Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో మామ చెప్పడంతో సాగర్ రామరాజును ఆస్తిలో వాటా అడుగుతాడు. రామరాజు చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటాడు. ఆస్తిలో పిల్లలకు కూడా హక్కు ఉంటుంది కదా. లేకుంటే కోర్టుకు వెళ్తామని సాగర్ మామ ప్రసాద్ రావు అంటాడు.
నలుగురిలో స్వార్థపు తండ్రిగా

నీ అంతట నువ్వు పంచిస్తే నీకు గౌరవంగా ఉంటుంది. అదే కోర్టు ఆర్డర్ వేసినప్పుడు పంచితే నలుగురిలో స్వార్థపు తండ్రివి అన్న ముద్ర పడుతుందని ప్రసాద్ రావు అంటాడు. నీ బెదిరింపులకు ఈ రామరాజు బెదరడు. ఏం చేసుకుంటావో చేసుకో అని రామరాజు అంటాడు. మీరు ఆస్తి పంచకపోతే పోలీస్ స్టేషన్‌లా చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని లాయర్ అంటాడు. బయటకు వెళ్లమని రామరాజు అంటాడు.
ఈ పెద్దమనిషి వినడు కానీ కోర్టుకు వెళ్లి నోటీసులు పంపిద్దాం పదా అని సాగర్ అంటాడు. రేయ్ నడిపోడా ఏంట్రా. కన్నతండ్రిపై కేసు పెడతావా అని వేదవతి అంటే.. మర్యాదగా మాట వినకుంటే ఏం చేస్తామని సాగర్ అంటాడు. నోరు మూయిరా. మీరు ఆస్తి పంచుకుని వెళ్లిపోతే ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది. దాని బాగోగులు ఎవరు చూసుకుంటారని వేదవతి అడుగుతుంది.
అమూల్య పెళ్లి అయ్యేదాకా అందరు నోరు మూసుకుని ఉండండి. దాని పెళ్లి అయ్యాక మీరు అడగడం కాదు నా అంతట నేనే అందరికి వాటాలు ఇప్పిస్తాను. అప్పటివరకు ఆస్తి పంపకాల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదని వేదవతి తెగేసి చెప్పి ట్విస్ట్ ఇస్తుంది. ఏమయ్యా ప్రసాద్ రావు గారు విన్నారుగా వెళ్లండి అని వేదవతి అంటుంది. ఇలా ఆస్తి పంపకాల గురించి అడిగితే మీరు కాదు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని నేనే కేసు పెడతానని తండ్రిని బెదిరిస్తుంది నర్మద.
తండ్రి మీద నర్మద కేసు
అంటే ఇన్‌డైరెక్ట్‌గా తండ్రి మీద కేసు పెడతానని వార్నింగ్ ఇస్తుంది నర్మద. దాంతో తండ్రి ప్రసాద్ రావు షాక్ అవుతాడు. సాగర్ నువ్వు గుమ్మం దాటితే చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అందుకే ఆస్తిలో నీ వాట పంచి ఇచ్చాకే ఈ గుమ్మం నుంచి అడుగు పెట్టు అని ప్రసాద్ రావు అంటాడు. అంతవరకు ఈ ఇంట్లో ఉండటం నా వల్ల కాదంటాడు సాగర్. దాంతో సుకన్య శ్రీవల్లికి సైగ చేస్తుంది. అయితే, ఇదే ఇంట్లో నువ్వు నర్మద వేరు కాపురం ఉండండి అని శ్రీవల్లి అంటుంది.
{{/usCountry}}అంటే ఇన్‌డైరెక్ట్‌గా తండ్రి మీద కేసు పెడతానని వార్నింగ్ ఇస్తుంది నర్మద. దాంతో తండ్రి ప్రసాద్ రావు షాక్ అవుతాడు. సాగర్ నువ్వు గుమ్మం దాటితే చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అందుకే ఆస్తిలో నీ వాట పంచి ఇచ్చాకే ఈ గుమ్మం నుంచి అడుగు పెట్టు అని ప్రసాద్ రావు అంటాడు. అంతవరకు ఈ ఇంట్లో ఉండటం నా వల్ల కాదంటాడు సాగర్. దాంతో సుకన్య శ్రీవల్లికి సైగ చేస్తుంది. అయితే, ఇదే ఇంట్లో నువ్వు నర్మద వేరు కాపురం ఉండండి అని శ్రీవల్లి అంటుంది.
