ఇల్లు ఇల్లాలు పిల్లలు: సీరియల్‌లో చీరలో.. బీచ్‌లో షార్ట్‌లో.. ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మదను ఇలా ఎప్పుడైనా చూశారా?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఇల్లు ఇల్లాలు పిల్లలులో నర్మద క్యారెక్టర్ గురించి సీరియల్ ఫాలో అయ్యే వాళ్లందరికీ తెలుసు. పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తోంది ఈ భామ. కానీ తనలో మరో యాంగిల్ కూడా ఉందని బీచ్ లో షార్ట్ తో పోజులిచ్చింది. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మంచి ఆదరణతో దూసుకుపోతోంది. టాప్ సీరియల్స్ లో ఒకటిగా సాగిపోతోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో ఓ హీరోయిన్ గా అన్షు రెడ్డి నటిస్తోంది. సీరియల్ లో నర్మద క్యారెక్టర్ చేస్తున్న అన్షు.. ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. కానీ బయట మాత్రం షార్ట్ లో హల్ చల్ చేస్తోంది.

అన్షు రెడ్డి పోజులు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ ప్లే చేసే అన్షు రెడ్డి ఇవాళ (జూన్ 2) సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. బ్లాక్ షర్ట్ లో, డెనిమ్ షార్ట్ లో పొట్టి బట్టలతో అన్షు దర్శనమిచ్చింది. ‘‘ఉన్నది ఒకటే జిందగీ’’ అనే క్యాప్షన్ తో ఈ బీచ్ ఫొటోలను అన్షు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
అక్కడ చీరలో.. ఇక్కడ షార్ట్ లో
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్లో అన్షు ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. ప్రేమ క్యారెక్టర్ చేసే మరో హీరోయిన్ చుడీదార్లు వేసుకుంటుంది కానీ అన్షు మాత్రం చీరకట్టులోనే నిండుగా, పద్ధతిగా కనిపిస్తుంది. రామరాజు నడిపి కోడలుగా సంప్రదాయబద్ధమైన క్యారెక్టర్ ను కంటిన్యూ చేస్తోంది. కానీ బయట మాత్రం షార్ట్ లో కనిపించి షాకిచ్చింది. తనలో మరో యాంగిల్ కూడా ఉందని చెప్పకనే చెప్పింది.
ఫ్యాన్స్ రియాక్షన్
అన్షు రెడ్డి పోస్టుకు ఫ్యాన్స్ రియాక్టవుతున్నారు. లవ్, హార్ట్ ఎమోజీలు పెడుతున్నారు. కొందరేమో.. ‘‘సూపర్ అక్క’’, ‘‘అన్షు అక్క వ్లాగ్స్ చేయండి’’ అని కామెంట్లు పెట్టారు. ఇక ఒక యూజర్ ఏమో.. ‘‘మీకు సారీ సే బాగుంటాయి’’ అని కామెంట్ చేశారు. ఇక ‘బ్యూటీఫుల్’, ‘గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నావ్’’ అని పోస్టు చేశారు.
రామరాజు కోడలు
స్టార్ మాలో వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు రెండో కోడలు నర్మదగా అన్షు రెడ్డి నటిస్తోంది. రామరాజు కుటుంబ కథతో ఈ సీరియల్ సాగుతోంది. ఇందులో రామరాజుగా బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, అతని భార్య వేదవతిగా ఆమని నటిస్తున్నారు. ఇందులో రామరాజుకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. టీఆర్పీ రేటింగ్ లో ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


