Illu Illalu Pillalu November 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లికి రామరాజుతో లాయర్- ధీరజ్ ప్రమాదాన్ని ఆపిన ప్రేమ

Illu Illalu Pillalu Serial November 27th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 27వ ఎపిసోడ్‌లో వల్లికి విడాకులు ఇస్తానని చందు అంటే అంజలి బాధ్యతగా ఉండమంటుంది. చందు లాయర్‌ను కలుస్తాడు రామరాజు. వల్లి తరఫున లాయర్‌ను ఏర్పాటు చేసి మెడికల్ రిపోర్ట్ పెట్టమని రామరాజుకు చందు లాయర్ సలహా ఇస్తాడు.

Published on: Nov 27, 2026, 09:15:49 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్‌కు చందు అబద్ధం చెప్పినందుకు నవ్వుతుంది అంజలి. టీనేజ్‌లో ఉన్నప్పుడు బైక్‌పై తిరిగేవాళ్లం అని, అప్పుడు మీ నాన్న, మా నాన్న చూస్తారనే టెన్షన్ ఉండేదని, చాలా రోజుల తర్వాత మళ్లీ అలాంటి లవ్ ఫీలింగ్ వచ్చిందని అంజలి చెబుతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 27వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 27వ ఎపిసోడ్

నేను పెళ్లి చేసుకున్నోడు శాడిస్ట్

నువ్వు వదిలేసి వెళ్లిపోయాక నా మొహంలో నవ్వే పోయిందని అంజలి బాధపడుతుంది. నేను పెళ్లి చేసుకున్నవాడు ఒక శాడిస్ట్. అన్నింటికి మించి నా మీద అనుమానపడేవాడు. నా జీవితం ఇలా అయిందేంటని చచ్చిపోవాలనుకున్నాను అని అంజలి ఏడుస్తుంది. అలాంటి మాటలు అనకని చందు ఓదారుస్తాడు. అంజలి కన్నీళ్లు తుడుస్తాడు.

వాడితో ఉన్న ఒక్క సంవత్సరం నరకం అంటే ఏంటో తెలిసొచ్చింది. మా నాన్న సహాయంతో బయటపడ్డాను అని చెబుతుంది అంజలి. నీకేం కాదు నేనున్నాగా. నేను చూసుకుంటాను అని ధైర్యం చెబుతాడు చందు. శ్రీవల్లి చేసిన తప్పుల గురించి చెబుతాడు చందు. కోర్టులో ఒక్క సంతకం పెడితే నాకు విడాకులు ఇస్తారు అని చందు అంటాడు.

ఒక్క నిమిషం ఆలోచించు. బాధతో చెబుతున్నాను బాధ్యతగా ఆలోచించి నిర్ణయం తీసుకో చందు అని అంజలి అంటుంది. రాక్షస మనస్తత్వం వల్లి లాంటి వాళ్లను భరించడం కంటే విడాకులు ఇవ్వడం బెటర్. నువ్వు ఆ శాడిస్ట్‌కి విడాకులు ఇచ్చాక రిలీఫ్‌గా ఉందిగా.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అంజలి అని చందు తెగేసి చెబుతాడు.

లాయర్ సలహా

మరోవైపు చందు విడాకులు కేసు వేసిన లాయర్‌ను కలుస్తాడు రామరాజు. ఆ కేసును ఆపగలరా. ఆ పెళ్లి నిలబెట్టడానికి మేమంతా ప్రయత్నిస్తున్నామని రామరాజు అంటాడు. అది చందు తన పర్సనల్ అన్నాడు. అందులోను తన చిన్నపిల్లోడు కాదు. నేను కాదంటే వేరే లాయర్ దగ్గరికి వెళ్తాడు. చందు మొండితనం గురించి తెలిసిందేగా. చందు సైడ్ నుంచి కష్టం. కోర్టుకే వస్తా అన్నాడు అని లాయర్ అంటాడు.

ఇక ఏం చేయలేమా అని రామరాజు అడిగితే.. ఒకే దారి ఉందండి. చేస్తే మీ కోడలి వైపు నుంచే చేయాలి. ఆ అమ్మాయికి మంచి లాయర్‌ను ఏర్పాటు చేయించండి. రేపు జరగబోయే వాయిదాకి ఆ అమ్మాయి రాకపోడానికి ఏదైనా బలమైన కారణం చూపించి.. దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చేలా చేయించండని లాయర్ సలహా ఇస్తాడు.

అంటే కేసు వాయిదా పడుతుందా అని తిరుపతి అడుగుతాడు. అవును, ఆ అమ్మాయి తరఫు లాయర్‌తో మాట్లాడించండి. నేను కూడా కోర్టులో అడ్జెస్టబుల్‌గా ఉంటాను. ఎలాంటి అభ్యంతరం చెప్పను. దాంతో అటోమాటిక్‌గా కేసు వాయిదా పడి నెక్ట్స్ వాయిదాకు గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్‌లో మీరు చేయాల్సింది చేయండి. వల్లి తప్పు చేసినట్లు చందు గట్టి ప్రూఫ్స్ ఉన్నాయని చెబుతున్నాడు. త్వరగా ఏదోటి చేయండని లాయర్ చెబుతాడు.

మగాడివని ఒప్పుకుంటాను

రామరాజు థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు చందు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తాడు ధీరజ్. పెద్దోడు నన్ను మాయచేయాలని చూస్తున్నాడు. లేకపోతే నేనే భ్రమపడుతున్నానా. కచ్చితంగా నేను చందు అంజలిని చూశాను. ఆలోచిస్తే బుర్ర హీటెక్కిపోతుందని ధీరజ్ అనుకుంటాడు. ముందు ఆ రౌడీ వెధవల గురించి ఆలోచించాలి. ఇంకా కారు తీసుకురావాలని ధీరజ్ కాల్ చేస్తాడు.