{{/usCountry}}దాంతో అంతా షాక్ అవుతారు. బుద్ధిలేకుండా సలహా ఇస్తున్నావా అని వేదవతి తిడుతుంది. ఒకే ఇంట్లో తండ్రికొడుకులను వేరు చేయాలని చూస్తున్నావా అని నర్మద అంటుంది. ఇదే ఊరిలో వేరే ఇంట్లో ఉంటే మావయ్య పరువు గోదారిలో కొట్టుకుపోదు. అదే ఇదే ఇంట్లో గీత గీసుకుని ఉంటే నలుగురికి తెలియదు కదా. ఏమంటారు మావయ్య అని అమాయకంగా అడుగుతుంది శ్రీవల్లి. ఏదోటి చేయండని చెప్పేసి రామరాజు వెళ్లిపోతాడు.
గీత గీయడానికి మావయ్య ఒప్పుకున్నాడని సుకన్యకు చెబుతుంది వల్లి. దాంతో రామరాజు ఇంట్లో పెయింట్‌తో గీత గీస్తుంది వల్లి. అలా రామరాజు కుటుంబం రెండుగా చీలుతుంది. రామరాజు, వేదవతి కుమిలిపోతారు. ప్రసాద్ రావు సంతోషిస్తాడు. మరోవైపు భద్రావతి వాళ్లు టపాసులు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. రామరాజు పేసు మాడిపోయిందేంట్రా అని నవ్వుతుంటారు భద్రావతి, సేనాపతి.
దెప్పిపొడిచిన సేనాపతి
ఏరా నట్టింట్లో గీత గీశారట కదా. ఇల్లు రెండు ముక్కలైందట కదా. మీ ఇంట్లో గొడవలు జరుగుతుంటే మేము పండగ చేసుకోకుండా ఎలా ఉంటామని అని భద్రావతి నవ్వుతుంది. అక్క ఈ పనోడికి శత్రువులు ఎక్కడో లేరు. వాడి కొడుకుల రూపంలో ముసుగులు వేసుకుని ఉన్నారు. ఏ కొడుకులను చూసి ఎగిరెగిరి పడ్డాడో ఆ కొడుకులే గుండెల్లో పొడుస్తున్నారు అని సేనాపతి అంటాడు. రామరాజును దెప్పిపొడుస్తారు.
ఇప్పుడే ఏముందిరా. ముందుంది నీకు ముసళ్ల పండగ. మిగిలిన నీ కొడుకులు కూడా ఇలాగే చేస్తారని, దిక్కులేనివాడిగా చస్తావని, అనాథలా నీ చావు ఉంటుందని అంటారు. దాంతో ధీరజ్ కోపంగా వెళ్తే వేదవతి ఆపుతుంది. ఇలాంటి నీచులు నా అన్నయ్య, అక్క అని బాధేస్తుందని వేదవతి అంటుంది. మరి ఇంటికి తీసుకొచ్చి పెంచినవాడు ఇదే ఇంటి అమ్మాయిని లేపుకెళ్లినవాడిని ఏమంటారని భద్రావతి అంటుంది.
ప్రేమ, ధీరజ్ గురించి అంటుంది భద్రావతి. ఇంకోసారి వీడు మోసం చేసి తీసుకెళ్లాడని అనకు. అసలు జరిగింది తెలిస్తే అని ప్రేమ అంటే.. ధీరజ్ ఆపుతాడు. కోపం, పగ వంటి పొరలు తీసి చూస్తే నిజాలు కనపడతాయని ప్రేమ అంటుంది. రామరాజు కుటుంబం గురించి గొప్పగా చెబుతుంది. నాకే నీతులు చెబుతున్నావా నువ్వు అని భద్రావతి తిడుతుంది. బొమ్మల కొలువు లాంటి నీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అది చూసి చచ్చేందుకు సిద్ధంగా ఉండమని వెళ్లిపోతుంది భద్రావతి.
ఇంకో మంట అంటుకుంది
రామరాజు అవమానంతో సాగర్‌ను చూస్తూ వెళ్లిపోతాడు. ఆ ప్రసాద్ రావు మంట పెడితే ఇక్కడ ఇంకో మంట అంటుకుందని భాగ్యం అంటుంది. తర్వాత సుకన్నయ చేయి విరుస్తుంది భాగ్యం. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.