...
...
Next Story

Illu Illalu Pillalu:ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు-బిగ్ ట్విస్ట్‌-అస‌లు రామ‌రాజు ప్లాన్ ఏంటీ? ధీర‌జ్‌, ప్రేమ‌కు మళ్లీ పెళ్లేంటి?

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ టాప్ సీరియల్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ధీరజ్, ప్రేమకు మళ్లీ పెళ్లి చేస్తానంటూ రామరాజు ఛాలెంజ్ చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. అసలు రామరాజు ప్లాన్ ఏంటీ? ధీరజ్, ప్రేమకు మళ్లీ పెళ్లి ఏంటీ? అనేది ఉత్కంఠగా మారింది.

Published on: Sep 19, 2026, 16:16:03 IST
Advertisement

Illu Illalu Pillalu: స్టార్ మా సీరియల్ లో టాప్ రేటింగ్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దూసుకెళ్తోంది. అయితే ఇటీవల కొన్ని ఎపిసోడ్లలో ఉత్కంఠ తగ్గిందనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మేకర్స్ అలర్ట్ అయినట్లే కనిపిస్తున్నారు. తాజాగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో బిగ్ ట్విస్ట్ ను క్రియేట్ చేశారు.

కథలో మార్పు

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు-బిగ్ ట్విస్ట్‌-అస‌లు రామ‌రాజు ప్లాన్ ఏంటీ? ధీర‌జ్‌, ప్రేమ‌కు మళ్లీ పెళ్లేంటి? (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు-బిగ్ ట్విస్ట్‌-అస‌లు రామ‌రాజు ప్లాన్ ఏంటీ? ధీర‌జ్‌, ప్రేమ‌కు మళ్లీ పెళ్లేంటి? (jiohotstar)

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ అయిన రామరాజుకు స్టోరీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ధీరజ్, ప్రేమ, నర్మద, శ్రీవల్లి, భద్రావతి, వేదవతి, తిరుపతి, సుక్కు క్యారెక్టర్ల చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతోంది. రామరాజు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు సడెన్ గా రామరాజును సెంటర్లోకి తీసుకొస్తూ కథను మార్చారు.

రామరాజు ఛాలెంజ్

ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రామరాజు ఇప్పుడు ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ అయ్యాడు. తన కోడలు ప్రేమకు మళ్లీ పెళ్లి చూపులు అనేసరికి రామరాజు తట్టుకోలేకపోయాడు. బీభత్సమే చేశాడు. చివరకు పోలీస్ స్టేషన్ లో భద్రావతికి ఛాలెంజ్ విసిరాడు. రెండు రోజుల్లో ప్రేమ, ధీరజ్ కు మళ్లీ పెళ్లి చేస్తానని సంచలన ప్రకటన చేశాడు.

ఆ ట్విస్ట్ తో

ఇప్పటికే ఓ సారి తల్లి వేదవతి ఫోర్స్ చేయడంతో ప్రేమ మెడలో ధీరజ్ తాళి కట్టాడు. కానీ దానికి సాక్ష్యం లేదని, పెళ్లి చెల్లదని భద్రావతి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో రామరాజుకు మండింది. అందుకే ధీరజ్, ప్రేమకు అందరిముందు అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేశాడు. దీంతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కథలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

భద్రావతి మామూలుది కాదు

ఇటు ధీరజ్, ప్రేమ పెళ్లి చేయాలని రామరాజు కుటుంబం.. అటు వైపు ఏమో పెళ్లి జరగకుండా అడ్డుకునేందుకు భద్రావతి, సేనాపతి, బల్లక్కాయ్ రెడీ అయ్యారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ధీరజ్, ప్రేమ పెళ్లిని ఎలా చేస్తారు? అన్న సస్పెన్స్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరి రాబోయే ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks