Illu Illalu Pillalu: స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రేటింగ్ లో అదుర్స్ అనిపిస్తోంది. ఈ టాప్ సీరియల్ కు తెలుగు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎమోషనల్ తో పాటు ట్విస్టులతోనూ ఎంటర్ టైన్ చేస్తోంది.
కలిసిపోయిన నర్మద, ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్లు, రామరాజు కోడల్లయిన నర్మద, ప్రేమ మళ్లి ఒక్క చోటుకు చేరారు. రామరాజు కోడల్లుగా ఆ ఇంటిని నర్మద, ప్రేమ కాపాడుతూ వచ్చారు. కానీ బల్లక్కాయ్, భద్రావతి కుట్ర కారణంగా ధీరజ్, ప్రేమ విడిపోయారు. ప్రేమ తన పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ నర్మద అసలు నిజాలు బయటపెట్టడంతో ధీరజ్ ను పెళ్లి చేసుకున్న ప్రేమ తిరిగి అత్తారింటికి వచ్చింది.
బల్లక్కాయ్ భరతం
రామరాజు ఇంట్లో ప్రాబ్లెమ్స్ అన్నింటికీ బల్లక్కాయ్ కారణమని నర్మద తెలుసుకుంది. అందుకే పెద్ద కోడలు శ్రీవల్లికి ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో తన బండారం ఎప్పుడు బయటపడుతుందేమోనని వల్లి వణికిపోతుంది. ఈ నేపథ్యంలో నర్మద, ప్రేమ కలవడంతో బల్లక్కాయ్ టెన్షన్ మరింత పెరిగిపోయింది.
కుట్ర బయటపెడతారా?
కొత్త కోడలిగా పాత ప్రేమ తిరిగి రామరాజు ఇంటికి వచ్చింది. ఇక బల్లక్కాయ్ కుట్రలను మామయ్యకు ఎప్పుడు చెప్తావంటూ నర్మదను ప్రేమ అడిగింది. ఈ మాటలు విన్న బల్లక్కాయ్ ఫ్యూజులు ఔట్ అయిపోయాయి. అయితే నర్మద ఇప్పుడే బల్లి కుట్రల గురించి మామయ్యకు చెప్పే సూచనలు కనిపించడం లేదు.
కుటుంబమంతా ఆనందంగా కలిసి ఉండాలని రామరాజు కోరుకుంటున్నాడు. ఇప్పుడే ధీరజ్, ప్రేమ పెళ్లితో ఆ ఇంట్లో మళ్లీ సంతోషం నిండింది. ఈ సమయంలో వల్లి గురించి చెప్తే కచ్చితంగా ఆమెను ఇంటి నుంచి గెంటేసే ఛాన్స్ ఉంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నర్మద అనుకుంటుంది.
వల్లితో ఆటలు
{{/usCountry}}కుటుంబమంతా ఆనందంగా కలిసి ఉండాలని రామరాజు కోరుకుంటున్నాడు. ఇప్పుడే ధీరజ్, ప్రేమ పెళ్లితో ఆ ఇంట్లో మళ్లీ సంతోషం నిండింది. ఈ సమయంలో వల్లి గురించి చెప్తే కచ్చితంగా ఆమెను ఇంటి నుంచి గెంటేసే ఛాన్స్ ఉంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నర్మద అనుకుంటుంది.
వల్లితో ఆటలు
{{/usCountry}}గతంలో వల్లి కాల్ రికార్డింగ్ ను అడ్డం పెట్టుకొని ఆమెతో నర్మద, ప్రేమ ఆడుకున్నారు. అయినా వల్లిలో మార్పు రాలేదు. దొంగ ప్రెగ్నెన్సీ నాటకం ఆడింది. ఆ గుట్టు బయటపడ్డా కూడా బల్లక్కాయ్ మారలేదు. ఈ సారి ఏకంగా భద్రావతితో కలిసి కుట్రలు పన్నింది. ఇప్పుడీ విషయాలన్నీ నర్మదకు తెలుసు. ఆమె దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి.
మరి ఈ ఆధారాలు చూపించి బల్లక్కాయ్ ను నర్మద ఎలా ఆడుకుంటుంది? వల్లికి మారేందుకు మరో ఛాన్స్ ఇస్తుందా? అసలు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది.