ఇల్లు ఇల్లాలు పిల్లలు: తెలుగు సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఫ్యామిలీ డ్రామాతో ఈ సీరియల్ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సీరియల్ లో ఓ ఫైట్ సీన్ టెలికాస్ట్ అయింది. అమూల్యను ఏడిపించిన విశ్వక్ ఫ్రెండ్స్ ను అత్తాకోడళ్లు వేదవతి, నర్మద, ప్రేమ కలిసి కుమ్మేస్తారు.
షూటింగ్ కష్టాలు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఈ ఫైటింగ్ సీన్ కోసం ఆమని (వేదవతి), అన్షు రెడ్డి (నర్మద), మన్విత జగదీష్ (ప్రేమ) మామూలుగా కష్టపడలేదు. ఔట్ డోర్ షూటింగ్, అది కూడా ఎండలో కావడంతో చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను అన్షు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
‘‘ఈ సీన్ చేసేటప్పుడు ఎంతో ఫన్ తో ఎంజాయ్ చేశాం. కానీ ఎండలో మాత్రం చచ్చిపోయాం’’ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను అన్షు రెడ్డి షేర్ చేసింది.
బలిచ్చే గొర్రెలా
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ చేస్తున్న అన్షు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది. ‘‘ఒక కొబ్బరి బోండం ఇచ్చారు. కూలింగ్ గ్లాసెస్ ఇచ్చారు. ఏసీ కార్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఎండలో మాకు ఉంటుంది’’ అని వీడియోలో నర్మద చెప్తుంది.
{{/usCountry}}ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ చేస్తున్న అన్షు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది. ‘‘ఒక కొబ్బరి బోండం ఇచ్చారు. కూలింగ్ గ్లాసెస్ ఇచ్చారు. ఏసీ కార్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఎండలో మాకు ఉంటుంది’’ అని వీడియోలో నర్మద చెప్తుంది.
{{/usCountry}}‘‘బలిచ్చే ముందు గొర్రెకు పసుపు, కుంకుమ పెట్టి.. పూల దండ వేసి రెడీ చేస్తారు కదా. ఇప్పుడు మనల్ని కూడా అలాగే రెడీ చేస్తున్నారు’’ అని ఆమని నవ్వేస్తుంది. ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసని మన్విత అంటుంది.
ఫ్యాన్లు పట్టుకొని
ఎండలో షూటింగ్ చేస్తూ వేదవతి, నర్మద, ప్రేమ ఇబ్బంది పడ్డారు. వేడికి తాళలేక చేతుల్లో మినీ ఫ్యాన్లు పట్టుకొని నిలబడ్డారు. మొత్తానికి ఫైట్ సీన్ కంప్లీట్ చేశారు. ఆఖర్లో మాత్రం ఫైట్ సీన్లో ఆమని అదరగొట్టిందని ప్రేమ, నర్మద చెప్పుకొచ్చారు.
రామరాజు కుటుంబం
రామరాజు కుటుంబం చుట్టూ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టోరీ సాగుతోంది. ఇందులో రామరాజుగా బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ నటించాడు. సీరియల్స్ లో ఆయనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అలాగే ముగ్గురు కోడళ్లు. ప్రస్తుతం సీరియల్ లో నడిపి కొడుకు సాగర్, రామరాజుకు మధ్య వైరం ముదిరింది. ఇద్దరు ఒకే ఇంట్లో గీత గీసుకుని ఉంటున్నారు.
మరోవైపు పెద్ద కోడలు శ్రీవల్లి లేని కడుపును ఉన్నట్లు నటిస్తోంది. ఆమె బండారం బయటపెట్టేందుకు నర్మద, ప్రేమ ప్రయత్నిస్తున్నారు. ఇలా ట్విస్ట్ లతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగిపోతోంది.