Illu Illalu Pillalu November 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అంజలికి మాటిచ్చిన చందు- ధీరజ్ కారును అమ్మేసి చంపే ప్లాన్

Illu Illalu Pillalu Serial November 21st Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 21వ ఎపిసోడ్‌లో విశ్వకు అమూల్య కాల్ చేస్తుంది. దాంతో సంబరపడిపోతాడు విశ్వ. అంజలిని ఓదార్చిన తర్వాత చందు సంతోషంగా ఉంటాడు. ధీరజ్ దగ్గరికి రౌడీలు కాంప్రమైజ్ అని వస్తారు. ప్రేమను చెల్లెమ్మా అంటూ నమ్మిస్తారు.

Published on: Nov 21, 2026, 09:09:44 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ విపరీతంగా ఆలోచిస్తుంటే.. నీకున్న కోడి బుర్రతో ఆలోచించకు. అన్ని రేపటికి సెట్ అవుతాయ్. ముందు నీ ఎగ్జామ్స్‌పై ఫోకస్ చేయమని లెక్చర్ ఇస్తాడు ధీరజ్. ఇది ఇంటలిజెంట్ బుర్ర ఒక్కసారి చదివితే వందసార్లు చదివినట్లు. ఏదైనా ఈ బుర్రలో ఉండిపోతాయ్ అని ప్రేమ అంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 21వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 21వ ఎపిసోడ్

ధీరజ్ బ్లాక్‌మెయిల్

సరే రెండు ప్రశ్నలు అడుగుతాను చెప్పమని ధీరజ్ అంటే.. తికమక ప్రశ్నలు అడుగుతాడనుకున్న ప్రేమ అర్థరాత్రి పెళ్లాన్ని ప్రశ్నలు అడగడం ఏంట్రా. తెల్లారి అడుగు చెబుతానంటుంది. రేపు దీపావళి. పండగ రోజు నేను ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పను అని తప్పించుకుంటావని ధీరజ్ అంటాడు. కనిపెట్టేసావా. అరేయ్ నా బుర్ర పనిచేయట్లేదు. ఏం అడక్కురా. కావాలంటే నువ్వు ఏం చెబితే అది చేస్తానంటుంది ప్రేమ.

సరే ఒక ముద్దు ఇవ్వమని ధీరజ్ అడిగితే.. ఇవ్వను. రేయ్ ఇలా ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేసి ముద్దు అడుగుతారా అని ప్రేమ అంటుంది. కాసేపటికి కళ్లు మూతలు పడుతూ బుక్ చదవడం కంటే నీకు ముద్దు ఇవ్వడమే బెటర్ అని ఇవ్వబోతుంది ప్రేమ. ఇంతలో సుకన్య వస్తుంది. సుకన్యను తిరుపతి తరుముతుంటాడు. చిన్న పిల్లల గదిలో దూరితే ఈ పులిరాజును ఆపగలవా అని తిరుపతి అంటాడు.

నాన్న చూస్తే పులిరాజు పిల్లిరాజు అవుతావ్ అంటాడు ధీరజ్. ప్రేమ నేను మీ గదిలోనే పడుకుంటాను. అమవాస్య రోజు దెయ్యాలు పడతాయంటారుగా. తిరుపతికి దెయ్యం పట్టినట్టుందని సుకన్య అంటుంది. నీ మొగుడికే దెయ్యం పట్టిందంటావా అని గొడవ చేస్తాడు తిరుపతి. తిరుపతిని బయటకు తీసుకెళ్తాడు ధీరజ్. సుకన్య తప్పించుకుంటుంది.

విశ్వ సంతోషం

మరోవైపు విశ్వ రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవాడు. ఇంకా చేయట్లేదు. ఊరెళ్లాక ఫోన్ చేయాలిగా. నేనే ఫోన్ చేస్తే అని ఆలోచిస్తుంది అమూల్య. విశ్వకు అమూల్య కాల్ చేస్తుంది. దాంతో విశ్వ తెగ సంబరపడిపోతాడు. ఇది నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే అని విశ్వ అంటాడు. ఊరెళ్లి అడ్రస్ లేకుండా పోయావ్. ఎక్కడికి వెళ్లావ అని అడుగుతుంది అమూల్య.

మా తాతకు సీరియస్‌గా ఉందని మా ఊరికి వచ్చామని. ఇంకా 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేం అంటున్నారని విశ్వ అంటాడు. సరే జాగ్రత్తా, ఏదైనా ఉంటే ఫోన్ చేస్తూ ఉండు అని అమూల్య అంటుంది. చెప్పకున్నా చేస్తానని విశ్వ అంటాడు. ఇద్దరు మురిసిపోతారు. మరోవైపు అంజలి అన్న మాటలు తలుచుకుని సంతోషిస్తాడు చందు. మరోవైపు శ్రీవల్లి బాధతో ఉంటుంది.

బావకు తెలిస్తే సంతోషిస్తాడేమో. ఒక్కమాట చెప్పి చూస్తాను అని కాల్ చేస్తుంది వల్లి. అప్పుడే అంజలికి చందు కాల్ చేస్తాడు. నీతో కొంచెం మాట్లాడాలనిపించి చేశాను. నీతో మాట్లాడాక చాలా రిలీఫ్‌గా ఉంది. నిన్నటి వరకు కోపంగా ఉండేవాన్ని ఇప్పుడు చాలా సంతోషంగా మాట్లాడుతున్నాను అని అంతా అంటున్నారు. నాలో ఈ మార్పుకు నువ్వే కారణం అని చందు అంటాడు.

నీ వెంటే ఉంటాను

వల్లి కాల్ చేస్తే చందు ఫోన్ బిజీ వస్తుంది. మనసులో బాధ పంచుకోడానికి మనుషులు తోడుగా ఉండాలి. నువ్వు నీ బాధలను నాతో చెప్పుకున్నావ్. కానీ నా బాధను చెప్పుకోలేక నాకు నేనే బాధపడుతున్నాను. అసలే ఇప్పుడు నీ లైఫే బాగాలేదు. నా గురించి తర్వాత చెబుతాను అని అంజలి అంటుంది. నా లైఫ్‌కే బిందాస్‌గా ఉంది. నువ్వు నా గురించి ఏం ఆలోచించకు. నీకు ఏ బాధ, కష్టమొచ్చిన నాకు చెప్పు. నీ వెంట ఉంటాను అని చందు అంటాడు.

ఒకప్పుడు ఇదే మాట చెప్పావు అని అంజలి అంటుంది. నీకు నేను మాటిస్తున్నా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. నమ్ము అని చందు అంటాడు. సరే చూద్దాం. టైమ్ వచ్చినప్పుడు నా మనసులో బాధను నీతో పంచుకుంటాను అని అంజలి చెబుతుంది. చందు ఫోన్ బిజీ రావడంతో నర్మదకు కాల్ చేస్తుంది వల్లి. అది సాగర్ చూసి నర్మద ఫోన్ పగలగొడతాడు.

ఇంతలో నర్మద వచ్చి నా మీద కోపం ఉంటే గొడవ చేయి కానీ ఫోన్ ఎందుకు విసరేసావ్ అని అంటుంది. నీ మీద కోపంతో కాదు. వల్లి నీకెందుకు ఫోన్ చేస్తుంది. పెద్దోడు వద్దంటున్నాడుగా. నువ్వు మాత్రం వల్లికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్. ఇంటి కోడలివి ఇంటి కోడలిగా ఉండు. అనవసరమైన విషయాల్లో దూరకు అని సాగర్ అంటాడు. ఏదైనా డైరెక్ట్ మాట్లాడు అని నర్మద అంటుంది.

కుళ్లుతో రగిలిపోయిన సాగర్

డైరెక్ట్‌గానే అంటున్నా. నా ఉద్యోగం పీకించావుగా. హై లెవెల్ జాబ్‌కి ఎగ్జామ్ రాయాలని చూస్తున్నావుగా.. అదంతా ఈజీ కాదు. అప్పుడేదో బై లక్‌లో జాబ్ కొట్టేశావ్. మళ్లీ నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లిపోతాను అనుకోకు. జాబ్ రావడం అంతా ఈజీ కాదు. నీకే తెలుస్తుందని చులకనగా మాట్లాడుతాడు సాగర్. నా మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు చేసిన తప్పులకు జాబ్ పోయింది. దానికి పశ్చాత్తాపపడకుండా నా మీద కుళ్లుతో, జెలసీతో మాట్లాడుతున్నావా. చాలా చీప్‌గా ప్రవర్తిస్తున్నావ్ అని నర్మద గొడవ పడుతుంది.

