Illu Illalu Pillalu November 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అంజలి ఇంట్లో చందు, ఓదార్చిన మాజీ లవర్- నర్మదకు పరీక్షలు
Illu Illalu Pillalu Serial November 20th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 20వ ఎపిసోడ్లో రామరాజు వల్లే తను ఇలా అయిపోయానని, ఇంట్లో ఉండనని సాగర్ అంటాడు. రాత్రి అంజలి ఇంటికి చందు వెళ్తాడు. తన బాధ చెప్పుకుంటాడు. అంజలి కరిగిపోతుంది. వల్లి తల్లి కాబోతున్నట్లు చెబుతుంటే నర్మద వినదు.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో సాగర్‌పై నీళ్లు పోసి లంచగొండిగా ఉంటే అవసరం లేదని రామరాజు అంటాడు. ఏదో తెలియక చేసినదానికి నువ్వు కూడా అలా అంటావేంటీ నాన్న అని చందు అంటాడు.

నేను ఇలా అవ్వడానికి కారణం ఈయనే
శభాష్‌రా పెద్దోడా. నీ తమ్ముడు పొరపాటున తప్పు చేశాడని క్షమించి ఇంట్లోకి పిలవాలి. సరే పిలుస్తానురా. మరి వల్లి కూడా తెలిసో తెలియకో తప్పు చేసింది క్షమించి ఇంట్లోకి పిలుస్తావా. లేదుకదా. నువ్వు కూడా వల్లిని ఇంట్లోకి తీసుకురా నేను వీడిని రమ్మంటాను అని రామరాజు ఫిట్టింగ్ పెడతాడు. అవసరం లేదు. అసలు ఈ మనిషి నాకు ఏం చేశాడు. నేను ఇలా అవడానికి కారణం ఈయనే అని సాగర్ అంటాడు.
నాకు సహాయం చేయడు కానీ నిందలు వేయడానికి మాత్రం ఉంటాడు. నేను ఇంట్లో ఉండను అని వెళ్లిపోతాడు సాగర్. ధీరజ్, చందు, తిరుపతి ఆపుతారు. కొడుకు తప్పుడుదారిలో వెళ్లకూడదనే నాన్న అంటున్నాడు. ఇలాగే తప్పు చేస్తాను అంటే ఏం చేస్తామురా. పదా ఇంట్లోకి అని లాక్కెళ్తారు.
నా కొడుకు తప్పు చేశాడు కాదనట్లేదు. కానీ, నర్మద చేసింది మాత్రం కరెక్ట్ నేను అనుకోవట్లేదు. వాడు ఎంతగానో సంపాదించుకున్న ఉద్యోగం పోయింది. ఇప్పుడు వాడి జీవితం రోడ్డున పడ్డడ్డే కదా. ఇప్పుడు మీకు, నర్మదకు సంతోషంగా ఉందిగా అని వేదవతి ఏడుస్తూ కోపంగా వెళ్తుంది. నర్మద నాకిప్పుడు దైవం లాంటిది. నాకు బిడ్డపోతుందని తనకు చెబుతాను అని నర్మదకు కాల్ చేస్తుంది శ్రీవల్లి.
వల్లి మాట వినని నర్మద
నర్మద మాట్లాడుతుంది. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని వల్లి అంటే.. నా మనసేం బాగోలేదు. తర్వాత చెప్పు ప్లీజ్ అని నర్మద అంటుంది. సరే నీ మనసు కుదుటపడ్డాకే చెబుతాను అని వల్లి అంటుంది. ఇంతలో భాగ్యం వచ్చి చేయి చాపి ఇప్పటికైనా నా చేయి పట్టుకోవే. నీకు నీ బాబుకు బంగారు భవిష్యత్తు ఉండేలా చేస్తాను. మాయ చేసే భయపెట్టో నీ తలరాతని నేను మారుస్తానని భాగ్యం అంటుంది.
నువ్వు తప్పుగా అనుకోకు. నేను సచ్చినా నీ చేయి పట్టుకోను. నీ సాయం అస్సలు అడగను. నీతో చేతులు కలపడం అంటే నా జీవితాన్ని ఇక్కడే నాశనం చేసుకోవడమే. రేపు నాకు పుట్టబోయే బిడ్డ తర్వాత నా గురించి తెలుసుకున్నప్పుడు నా తల్లి రాక్షసి అనుకోకూడదు. నా జీవితాన్ని నేను సరి చేసుకోగలను. నేను మంచి తల్లిలా ఉండాలనుకుంటున్నాను అని వల్లి అంటుంది.
నీ సావు నువ్వు సావు అని కోపంగా వెళ్లిపోతుంది భాగ్యం. మరోవైపు అంజలి ఇంటికి చందు వెళ్తాడు. చందు రావడం చూసి షాక్ అవుతుంది అంజలి. భయపడి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. నీతో మాట్లాడాలని, తలుపు తీయమని చందు బ్రతిమిలాడతాడు. ఇక్కడి నుంచి వెళ్లిపో. ఎవరైనా చూస్తే బాగుండదంటుంది అంజలి.
నా గుండెల్లో బాధ నీతో పంచుకోనా
నా గుండెల్లో ఉన్న బాధను నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నీ జీవితం లాగే నా జీవితం అయింది. నాకు ఈ బతుకు మీదే విరక్తి వస్తుంది. నువ్వు కూడా దూరం పెడితే నావల్ల కాదు. కనీసం నీకు నా మొహం చూడటానికి, నా మాటలు వినడం కూడా ఇష్టంలేదంటే చెప్పు వెళ్లిపోతాను. ఈ ఊరి నుంచి శాశ్వతంగా అని చందు అంటాడు. దాంతో అంజలి షాక్ అవుతుంది.
