Illu Illalu Pillalu: బుల్లితెరపై టాప్ రేటింగ్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తిరుగులేకుండా దూసుకెళ్తోంది. ఈ సీరియల్ లోని క్యారెక్టర్లు చేసే కుట్రలు, పాత్రల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్, కథను మలుపు తిప్పే ట్విస్ట్ లకు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఈ సీరియల్ ను చూసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.
కన్నింగ్ బల్లక్కాయ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు కుటుంబానికి బయట శత్రువు భద్రావతి అయితే, ఇంట్లోని శత్రువు పెద్ద కోడలు శ్రీవల్లి. అబద్ధాల చెప్పి, మోసం చేసి రామరాజు పెద్ద కొడుకు చందును వల్లి పెళ్లి చేసుకుంది. తన కుట్రలు బయటపడుతున్నా ఎప్పటికప్పుడూ కన్నింగ్ బుద్ధితోనే కుతంత్రాలు చేస్తూనే ఉంది ఈ బల్లక్కాయ్.
వల్లినే కారణం
ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ధీరజ్, ప్రేమ విడిపోవడానికి కారణం బల్లక్కాయ్ అని నర్మద, ప్రేమతో పాటు వల్లి భర్త చందుకు తెలిసిపోయింది. నర్మద, ప్రేమ ఏమో ఈ విషయాన్ని రామరాజుకు చెప్పాలని చూస్తున్నారు. చందు ఏమో తన భార్యను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బల్లక్కాయ్ తప్పు ఒప్పుకోకుండా, తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది.
చందుపై నింద
ఎక్కడ తన కుట్రను రామరాజుకు చెప్పేస్తారోనని తన అత్త వేదవతిని కిందపడేలా వల్లి చేసింది. ఇక చందు ఏమో బల్లక్కాయ్ పై ఆవేశంతో ఊగిపోయాడు. మెడ పట్టుకొని బయటకు గెంటేశాడు. దీంతో ఈ బల్లక్కాయ్ మరో కుట్రకు తెరతీసింది. తన తప్పులను రామరాజు నమ్మకుండా ఉండేలా కొత్త నాటకం స్టార్ట్ చేసింది.
పిల్లలను కనడం లేదని చందు బావ కొడుతున్నాడని రామరాజుకు వల్లి పెద్ద అబద్ధం చెప్పింది. తన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం చందుపై లేని పోని నిందలు వేసింది. అంతే కాకుండా నర్మద తనపై కుట్ర పన్నిందని కూడా రామరాజుకు వల్లి మాయ మాటలు చెప్పింది.
కాపురం నాశనం
{{/usCountry}}పిల్లలను కనడం లేదని చందు బావ కొడుతున్నాడని రామరాజుకు వల్లి పెద్ద అబద్ధం చెప్పింది. తన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం చందుపై లేని పోని నిందలు వేసింది. అంతే కాకుండా నర్మద తనపై కుట్ర పన్నిందని కూడా రామరాజుకు వల్లి మాయ మాటలు చెప్పింది.
కాపురం నాశనం
{{/usCountry}}చందుపై నింద వేసి తప్పించుకోవాలని వల్లి చూసింది కానీ తన చేతులతోనే తన కాపురం కూల్చుకుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతోంది. వల్లి అబద్ధాలను నమ్మిన రామరాజు తెగ ఆవేశంతో చందును ఇంటి నుంచి గెంటేసేందుకు రెడీ అయ్యాడు. చందు టార్చర్ చేస్తున్నాడని వల్లి చెప్పిందని రామరాజు అందరికి చెప్పేశాడు.
ఛీకొడుతున్న చందు
ఇప్పటికే బల్లక్కాయ్ ను చందు ఛీకొడుతున్నాడు. ఇక ఇప్పుడు చందుపై ఇంత పెద్ద నింద వేసి, తను ఎంతో ప్రేమించే తండ్రి చేతుల్లోనే అవమానపడేందుకు వల్లి కారణమైంది. దీంతో చందుకు వల్లిపై ద్వేషం మరింత పెరిగింది. ఇక ఈ జన్మలో బల్లక్కాయ్ ను చందు క్షమించే సూచనలు కనిపించడం లేదు. వల్లిని చందు శాశ్వతంగా దూరం పెడతాడనిపిస్తోంది.
మరి రాబోయే ఎపిసోడ్లలో ఏం జరుగుతుంది? చందుపై పడ్డ నింద నిజం కాదని తెలుస్తుందా? వల్లి బండారాన్ని నర్మద బయటపెడుతుందా? అన్నది ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ పై క్యూరియాసిటీని పెంచుతోంది.