Illu Illalu Pillalu Anshu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అన్షు రెడ్డి. ఈ సీరియల్ లో రామరాజు రెండో కోడలు నర్మదగా అన్షు నటిస్తోంది. ఈ సీరియల్ ఫాలో అయ్యే వాళ్లందరికీ ఆమె కట్టుబొట్టు, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇవాళ ఇన్ స్టాగ్రామ్ లో అన్షు రెడ్డి పోస్టు ఒకటి వైరల్ గా మారింది.
మిస్సింగ్ యూ అంటూ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నర్మద అలియాస్ అన్షు రెడ్డి మంగళవారం (జూన్ 9) ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది. తల్లితో దిగిన రెండు ఫొటోలనూ కూడా పంచుకుంది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ రోజు అన్షు రెడ్డి.. తన తల్లి వాణి సుధాకర్ రెడ్డి బర్త్ డే కావడంతో ఈ స్పెషల్ పోస్టు పెంచుకుంది.
హ్యాపీ బర్త్ డే వాణి
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మదగా యాక్ట్ చేస్తున్న అన్షు రెడ్డికి తన తల్లిని పేరుతో పిలవడం అలవాటు కావొచ్చు. అందుకే పోస్టులోనూ వాణి అని మెన్షన్ చేసింది. ‘‘హ్యాపీ బర్త్ డే వాణి. ఐ లవ్యూ సో మచ్ అమ్మ. మిస్సింగ్ యూ’’ అని అమ్మతో తీసుకున్న రెండు సెల్పీలను పోస్టు చేసింది. షూటింగ్ కారణంగా తల్లికి దూరంగా ఉండాల్సిన రావడంతో అన్షు ఇలా మెన్షన్ చేసిందని చెప్పొచ్చు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్
స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్ ను బాగానే ఫాలో అవుతున్నారు. రేటింగ్స్ లో ఈ సీరియల్ అదరగొడుతోంది. రామరాజు కుటుంబం చుట్టూ తిరిగే కథతోనే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగిపోతోంది. ఇందులో రామరాజుకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు.
సీనియర్ యాక్టర్లు
{{/usCountry}}స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్ ను బాగానే ఫాలో అవుతున్నారు. రేటింగ్స్ లో ఈ సీరియల్ అదరగొడుతోంది. రామరాజు కుటుంబం చుట్టూ తిరిగే కథతోనే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగిపోతోంది. ఇందులో రామరాజుకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు.
సీనియర్ యాక్టర్లు
{{/usCountry}}ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సీనియర్ యాక్టర్లు ప్రభాకర్, ఆమని నటిస్తున్నారు. రామరాజుగా ప్రభాకర్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అతని భార్య వేదవతి/బుజ్జమ్మగా ఆమని నటిస్తోంది. ఇక ఈ సీరియల్ లో అన్షు రెడ్డి, మన్విత జగదీష్, రఫీక్ తదితరులు తమ పాత్రలు పోషిస్తున్నారు.
పోలీస్ స్టేషన్లో ధీరజ్
ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు చిన్న కొడుకు ధీరజ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అతని భార్య ప్రేమ మేనత్త భద్రావతి కుట్ర చేసి మరీ డ్రగ్స్ కేసులో ధీరజ్ ను ఇరికిస్తుంది. తన భర్తను బయటకు తీసుకురావడానికి అక్క నర్మదతో కలిసి ప్రేమ ప్రయత్నాలు చేస్తుంది. ఇలా సాగుతున్న ఈ సీరియల్ లో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు వస్తాయో చూడాలి.
People Also Ask (తరచుగా అడిగే ప్రశ్నలు)
- ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద పాత్రను ఎవరు చేస్తున్నారు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద పాత్రను అన్షు రెడ్డి పోషిస్తోంది.
2. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏ టీవీ ఛానెల్ లో ప్రసారమవుతుంది?
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టార్ మాలో ప్రసారమవుతుంది?
3. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఏ సీనియర్ యాక్టర్లు నటిస్తున్నారు?
ఈ సీరియల్ లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ నటి ఆమని నటిస్తున్నారు.