ఇక డిస్టర్బ్ చేయనని చందు వెళ్లిపోతుంటే అంజలి తలుపు తీస్తుంది. ఇంట్లో కూర్చుంటారు. ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావ్. నీ జీవితానికి ఏమైంది. మీ నాన్నగారు చూపించిన అమ్మాయి చాలా బాగుంది. అమాయకంగా ఉందని అంజలి అడుగుతుంది. మాలాగే నువ్వు కూడా మోసపోయావ్ అని వల్లి గురించి చెబుతాడు చందు.
ఆరోజు నిన్ను ఎంతలా బాధపెట్టానో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. నిన్ను బాధపెట్టినందుకే నా జీవితం ఇలా అయినట్లుందని చందు అంటాడు. అది నా తలరాత చందు. నేను నిన్ను ఇలా చూడలేను అని అంజలి అంటుంది. దాంతో అంజలి చేయి పట్టుకుంటాడు చందు. నా బాధను పంచుకోడానికి నా మనసుకు దగ్గరైనవాళ్లు ఎవరు లేరు. నువ్వు ఒప్పుకుంటే నా మనసులో బారమంతా పంచుకుంటాను అని చందు అంటాడు.
చందును ఓదార్చిన అంజలి
అంజలి కూడా చేయి వేసి చూడు చందు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. నీకు తగ్గట్లు మారతాయని ధైర్యం చెబుతుంది అంజలి. చందును ఓదారుస్తుంది అంజలి. మరోవైపు సాగర్, నర్మద దగ్గరికి భోజనం చాలా బాగుందంటూ తీసుకెళ్తారు ధీరజ్, ప్రేమ. నర్మదకు ప్రేమ తినిపిస్తుంటే తినదు నర్మద. సాగర్ కూడా వద్దంటాడు.
వీళ్లిద్దరు ఒకే మాట మీద ఉంటారు. మా అక్క వద్దనగానే బావగారు వద్దన్నారు. వీళ్లు పర్ఫెక్ట్ కపుల్ అని ప్రేమ అంటుంది. నకూ నన్ను కాపీ కొట్టేవాళ్లంటే నాకు ఇష్టం ఉండదు అని నర్మద మంచిగా తింటుంది. భర్తను పోలీసులకు పట్టించినవాళ్లకు ఎక్కువ పెట్టండి. చూశారా ఎలా మెక్కుతుందో. కొంచెం కూడా జాలీ లేకుండా అని సాగర్ అంటాడు.
తప్పు చేసినవాళ్లకు సిగ్గు ఉండటం లేదు. నేను చేసింది మంచి పనే. నన్ను నేను సమర్ధించుకుంటూ తట్టెడు తింటాను. దిష్టి కళ్లు వేసుకుని చూడకండని నర్మద అంటుంది. రుచి చూడొచ్చుగా అని ప్రేమ అంటే.. నరకమే చూస్తున్నా. రుచి ఎందుకు అని సాగర్ అంటాడు. మాటలతో నర్మద, సాగర్ వాదించుకుంటారు. ఇంతలో నర్మదకు తన ఫ్రెండ్ మెయిల్ పంపిస్తుంది.
నర్మదకు పరీక్షలు
హై లెవెల్ జాబ్ కోసం అప్లై చేశానుగా. రెండు రోజుల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. రెడీగా ఉండమని మెయిల్ వచ్చింది. ఇలాంటప్పుడు ఏం వెళ్లబుద్ధి అవుతుంది చెప్పు అని నర్మద అంటుంది. జాడించి తింటూ ఉంటే బెంగ పాడా.. వెళ్లి పరీక్షలు రాయడానికి ఏంటంటా. ప్రిపేర్ కాలేదాని చేతులెత్తేసే దానికి ఎందుకు అప్లై చేయడం అంటూ వెళ్లిపోతాడు సాగర్.
ఎంత మాట అన్నాడో చూడు ధీరజ్ అని నర్మద అంటుంది. నువ్వు జాబ్ కొట్టి చూపించు. ఇంకోసారి వాడు నోరు తెరిస్తే ఒట్టు అని ధీరజ్ అంటాడు. రేపు దీపావళి. పండగ అయ్యాక మేమే దిగబెడతామని ప్రేమ అంటుంది. మరోవైపు తిరుపతి మందు తాగుతుంటాడు. మళ్లీ దుకాణం తెరిచావా. రాత్రి, పగలు తేడా లేకుండా తెళ్లార్లు తాగుతూనే ఉన్నావని సుకన్య తిడుతుంది.
నువ్వెవరే అడగడానికి. నేను తాగడానికి అసలు కారణం నువ్వే. మనకు పెళ్లయి ఎన్నిరోజులు అయిందో. పెళ్లాయ్యక ఫస్ట్ నైట్ జరగకుంటే ఈ పిల్లాడి మనసు ఎలా తల్లడిల్లుతుందే. ఆ బాధ దిగమింగుకోలేక ఈ మందు. ఐ వాంట్ ఫస్ట్ నైట్ రైట్ నౌ అని సుకన్య మీద పడిపోతాడు తిరుపతి. మళ్లీ ఆ ఇంటికి వెళ్లేవరకు కండిషన్ గుర్తు చేస్తుంది సుక్కు.
మందు తాగి తిరుపతి ఫస్ట్ నైట్ గోల
ఇది ఇల్లు కాదా. నాకు ఇక్కడే ఫస్ట్ నైట్ జరగాలని సుకన్య వెంటపడతాడు. రచ్చ రచ్చ చేస్తాడు. సుక్కు తప్పించుకుంటూ ఉంటుంది. మరోవైపు ధీరజ్ ఫోన్ చూస్తుంటే ప్రేమ ఆలోచిస్తుంటుంది. అది ధీరజ్ చూస్తాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