ఏంట్రా కారు తీసుకెళ్లి ఇంకా తీసుకురాలేదు అని ధీరజ్ అడిగితే.. వెటకారంగా సమాధానాలు చెబుతారు రౌడీలు. నీ కారు మీద ఆశలు వదిలేసుకో. నీ కారును పార్టులుగా అమ్మేశాం. కానీ ఇంకా మంచి బేరం దొరకలేదు. నీకు నిజంగా దమ్ముంటే మా ఏరియాకు వచ్చి నీ కారు తీసుకెళ్లురా. అప్పుడు నువ్వు మగాడివని ఒప్పుకుంటాను అని రెచ్చగొడతాడు రౌడీ.

సరేరా వస్తాను. ఈరోజు మీకు మూడిందని ధీరజ్ అంటాడు. తీసుకునేటప్పుడు బ్రతిమిలాడారు. ఇప్పుడేమో రివర్స్ అయ్యారు. ప్రేమ వినకుండా ఇచ్చేసింది. ముందు దాన్ని అనాలని ధీరజ్ అనుకుంటాడు. ప్రేమ చదువుతుంటే ధీరజ్ ఏదో వెతుకుతాడు. ప్రేమ అడిగితే.. రౌడీలు రివర్స్ అయినదాని గురించి చెబుతాడు. ఇప్పుడే వెళ్లి నా కారు తెచ్చుకుంటానని ధీరజ్ అంటాడు.

వల్లిలాగే సుకున్య

వాళ్లు రమ్మంటే గుడ్డిగా వెళ్లి ఉచ్చులో పడిపోతావా. కొంచెం కూడా ఆలోచించవా. గొడవలు అస్సలు వద్దు. ఆ కారు కావాలంటే వాళ్లపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇద్దాం. ఇలా రౌడీలా వెళ్లడమేంటీ. చట్టప్రకారం వెళ్దాం అని ప్రేమ ఆపుతుంది. ధీరజ్ ఆగిపోతాడు. ప్రేమ బుజ్జగిస్తుంది. ఇదంతా నీ వల్లే అని ధీరజ్ కోప్పడతాడు. నా వల్ల వచ్చింది. నేనే ఆ తప్పును సరిదిద్దుకుంటాను. నీతో లవ్ ఆసనం వేయిస్తానని ప్రేమ అంటుంది.

ఏంటని ధీరజ్ అడిగితే. ధీరజ్ ఒళ్లో ప్రేమ కూర్చుని రొమాంటిక్‌గా ఊయల ఊగుతుంది. అదంతా కిటికీలోనుంచి సుకన్య చూస్తుంది. ధీరజ్ కూల్ అవుతాడు. వెంటనే నా మీద నుంచి లే.. లేకుంటే నిన్ను ఏదోటి చేసేలా ఉన్నా. కంట్రోల్ తప్పేలా ఉన్నా. నీ ఇష్టం అని ధీరజ్ అంటాడు. ప్రేమను బెడ్‌పై పడేస్తుంటాడు ధీరజ్. అదంతా చూసిన సుకన్య మీరు హ్యాపీగా రొమాన్స్ చేసుకుంటున్నారా.. నాకు నచ్చట్లేదు అని ఇదివరకు వల్లిలాగే అనుకుంటుంది.

ధీరజ్ అంటూ లోపలికి వెళ్తుంది. దాంతో ధీరజ్, ప్రేమ దూరం జరుగుతారు. ప్రేమ తిడుతుంది. మావయ్య వచ్చారు. లాయర్ దగ్గరికి వెళ్లారుగా. ఏమైందో తెలుసుకుందాం పదా అని ప్రేమను లాక్కెళ్తుంది సుకన్య. రామరాజును లాయర్ ఏమన్నాడో అడుగుతుంది వేదవతి. రామరాజు చెప్పబోతుంటే నర్మద వీడియో కాల్ చేస్తుంది.

కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు

ఎగ్జామ్ గురించి అడిగితే బాగా రాశానని చెబుతుంది నర్మద. అందరూ మాట్లాడతారు. కానీ, వేదవతి మాత్రం మాట్లాడకుండా మొహం పక్కకు తిప్పుకుంటుంది. వేదవతి అలుగుతుంది. నర్మద సెటైర్లు వేస్తుంది. రామరాజు అడిగితే.. రేపు ఉదయం ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉందని, ఆ తర్వాత సాయంత్రం వరకు బయలుదేరుతానని నర్మద చెబుతుంది.

లాయర్ చెప్పిన విషయం నర్మదతో సహా అందరికి చెబుతాడు రామరాజు. మంచి లాయర్‌తో మాట్లాడండి. వల్లి అక్కను హాస్పిటల్‌కి తీసుకెళ్లి అక్క కండిషన్ అస్సలు బాలేదని మెడికల్ సర్టిఫికేట్ తీసుకోని అది కోర్టులో సబ్‌మిట్ చేస్తే చాలు. అప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేసు వాయిదా పడుతుంది అని నర్మద అంటుంది.

నా మనసులో అదే మాట ఉందని రామరాజు అంటాడు. అక్కకు ఏమైనా చెప్పు అని ప్రేమ అడిగితే.. ప్రేమకు ముద్దు పెట్టి నువ్వే నా అసలైన కోడలివి అని నర్మద ఉడుక్కునేలా పొగుడుతుంది వేదవతి. సరే అత్తయ్య రేపు నేను ఊరికి వచ్చాకనా మీ సంగతి చెబుతా అని నర్మద అంటుంది. కొంచెం మనసులో టెన్షన్‌గా ఉందని రామరాజు అంటాడు. ఏం కాదని ధీరజ్ అంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.