Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో ధీరజ్ ఇంటికోసం ఫ్యామిలీ స్కూటర్ తీసుకొస్తాడు. ఇంటి పనులన్నింటికి, ప్రేమ కోచింగ్‌కు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని ధీరజ్ చెబుతాడు. స్కూటీ గురించి గొప్పగా చెబుతూ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తారు. ఇది ప్రేమ కోసం తీసుకున్నావని తెలుసులే అని అమూల్య అంటుంది.
కస్టమర్‌పై విరుచుకుపడిన ప్రేమ

మరోవైపు కార్ల రేట్ ఎక్కువగా ఉందని, నువ్వు చెప్పినట్లే ట్రైన్‌కి వెళ్దామని భార్యతో అంటాడు కస్టమర్. దాంతో కస్టమర్‌పై విరుచుకు పడుతుంది ప్రేమ. బోడి కస్టమర్ అంటూ తిడుతుంది. ఈ అమ్మాయిని ఎలా భరిస్తున్నావయ్య బాబు. ఇలాంటిది నాకుంటే సన్యాసం పచ్చుకుని కాశీకి వెళ్లేవాన్నని అతని పారిపోతాడు. ఇకనుంచి నేను చూసుకుంటానంటాడు ధీరజ్.
ఇంతలో ధీరజ్‌కు తిరుపతి కాల్ చేస్తాడు. సాగర్ లంచం తీసుకుంది. అది సమస్య అయింది చెబుతాడు. దాంతో షాక్ అయిన ధీరజ్ ఆఫీస్‌కు వెళ్తానంటాడు. మరోవైపు చందు రైస్ మిల్కి అంజలి వస్తుంది. అంజలిని చూసి అంతా షాక్ అవుతారు. అప్పుడే చందు అంజలిని చూసి సంతోషంగా వెళ్లి పలకరిస్తాడు. కానీ, అంజలి పట్టించుకోదు.
ఏ టు జెడ్ చెక్ చేయండి. రేషన్ బియ్యం కనిపించినా, పాలిష్ చేస్తున్నట్లు తెలిసినా యాక్షన్ తీసుకోండని అంజలి అంటుంది. ఈ ఓనర్ని ఇక్కడే ఉండమనండి అని చెప్పి లోపలికి వెళ్లి చెక్ చేస్తుంది అంజలి. మా మేడమ్ మీకు తెలుసా అని చందును డ్రైవర్ అడుగుతాడు. తెలుసు. కానీ, ఇలా ఏంటని చందు అడుగుతాడు. మా మేడమ్ రేషన్ ఆఫీసర్ అని తెలియదా అని డ్రైవర్ అంటాడు.
అంజలికి విడాకులు
అవునా.. తనకు పెళ్లి అయింది. ఊరు వదిలి వెళ్లిపోయింది కదా అని చందు అంటాడు. అయ్యో బాబు తను విడాకులు తీసుకున్నారని తెలియదా అని డ్రైవర్ అంటాడు. దాంతో చందు షాక్ అవుతాడు. ఇంతలో అంజలి వచ్చి పర్సనల్ విషయాలు బయటివాళ్లకు చెప్పడం ఏంటని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో మేనేజర్ వచ్చి ఎక్కడా రేషన్ బియ్యం కనిపించలేదని, ఎక్కడ కల్తీ జరగలేదు. ఆశ్చర్యంగా ఉంది ఎక్కడ కల్తీ జరగకుండా ఉండటం అని అతనంటాడు.
{{/usCountry}}అవునా.. తనకు పెళ్లి అయింది. ఊరు వదిలి వెళ్లిపోయింది కదా అని చందు అంటాడు. అయ్యో బాబు తను విడాకులు తీసుకున్నారని తెలియదా అని డ్రైవర్ అంటాడు. దాంతో చందు షాక్ అవుతాడు. ఇంతలో అంజలి వచ్చి పర్సనల్ విషయాలు బయటివాళ్లకు చెప్పడం ఏంటని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో మేనేజర్ వచ్చి ఎక్కడా రేషన్ బియ్యం కనిపించలేదని, ఎక్కడ కల్తీ జరగలేదు. ఆశ్చర్యంగా ఉంది ఎక్కడ కల్తీ జరగకుండా ఉండటం అని అతనంటాడు.
{{/usCountry}}ఇది రామరాజు గారి రైస్ మిల్ కదా. ఆయన విలువల కోసం బ్రతికే మనిషి. సరే అంతా పర్ఫెక్టుగా ఉందని రిపోర్ట్ పంపించండని అంజలి అంటుంది. చందు మాట్లాడుతుంటే అంజలి పట్టించుకోదు. చూసి చూసి ఆగుతుంది. ఎందుకు పాత గాయాన్ని రేపుతావ్. మన బంధం ముగిసిపోయింది. ఇప్పుడు ఆనందంగానే ఉన్నావు కదా అని వెళ్లిపోతుంది అంజలి.
నేను సంతోషంగా లేనని చందు అంటాడు. మరోవైపు నీళ్ల బిందే తీసుకొస్తున్న శ్రీవల్లి కళ్లు తిరిగి కిందపడిపోతుంది. సౌండ్ విని ఇడ్లీ బాబాయ్ వచ్చి చూస్తాడు. భాగ్యంను పిలుస్తాడు. నీళ్లు చల్లి లేపుతారు. ఏమైందని అడుగుతారు. చందు గాడి బాధలో సరిగా తినట్లేదని భాగ్యం అంటుంది. డాక్టర్ వచ్చి చూస్తుంది. మీరేం కంగారుపడాల్సిన అవసరం లేదు. తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెబుతుంది.
నిజంగా తల్లి కాబోతున్న వల్లీ
శ్రీవల్లి సంతోషిస్తుంది. మందులు వాడండని, రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు తీసుకురండని చెప్పి డాక్టర్ వెళ్లిపోతుంది. దీని బాధలు పంచుకోడానికి ఎవరు లేరని దీని కడుపులో కాయ కాయిస్తున్నాడని భాగ్యం అంటుంది. సిగ్గులేకుండా ఆనందిస్తున్నావా. వాడు నిన్ను రానివ్వకుండా మొండోడిలా తయరయ్యాడు. ఇలాంటి పరిస్థితులో ఇది తల్లి అవుతోందని భాగ్యం అంటుంది.
చందు తిట్టింది తలుచుకుని అమ్మ చెప్పింది నిజమే అని శ్రీవల్లి కన్నీళ్లుపెట్టుకుంటుంది. మరోవైపు సాగర్ గురించి రామరాజు కుటుంబం కంగారుపడుతుంది. ప్రేమ వస్తే నర్మద హగ్ చేసుకుని ఏడుస్తుంది. సాగర్ ఇంటి పరువు తీసి రోడ్డునపడేశాడని ఏడుస్తుంటుంది. ఇంతలో భద్రావతి సంతోషంగా ఢోల్ కొడుతుంది. ఇందు మూలముగా చెప్పేది ఏంటంటే రామరాజు అవమానాలను చెబుతూ దండోరా వేస్తుంది.
నాకు తెలిసి కొడుకు రామరాజుగాడే లంచం తీసుకోమ్మని చెప్పి ఉంటాడని భద్రావతి అంటుంది. దెబ్బకు పరువంతా గంగపాలు అయిందని సేనాపతి అంటే.. కామెడీ చేయకురా. అసలు రామరాజుకు పరువు ఎక్కడ ఉందని భద్రావతి అంటుంది. ప్రేమ గొడవ పడుతుంది. ఇప్పటికీ పాతికేళ్లు ఇలాగే వృథా చేసుకున్నావ్. మిగిలిన బతుకు కూడా ఇలాగే బతుకుతావా. ఇలా నీ బతుక్కు ఏమన్నా అర్థముందా. ఎప్పుడు చూడు మా ఇంటివైపు చూడటమే అని నర్మద తిడుతుంది.
పెళ్లిపెటాకులు లేవు
పోనీలే పెళ్లిపెటాకులు లేవు.. అలా పడి ఉంది అని జాలితో మేముంటే చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్ సిగ్గులేకుండా అని నర్మద అంటుంది. దాంతో వేదవతి వచ్చి నర్మదను కొడుతుంది. ఏంటే ఏం అంటున్నావ్. అందులో వాళ్ల తప్పేముంది. నువ్వు తప్పు చేయడం వల్లే మన పరువు రోడ్డుమీద పడింది. వాడు లంచం తీసుకుంది వాళ్ల ముందు బయటపెట్టాలా. మాకు చెబితే మేము చెప్పేవాళ్లం కదా అని వేదవతి తిడుతుంది.
నేను ఏసీబీ వాళ్లకు పట్టించకపోతే వాళ్లు రేపు సాగర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించి అరెస్ట్ చేయిస్తే మరింత పెద్ద శిక్ష పడేది. అదే ఇప్పుడు అయితే జాబ్ మాత్రమే పోతుంది అని నర్మద అంటుంది. దాంతో వేదవతిని తిడుతాడు రామరాజు. నేను కూడా ఇలాగే చేసేవాడిని నన్ను కూడా అనేదానివా అని రామరాజు అంటాడు. ఇంతలో సాగర్, ధీరజ్ వస్తారు.
ఉద్యోగం పోయిందా. హమ్మయ్య ఓ పనైపోయింది. ఇక్కడ చిత్రంగా పెళ్లామే మొగుడుని పట్టించింది. ఇలాంటి పెళ్లాం ఉన్నందుకు సిగ్గుపడాలిరా సాగర్ అని రెచ్చగొట్టి వెళ్లిపోతుంది భద్రావతి. నా ఉద్యగం పోయింది. ఇకనుంచి ఇంట్లోనే ఉంటాను. లేదా కూలీ పనికి వెళ్తాను. దీనికోసమేగా నువ్వు ఇదంతా చేసింది అని నర్మదను తిడతాడు సాగర్.
లాజిక్‌తో కొట్టిన రామరాజు
దాంతో సాగర్ చెంపపగలగొడతాడు రామరాజు. ఇంకొక్క మాట మాట్లాడితే ఇక్కడే పాతేస్తాను. నీకు వాడు లంచం ఇస్తున్నాడంటే వాడు ఏదో తప్పు చేస్తున్నాడని అర్థం. వాడు చేసే పాపంలో నీకు వాటా వస్తుంది. అదంతా అవసరమా అని రామరాజు అంటాడు. అవసరమే నాన్న అవసరమే.. కొడతారా కొట్టండి అని సాగర్ కోప్పడతాడు. ధీరజ్ ఆపుతాడు.
చందు వస్తే.. 20 లక్షలు లంచం తీసుకుని ఏసీబీకి దొరికిపోయాడని రామరాజు చెబుతాడు. నర్మద ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. సాగర్ మీద బిందెడు నీళ్లు పోస్తాడు. ఈ నీళ్లతోపాటే వాడి మనసులోని చెడు ఆలోచనలను వదిలేస్తేనే లోపలికి రమ్మనండి. అలా కాకుండా లంచగొండిలాగే ఉంటానంటే నా ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదని రామరాజు తెగేసి చెబుతాడు.
వాడు తెలిసోతెలియక చేశాడు. దానికి మందలించాల్సిపోయి దాన్నే పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు అని చందు అంటాడు. శభాష్‌రా పెద్దోడా.. శభాష్. నీ తమ్ముడు తప్పు చేశాడు క్షమించి లోపలికి రమ్మనాలి. పిలుస్తానురా. మరి వల్లి కూడా తెలిసో తెలియకో తప్పు చేసింది. నువ్వు క్షమిస్తున్నావా.. లేదు కదా.. నువ్వు కూడా క్షమించి వల్లిని తీసుకురా అప్పుడు నేను కూడా వీడిని ఇంట్లోకి రానిస్తానని చందును లాజిక్‌తో కొడతాడు రామరాజు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.