసిన ధీరజ్.. అర్ధరాత్రి దొంగలా భద్రావతి ఇంటికి.. ప్రేమకు లిప్ కిస్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు.. తెగించేసిన ధీరజ్.. అర్ధరాత్రి దొంగలా భద్రావతి ఇంటికి.. ప్రేమకు లిప్ కిస్ (jiohotstar)

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో శ్రీవల్లి, భద్రావతి కలిసి కుట్ర చేసి ధీరజ్, ప్రేమను విడగొట్టిన సంగతి తెలిసిందే. గుడిలో అయినా ఎలాగోలా నిజం చెప్పి కన్విన్స్ చేయాలని ధీరజ్ ట్రై చేశాడు. కానీ అక్కడ ధీరజ్ పొరపాటు కారణంగా ప్రేమ జాకెట్ చిరిగింది. దీంతో దూరం ఇంకా పెరిగింది. ప్రేమను తిరిగి తీసుకురావడం ఎలా అని ధీరజ్ బాధపడుతున్నాడు.

భద్రావతి ఇంట్లోకి

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ ఇప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది. రామరాజు ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా ఆమె వినడం లేదు. ధీరజ్ కూడా చాలా బతిమిలాడాడు. కానీ ప్రేమ కరగలేదు. ఈ నేపథ్యంలో ప్రేమను డైరెక్ట్ గా కలిసేందుకు అర్ధరాత్రి దొంగలా భద్రావతి ఇంట్లోకి వెళ్లాడు ధీరజ్.

ప్రేమకు లిప్ కిస్

గోడ దూకి ప్రేమ గదిలోకి ధీరజ్ సైలెంట్ గా వెళ్తాడు. ప్రేమ ఏమో పాటలు వింటూనే నిద్రపోతుంది. ధీరజ్ వెళ్లి ఓ ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకోగానే ‘మగాళ్లు వట్టి మాయగాళ్లే’ అనే సాంగ్ ప్లే అవుతుంది. ధీరజ్ షాక్ అవుతాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రస్తుతం ధీరజ్, ప్రేమ ఎలా కలుస్తారు? ఎప్పుడు కలుస్తారు? అనే ఉత్కంఠ చుట్టూ కథ సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ధీరజ్ మాటలకు, చేతులెత్తి దండం పెట్టడంతో ప్రేమ ఆల్మోస్ట్ కరిగిపోయింది. క్షమించేద్దామని అనుకుంది. కానీ ముగ్ధ మధ్యలోకి వచ్చి డిస్టర్బ్ చేసింది.

ఇప్పుడు ఏమో ధీరజ్ ఏకంగా భద్రావతి ఇంట్లో ఉంటున్న ప్రేమ గదిలోకి వెళ్లిపోయాడు. మరి ప్రేమను కన్విన్స్ చేస్తాడా? లేదంటే ధీరజ్ వచ్చిన విషయం భద్రావతికి తెలిసి గొడవ ఇంకా పెద్దది అవుతుందా? అనేది వచ్చే ఎపిసోడ్లలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe