Illu Illalu Pillalu November 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- కొట్టుకున్న అత్తాకోడలు- రామరాజు కాళ్లు పట్టుకున్న భాగ్యం
Illu Illalu Pillalu Serial November 9th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 9వ ఎపిసోడ్లో శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తానని మాట ఇచ్చానని వేదవతికి చెబుతుంది నర్మద. దాంతో అత్తాకోడళ్లు కొట్టుకుంటారు. దారిలో వస్తున్న ఇడ్లీ బాబాయ్, భాగ్యంకు యాక్సిడెంట్ చేసినట్లు చేసి తప్పిస్తాడు ధీరజ్.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో వేదవతికి నర్మద కాఫీ ఇస్తుంది. ధీరజ్ ఫైనాన్స్ విషయంలో చింతామణి, భద్రావతి ట్రాప్ చేశారట, విశ్వ చెప్పారని కంగారుగా చెబుతుంది వేదవతి. మావయ్య వెళ్లారంటే చక్కదిద్దుకుని వస్తారని నర్మద చెబుతుంది. వేదవతి కాఫీ తాగుతుంటే బీపీ ట్యాబ్లెట్ వేసుకోమంటుంది.

నువ్వు ఎవరే మాట ఇవ్వడానికి
నేను చెప్పేదానికి బీపీ రావచ్చు అని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది నర్మద. విషయం చెప్పమని వేదవతి అడుగుతుంది. మన వల్లిని మళ్లీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని మాట ఇచ్చానని నర్మద చెబుతుంది. దాంతో తిరుపతి షాకై కిందపడతాడు. సుకన్య సంతోషిస్తుంది. నువ్వు ఎవరో మాట ఇవ్వడానికి. ఇది నా ఇల్లు. నాకు నచ్చినవాళ్లే ఇంట్లో ఉంటారు. నచ్చనివాళ్లు బయట ఉంటారని వేదవతి కోప్పడుతుంది.
ఏంటీ మీ ఇల్లా. ఓహో.. అక్కడిదాకా వచ్చిందా యవ్వారం. నేను ఇంటి కోడలిని నాకు కూడా హక్కు ఉందని నర్మద అంటుంది. నన్ను దాటుకుని ఆ రాక్షసిని ఇంట్లోకి తీసుకురాగలవా. తీసుకొచ్చి దాన్ని ఇంట్లో అడుగుపెట్టిస్తే దానికి నీకు ఇద్దరికి కాళ్లు విరుగుతాయ్ అని వేదవతి వార్నింగ్ ఇస్తుంది. ఈవిడ పెద్ద జిల్లా కలెక్టర్. చూస్తూ ఉండండి వల్లిని నేను ఇంటికి తీసుకొస్తానని నర్మద ఛాలెంజ్ చేస్తుంది.
ఇది నా సామ్రాజ్యం. నేను శివగామి. ఇక్కడ నేను చెప్పిందే శాసనం అని వేదవతి అంటుంది. అంత లేదు. ఈరోజుల్లో నడిచేది కోడళ్ల రాజ్యం. అంతదాక వస్తే తాడోపేడో తేల్చుకునేదాకా వదలను అని నర్మద అంటుంది. అలా అయితే ఈ ఇంటికి ముందు కోడలు నేనే. నా తర్వాతే ఎవ్వరైనా అని వేదవతి అంటుంది. అత్తాకోడళ్లు ఇద్దరు గొడవ పడతారు. కొట్టుకుంటారు.
వల్లి అక్కకు ఒక్క ఛాన్స్ ఇద్దాం
తిరుపతి, సుకన్య ఆపాలని చూసిన ఆగరు. మరింత రెచ్చిపోతారు. అరిచి, గొడవ పెట్టుకుని అలసిపోయి ఆగుతారు. వల్లి అక్క ముందులా లేదు. చాలా మారిపోయింది. అఘాయిత్యం చేసుకునేదాకా వెళ్లిందని నర్మద చెబుతుంది. కోడలంటే అని నర్మద చెబుతుంటే కోడలి పురాణం చెప్పకని వేదవతి ఆపుతుంది. నేను ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే వల్లికి ఫైనల్‌గా ఒక్క ఛాన్స్ ఇద్దాం. మారిందని పూర్తిగా నమ్మకం కుదిరినప్పుడే ఇంటికి తీసుకొద్దామని నర్మద అంటుంది.
కుక్క తోక వంకరే. అది మారినప్పుడు చూద్దాంలే. కానీ ముందే ఇంటికి తీసుకొచ్చే పనులు పెట్టుకోకని వేదవతి అంటుంది. మీరు చూద్దామంటే అయిపోయినట్లే అని పొగుడుతుంది నర్మద. దాంతో వేదవతి నవ్వుతుంది. వేదవతిని ఒప్పించినందుకు నర్మదకు సుకన్య థ్యాంక్స్ చెబుతుంది. దాంతో మళ్లీ వచ్చిన వేదవతి సుకన్యకు మొట్టికాయ వేస్తుంది.
వల్లి మారితే దాన్ని క్షమిస్తాను కానీ భాగ్యంను కాదు. దాన్ని మాత్రం వదిలిపెట్టకూడదని వేదవతి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు లూనా పైన భాగ్యంతో పాటు ఇడ్లీ బాబాయ్ కూతురు వల్లికోసం వెతుకుతుంటాడు. అది హాయిగా తిని పడుకుని ఉంటుందని భాగ్యం అంటుంది. మరోవైపు కారులో ధీరజ్, ప్రేమ, రామరాజు వస్తుంటారు.
భాగ్యంకు బుద్ధి వచ్చేలా చేస్తా
అద్దంలో భాగ్యం వాళ్లను చూసి కారు సడెన్‌గా ఆపుతాడు ధీరజ్. భద్రంకు బుద్ది వచ్చింది భాగ్యంకు బుద్ధి రావాలంటాడు. వెనక్కి రివర్స్ చేస్తాడు ధీరజ్. ఇడ్లీ బాబాయ్ బైక్ ఆపుతాడు. వాడు మన మీదకే వస్తున్నాడే అని భయపడతాడు. భాగ్యం ధైర్యం చెబుతుంది. ఇడ్లీ బాబాయ్ ముందుకు వెళ్తాడు. ధీరజ్ కారు స్పీడుగా నడుపుతాడు. రామరాజు వద్దంటాడు.
ఏం కాదు మావయ్య అని ప్రేమ అంటుంది. స్పీడుగా వెళ్లిన ధీరజ్ ఇడ్లీ బాబాయ్ రాగానే పక్కకు కారు తిప్పుతాడు. దాంతో స్పీడులో ఉన్న బైక్ కంట్రోల్ కాక పక్కకు వెళ్లిపడిపోతారు ఇడ్లీ బాబాయ్, భాగ్యం. ఇడ్లీ బాబాయ్, భాగ్యానికి దెబ్బలు తగులుతాయి. రక్తం కారుతుంది. అల్లుడు గారు మీరు చాలా మంచివారండి. చంపేస్తారనుకున్నాను. కాపాడారు అని ఇడ్లీ బాబాయ్ అంటాడు.
మిమ్మల్ని వదిలేసింది ప్రేమతో కాదు. మీ భార్య మా నాన్న కాళ్లు పట్టుకుని నలుగురిలో క్షమించమని అడగాలి. చెప్పకుంటే మొగుడుపెళ్లాల అంతు చస్తానని ధీరజ్ అంటాడు. వదిలేయమని రామరాజు అంటాడు. కానీ, ధీరజ్ వినడు. చెప్పింది చేయవేంట్రా. చూడాలని ఉందని రెచ్చగొడుతుంది ప్రేమ. భాగ్యంను క్షమాపణ చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు ఇడ్లీ బాబాయ్.
రామరాజు కాళ్లు పట్టుకున్న భాగ్యం
ఈరోజు భాగ్యం కాళ్లు పట్టుకోవాల్సిందే అని ధీరజ్, ప్రేమ మొండిపట్టుపడతారు. ఇడ్లీ బాబాయ్ రిక్వెస్ట్ చేస్తాడు. చేసేది లేక రామరాజు కాళ్లు పట్టుకోడానికి వంగి నేలను తాకుతుంది భాగ్యం. కాళ్లు పట్టుకోలేదు. నేలకు దండం పెట్టిందని ప్రేమ అంటుంది. దాంతో రామరాజు కాళ్లు పట్టుకుని అలాగే ఉంటుంది భాగ్యం. అంతా చూసి నవ్వుతారు.
