Illu Illalu Pillalu: స్టార్ మాలో రేటింగ్ లో దూసుకెళ్తున్న సీరియల్ ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’. ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఫన్ తో ఈ సీరియల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది లావణ్య భరద్వాజ్. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా సీరియల్ కు దూరమైన ఆమె.. ఇప్పుడు మరోసారి సెట్స్ లో తళుక్కున మెరిసింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రామరాజు కుటుంబం వర్సెస్ భద్రావతి కుటుంబం అనే కథతో తిరుగుతుంది. ఇందులో రామరాజుకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు. ఆ కోడళ్లే శ్రీవల్లి, నర్మద, ప్రేమ. సీరియల్ స్టార్టింగ్ నుంచి చిన్న కోడలు ప్రేమగా లావణ్య భరద్వాజ్ తన యాక్టింగ్ తో అదరగొట్టింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ లో అలరించింది.
ప్రెగ్నెన్సీ రావడంతో
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్లో ఇప్పుడు లావణ్య భరద్వాజ్ నటించడం లేదు. తను ప్రెగ్నెంట్ కావడంతో సీరియల్ నుంచి తప్పుకొంది. ఆమె స్థానంలో కన్నడ నటి మన్విత జగదీష్ ఈ ప్రేమ పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా లావణ్య భరద్వాజ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సెట్స్ లోకి వచ్చి సర్ ప్రైజ్ చేసింది. అందరినీ కలిసింది. సరదాగా టైమ్ స్పెండ్ చేసింది.
శ్రీవల్లి, నర్మదతో డ్యాన్స్
సీరియల్ లో తన తోడికోడళ్లుగా నటించే శ్రీవల్లి (త్రివేణి యాదవ్), నర్మద (అన్షు రెడ్డి) తో కలిసి లావణ్య చేసిన డ్యాన్స్ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. బేబీ బంప్ తో ఉన్న లావణ్య.. బాబీ సినిమాలోని వైరల్ అవుతున్న ‘అటు పక్క మా అక్క’ అనే సాంగ్ కు త్రివేణి, అన్షుతో కలిసి స్టెప్పులేసింది. ముగ్గురు కలిసి సింక్ లో చేసిన ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.
చాలా రోజుల తర్వాత
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో లావణ్య భరద్వాజ్ నటించే రోజుల్లో.. త్రివేణి, అన్షు తో కలిసి తరచుగా రీల్స్ చేస్తుండేది. ఈ ముగ్గురు కలిసి ట్రెండ్ అవుతున్న సాంగ్స్ కు డ్యాన్స్ చేసేవాళ్లు. ఆ వీడియోలకు మంచి రీచ్ ఉండేది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ ముగ్గురు కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సీరియల్ ఫ్యాన్స్ ఈ వీడియో చూసి ఖుష్ అవుతున్నారు. ఫేవరెట్ ట్రయో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
{{/usCountry}}ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో లావణ్య భరద్వాజ్ నటించే రోజుల్లో.. త్రివేణి, అన్షు తో కలిసి తరచుగా రీల్స్ చేస్తుండేది. ఈ ముగ్గురు కలిసి ట్రెండ్ అవుతున్న సాంగ్స్ కు డ్యాన్స్ చేసేవాళ్లు. ఆ వీడియోలకు మంచి రీచ్ ఉండేది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ ముగ్గురు కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సీరియల్ ఫ్యాన్స్ ఈ వీడియో చూసి ఖుష్ అవుతున్నారు. ఫేవరెట్ ట్రయో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
{{/usCountry}}