నాకు టైమ్ వస్తుంది. అప్పుడు చెబుతాను అని సాగర్ వెళ్లిపోతాడు. పదే పదే వల్లి అక్క ఎందుకు కాల్ చేస్తుంది. ఏదైనా సమస్యలో ఉందా అని నర్మద ఆలోచిస్తుంది. మరోవైపు ప్రేమను బలవంతంగా చదివిస్తాడు ధీరజ్. స్కూల్‌లో లెక్కల టీచర్ కర్ర పట్టుకుని తిరుగుతున్నట్లుగా తిరుగుతున్నాడు, చదవమని గోల గోల చేస్తున్నాడు. రోజు రోజుకీ శాడిస్ట్‌లా తయారవుతున్నాడని ప్రేమ అనుకుంటుంది.

ఇంతలో కస్టమర్ వచ్చి డబ్బు ఇచ్చి కారు తీసుకుని వెళ్తాడు. 5 వేలు వచ్చిందని ధీరజ్ అంటే.. మంచి బేరమే. ఇలా రోజుకు నాలుగైదు బేరాలు వస్తే మనం అప్పు నుంచి గట్టెక్కొచ్చు అని ప్రేమ అంటుంది. ఇంతలో ఇదివరకు గొడవ పెట్టుకున్న రౌడీలు నామాలు పెట్టుకుని బుద్ధిమంతుల్లా వస్తారు. వచ్చేశాం బావగారు అంటారు. ఏంట్రా గొడవ పడటానికి వచ్చారా అని ధీరజ్ అంటాడు.

రౌడీల కాంప్రమైజ్ డ్రామా

పండగ కదా చెల్లి బావను పలకరించి పోదామని వచ్చామని రౌడీలు అంటారు. ఏరా పండగ మాములు కావాలా అని ధీరజ్ అంటే.. మీరిచ్చే మాములు తెలుసుకదా. పండగపూట ఫ్యామిలీని చూసేందుకు ఊరు వెళ్లాలనుకుంటున్నాం. కార్లు రెంట్‌కి కావాలని రౌడీ అంటాడు. రెంట్‌కి ఇవ్వడం కుదరదంటాడు ధీరజ్. రౌడీలు బతిమిలాడుకుంటారు.

మీతో కలిసిపోదామనుకుంటున్నాం అంటారు. గొడవలు పెంచుకుంటూ పోతే ఎంత దూరమైనా వెళ్తాయి. కలిసిపోతే బెటర్ కదా. మేము ఇప్పటివరకు చరిత్రలో ఎవరిని కాంప్రమైజ్ అడగలేదు. మిమ్మల్ని అడుగుతున్నాం. అందుకు కారణం నువ్వే చెల్లెమ్మా. నిన్ను చూస్తే మా సొంత చెల్లిని చూసినట్లుంది. బావగారు ఎంత చెప్పిన వినరు కానీ ఈ పదివేలు అడ్వాన్స్‌గా మీ దగ్గర ఉంచమ్మా. కారు తీసుకుని వెళ్తాం. తిరిగి రాగానే మిగతా అమౌంట్ ఇస్తామని రౌడీ డబ్బులు ఇస్తాడు.

ప్రేమ డబ్బు తీసుకుంటుంది. ఆ డబ్బులు వాళ్లకే ఇవ్వమని ప్రేమతో అంటాడు ధీరజ్. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా వదిలేయ్. అన్నయ్యలు తగ్గొచ్చి వచ్చారు అని ధీరజ్ మాట వినదు. కారును సేఫ్‌గా తీసుకెళ్లి తీసుకురండని ధీరజ్ మాటను కాదని, పర్మిషన్ లేకుండా కారు కీస్ ఇస్తుంది ప్రేమ. రౌడీలు వెళ్తారు. ఇంత తింగరిదానివి అనుకోలేదని ధీరజ్ అంటాడు.

ధీరజ్ కారును అమ్మేసిన రౌడీలు

రేయ్ ఈ కారను మంచి బేరం చూసి అర్జంట్‌గా అమ్మేయండని, లేకపోతే పార్టులకు పార్టులు పీకైన అమ్మేయండి. రెండు రోజులకల్లా కారు కోసం కచ్చితంగా వాళ్లే వస్తారు. కారు కోసం వచ్చి అక్కడే చస్తాడు. మనతో పెట్టుకుంటాడా. మనతో పెట్టుకునేవాళ్లకు ఇది గుణపాఠంగా నిలిచిపోవాలి అని రౌడీలకు చెబుతాడు లీడర్. రౌడీ కారు తీసుకెళ్తాడు.

మరోవైపు వల్లి దగ్గరికి నర్మద వెళ్తుంది. నర్మదను చూసి శ్రీవల్లి సంతోషంగా హగ్ చేసుకుంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.