Illu Illalu Pillalu: తెలుగు బుల్లితెర వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో డ్రామా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. రామరాజు, వేదవతిల చుట్టూ తిరిగే ఈ కుటుంబ కథలో ఇప్పటివరకూ ఉన్న గొడవలు ఒకెత్తయితే, ఇప్పుడు మొదలైన ‘లోపలి శత్రువు - బయటి శత్రువు’ కాంబినేషన్ కుట్ర మరొక ఎత్తు.
చెల్లెలితో భద్రావతి డాన్స్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కథ ప్రకారం శారదాంబ పుట్టినరోజు వేడుకల నెపంతో భద్రావతి ఊహించని డ్రామా స్టార్ట్ చేసింది. ఇన్నాళ్లూ వేదవతి రూపాన్ని చూస్తేనే మండిపడే భద్రావతి, ఉన్నట్లుండి ఆమెతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎమోషనల్ కావడం, చివరికి చెల్లెలితో కలిసి సంతోషంగా డాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఏదో ప్రమాదమే
వేదవతి ఈ మార్పును నిజమైన అక్క ఆప్యాయతగా నమ్మి సంబరపడుతుండగా, ఇంట్లో ఉన్న ధీరజ్, నర్మదలకు మాత్రం భద్రావతి ప్రవర్తనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పగతో రగిలిపోయే మనిషి ఒక్కసారిగా ఇలా మారడం వెనుక ఏదో పెద్ద ప్రమాదమే దాగి ఉందనేది వారి సందేహం.
శ్రీవల్లి ప్రతీకారం
మరోవైపు పెద్ద కోడలు శ్రీవల్లి వేసిన కడుపు నాటకం బయటపడటంతో ఇంట్లో ఆమెను వేదవతి, చందు అస్సలు దగ్గరకు రానివ్వడం లేదు. తన తప్పును తెలుసుకోవడానికి బదులు.. తన నిజస్వరూపం బయటపడటానికి కారణమైన తోడికోడళ్లు ప్రేమ, నర్మదలపై పగ పెంచుకుంది.
రామరాజు ఇంటిని విడదీయడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీవల్లి, బయటి శత్రువైన భద్రావతితో చేతులు కలిపింది. ఇందులో భాగంగానే ధీరజ్ - ప్రేమల సీక్రెట్ మ్యారేజ్ రహస్యాన్ని భద్రావతికి లీక్ చేసి ఆమెను ఉసిగొల్పింది.
ధీరజ్ - ప్రేమలను విడదీసే ప్లాన్
{{/usCountry}}రామరాజు ఇంటిని విడదీయడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీవల్లి, బయటి శత్రువైన భద్రావతితో చేతులు కలిపింది. ఇందులో భాగంగానే ధీరజ్ - ప్రేమల సీక్రెట్ మ్యారేజ్ రహస్యాన్ని భద్రావతికి లీక్ చేసి ఆమెను ఉసిగొల్పింది.
ధీరజ్ - ప్రేమలను విడదీసే ప్లాన్
{{/usCountry}}ఇప్పటికే నర్మద, సాగర్‌లను వేరు కాపురం పెట్టేలా చేసిన శ్రీవల్లి, ఇప్పుడు ధీరజ్, ప్రేమలను టార్గెట్ చేసింది. భద్రావతి ఆత్మీయత అనే ముసుగులో వేదవతి ఇంట్లోకి అడుగుపెట్టి, సమయం చూసి ధీరజ్ - ప్రేమల పెళ్లి విషయాన్ని రచ్చ రచ్చ చేసి రామరాజు దృష్టిలో వారిని దోషులుగా నిలబెట్టాలని చూస్తోంది.
ఈ కుట్ర సఫలమైతే రామరాజు కోపానికి ధీరజ్ - ప్రేమలు దూరమవ్వడం ఖాయం. భద్రావతి వేస్తున్న ఈ ప్రేమ నాటకాన్ని ధీరజ్ సమయానుకూలంగా తిప్పికొడతాడా లేక శ్రీవల్లి వేసిన ప్లాన్‌లో చిక్కుకుని ప్రేమతో బంధం తెంచుకుంటాడా అనేది రాబోయే ఎపిసోడ్లలో ఉత్కంఠగా మారనుంది.
మళ్లీ ఊపు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో గత కొన్ని ఎపిసోడ్లుగా శ్రీవల్లి కడుపు డ్రామాతో కథ కొంత నెమ్మదించినా, భద్రావతి-శ్రీవల్లి కాంబినేషన్ సీన్స్ రాకతో మళ్లీ వేగం పుంజుకుంది. సాధారణంగా విలన్ పాత్రలు నేరుగా దాడి చేయడం కంటే, కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకుని దెబ్బతీయడం అనేది సక్సెస్ ఫుల్ బుల్లితెర ఫార్ములా. భద్రావతి డాన్స్ వెనుక ఉన్న కపటం బయటపడే క్షణంలో వచ్చే హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామా ఈ సీరియల్ టీఆర్‌పీ (TRP)ని మరింత పెంచే అవకాశం ఉంది.