Illu Illalu Pillalu: స్టార్ మాలో అదిరిపోయే ట్విస్ట్ లు, ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ టీఆర్పీ రేటింగ్ లో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సీరియల్ లోని పరిణామాలు చూస్తే కథ మరో కీలక మలుపు తీసుకునేలా కనిపిస్తోంది.
సాగర్ లంచావతారం

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజుకు నడిపోడు సాగర్ అంటే పిచ్చి కోపం. డబ్బులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగం కొనుక్కున్నాడని చీప్ గా చూస్తున్నాడు. ఇక సాగర్ కూడా పంతానికి పోయి తన భార్య నర్మదతో కలిసి వేరు కాపురం పెట్టాడు. ఆఫీస్ లోనేమో లంచాలకు అలవాటు పడ్డాడు.
రెడ్ హ్యాండెడ్ గా
ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో లంచం డబ్బుతో నర్మదకు రెడ్ హ్యాండెడ్ గా సాగర్ దొరికాడు. దీంతో నర్మద పెద్ద పెద్ద మాటలు అన్నది. మోసగాడివని తిట్టింది. కానీ అది లంచం సొమ్ము కాదని, ఆఫీస్ మెయింటేనెన్స్ కోసం తీసుకున్నానని సాగర్ పచ్చి అబద్ధం చెప్పాడు. తనకు అసలు లంచం అంటేనే ఏంటో తెలియదన్నట్లు తెగ నటించేశాడు. దీంతో నర్మద కరిగిపోయింది.
బల్లక్కాయ్ కుట్ర
రామరాజు ఇంట్లోనే సొంత శత్రువుగా బల్లక్కాయ్ మారింది. శ్రీవల్లి తన మోసాల కారణంగానే కాపురాన్ని నాశనం చేసుకుంది. కానీ అందుకు నర్మద, ప్రేమ కారణం అని పగబట్టింది. ఇప్పటికే భద్రావతితో కలిసి కుట్ర చేసి ధీరజ్, ప్రేమ విడిపోయేలా చేసింది. ఇప్పుడు ఇక నర్మదను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో సాగర్ లంచావతారం వల్లికి మంచి ఛాన్స్ లా దొరికినట్లే కనిపిస్తోంది. మేకర్స్ అదే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బండారం బయటపెట్టి
ఇల్లు ఇల్లాలు పిల్లలు మేకర్స్ ఇప్పుడు సాగర్ లంచాలు తీసుకోవడాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇప్పటికే నర్మదకు దొరికినట్లు దొరికి తప్పించుకున్నాడు సాగర్. ఈ నేపథ్యంలో సాగర్ లంచాలు తీసుకుంటున్నాడనే విషయాన్ని వల్లి త్వరలోనే తెలుసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.
{{/usCountry}}ఇల్లు ఇల్లాలు పిల్లలు మేకర్స్ ఇప్పుడు సాగర్ లంచాలు తీసుకోవడాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇప్పటికే నర్మదకు దొరికినట్లు దొరికి తప్పించుకున్నాడు సాగర్. ఈ నేపథ్యంలో సాగర్ లంచాలు తీసుకుంటున్నాడనే విషయాన్ని వల్లి త్వరలోనే తెలుసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.
{{/usCountry}}ఒకవేళ అదే జరిగితే వల్లి కుట్రకు బీజం పడుతుంది. సాగర్ లంచాలు తీసుకుంటున్నాడనే విషయాన్ని అటు మామయ్య రామరాజుకు, ఇటు నర్మదకు తెలిసేలా చేసి ఇంట్లో పెద్ద దుమారమే లేపుతుంది వల్లి. అదే జరిగితే సాగర్ ను ఇటు తండ్రి, అటు భార్య మరింత దూరం పెడతారు.
నర్మద బయటకు
అవినీతి, అన్యాయాన్ని సహించని నర్మద ఒకవేళ తన భర్త అవినీతిపరుడని తెలిస్తే మాత్రం అసలు క్షమించదు. కచ్చితంగా సాగర్ కు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇదే కారణంతో నర్మద, సాగర్ ను వల్లి విడగొట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తాజా ఎపిసోడ్ లు హింట్ ఇస్తున్నాయి. మరి ఈ సీరియల్ కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్ లో తేలిపోనుంది.