ఇడ్లీ బాబాయ్ లేవమంటాడు. ఇప్పుడు నువ్వు హ్యాపీసేనా అని ఇడ్లీ బాబాయ్ అంటే.. ఇంకోసారి పిచ్చిపిచ్చి పనులు చేస్తే తాట తీస్తానని ధీరజ్ బెదిరిస్తాడు. వాళ్ల కూతురు జీవితం వాళ్లే నాశనం చేసుకున్నారంటే వాళ్లు చచ్చినవాళ్లతో సమానంరా అని రామరాజు అంటాడు. ధీరజ్ వాళ్లు వెళ్లిపోతారు. మీ నాన్న కాళ్లు పట్టిస్తావురా. చెబుతారా నీ సంగతి. ఇకనుంచి నా మొదటి శత్రువు నువ్వే అని భాగ్యం అంటుంది.
శ్రీవల్లి తనకు తాకిన దెబ్బలకు మందు పెట్టుకుంటుంది. నర్మద ఇచ్చిన మాట గుర్తు చేసుకుంటుంది. నువ్వు నా పాలిట అమ్మోరువి. నీ మాటతోనే బతికి ఉన్నాను అని సంతోషిస్తుంది శ్రీవల్లి. ఇంతలో భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కట్లతో వస్తారు. ఏమైందని వల్లి అడిగితే మీ అమ్మ బతుకమ్మ రోజు చేసినదానికి ధీరజ్ పగ తీర్చుకున్నాడని, జరిగింది చెబుతాడు ఇడ్లీ బాబాయ్.
నా కుటుంబం జోలికి రాకు
మీ మరిది చావు చివరి వరకు పంపించి తీసుకొచ్చాడు. మీ అమ్మతో ఉన్నందుకు నాకు పడిందని ఇడ్లీ బాబాయ్ అంటాడు. వాళ్లకే బుద్ధి రావాలని భాగ్యం అంటుంది. అమ్మ నువ్వు వేలు పెట్టేకొద్ది ఇంకా రచ్చ అవుతుంది. ఇప్పటికైనా మారకుంటే ధీరజ్ ఏం చేస్తాడో తెలియదు. నోరు మూసుకుని ఉండు. నా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను అని అంటుంది శ్రీవల్లి.
నీ బాగోగులు కోరుకునేది మేమే. మేమే నీ కుటుంబం అని భాగ్యం అంటుంది. తప్పు చేసింది నువ్వు. మారాల్సింది నువ్వు అని శ్రీవల్లి అంటుంది. ఎక్కడో చస్తానని వెళ్లావటగా. మళ్లీ ఎందుకు వచ్చావ్. భయమేసిందా. వెళ్లిన దానివి ఎక్కడో దూకి సచ్చిపోతే. నాలుగు రోజులు ఏడ్చి ఐదో రోజు రామరాజు కుటుంబంపై పగ తీర్చుకోవడం మొదలుపెట్టేదాన్ని. నువ్వు అలా బతికినదానివి కాదు సచ్చినదానివి కాదు అని భాగ్యం అంటుంది.
నేను కూడా సద్దామనే వెళ్లాను. కానీ ఓ దేవత కాపాడింది. నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తానందని శ్రీవల్లి చెబుతుంది. ఎవరు ఆ నర్మదానా.. దాని మొఖం. అది తీసుకెళ్తుందట. ఇది వెళ్తుందట. నేను చూస్తాను. అది నిన్ను ఏమార్చిపోయింది. నువ్వు ఎక్కడ కేసులు పెడతావనో భయంతో నీకు లేనిపోని ఆశలు పెంచిందని భాగ్యం అంటుంది.
నర్మద చెప్పిందంటే చేస్తుంది
నర్మద చెప్పిందంటే చేస్తుంది. అతి త్వరలో నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తుంది అని శ్రీవల్లి అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


