...
...
Next Story

Illu Illalu Pillalu November 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- లారీ కింద పడి చావబోయిన శ్రీవల్లి- భద్రావతి పాలేరుగా ధీరజ్

Illu Illalu Pillalu Serial November 6th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 6వ ఎపిసోడ్‌లో చందు ఎవ్వరి మాట వినట్లేదని శ్రీవల్లికి చెబుతుంది నర్మద. దాంతో చచ్చేందుకు లారీ కింద పడబోతుంది వల్లి. మరోవైపు బ్యాంక్ వాళ్లతో చింతామణి కోసం ఎదురుచూస్తుంటాడు ధీరజ్. రామరాజు, వేదవతి గొడవపడతారు.

Published on: Nov 6, 2026, 09:05:01 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో శ్రీవల్లి గురించి ధీరజ్, నర్మద, ప్రేమ మాట్లాడుకుంటారు. వల్లిని ప్రేమ క్షమించలేకపోతుంది. అన్నయ్య కోపంలో ఆ మాటలు అన్నాడు కానీ వల్లి వదినపై ప్రేమ ఉండే ఉంటుందని ధీరజ్ అంటాడు.

ఎవరు చెప్పిన చందు బావ వినట్లేదు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 6వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 6వ ఎపిసోడ్

నేను ఒప్పుకోను అని ప్రేమ అంటుంది. ధీరజ్, ప్రేమ గొడవ పెడతారు. ధీరజ్ వెళ్లిపోతాడు. నీకు నచ్చింది చేసుకో అని నర్మదను అనేసి ప్రేమ వెళ్లిపోతుంది. చందు అన్న మాటల గురించి నర్మద ఆలోచిస్తుంది. వల్లికి కాల్ చేస్తుంది నర్మద. నీ ఫోన్ కోసమే రాత్రంతా ఎదురుచూస్తున్నాను. మావయ్య మాట్లాడారా. చందు బావ విన్నాడా. విడాకులు రిటర్న్ తీసుకుంటా అన్నాడా అని వల్లి అడుగుతుంది.

నేను చెప్పేది విను. కానీ భయపడకు, బాధపడకు. నీకు పరిస్థితి తెలియాలని చెబుతున్నాను. అత్తయ్య, మావయ్య ఎంత నచ్చజెప్పిన బావగారు వినట్లేదు. ఏ విషయంలో అయినా వింటాను కానీ నీ విషయంలో వినని గట్టిగా చెప్పేశారు. విడాకులు వెనక్కి తీసుకునే పరిస్థితే లేదని అన్నారని జరిగింది చెబుతుంది నర్మద. ఏదో ఒక రోజు నీ మీదున్న ప్రేమ బయటపడుతుంది. నువ్వు కంగారుపడకని నర్మద ధైర్యం చెబుతుంది.

మావయ్య గారు చెబితే నా గురించి ఆలోచిస్తారని అనుకున్నా. కానీ, ఇప్పుడు ఆ నమ్మకం పోయిందని శ్రీవల్లి ఏడుస్తూ అంటుంది. ఇక నాకు కాలం కలిసిరాదనిపిస్తుంది. ఇలా ఇక్కడ ఏడుస్తూ ఉండే బదులు ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడం బెటర్ అని శ్రీవల్లి అంటుంది. నువ్వు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలని నర్మద అంటుంది.

వల్లి అఘాయిత్యం

ఇడ్లీ బాబాయ్ కంగారుపడితే.. ఏం కాదని నర్మద వెళ్తుంది. చందు బావ లేనప్పుడు ఈ జీవితం ఎందుకు. బావ లేకుండా నేను బతకలేను. ఒక్కసారిగా చావడం నయం అని ఎదురుగా వస్తున్న లారీని చూస్తుంది. మీ అందరిని బాధపెట్టాను నన్ను క్షమించండి అని శ్రీవల్లి లారీకి ఎదురుగా వెళ్తుంది. లారీకి ఎదురుగా నిలబడుతుంది. అది నర్మద చూస్తుంది.

లారీ వాడు హారన్ కొట్టి కొట్టి బ్రేక్ వేస్తాడు. మెల్లిగా ఆగుతుంది. ఇంతలోనే వల్లిని లాగుతుంది నర్మద. లారీ డ్రైవర్ తిట్టి వెళ్లిపోతాడు. ఏంటక్కా ఇదని నర్మద అడిగితే.. లారీ వస్తుందనే వెళ్లాను. బతకాలని ఆశ లేదని వల్లి అంటుంది. దాంతో కోపంతో వల్లి చెంపచెల్లుమనిపిస్తుంది నర్మద. చచ్చి ఏం సాధిస్తావ్. బతికి సాధించాలి అని నర్మద అంటుంది.

శ్రీవల్లికి నర్మద మాట

బావ విడాకులు ఇస్తుంటే ఏం చేయాలి. వాళ్లంతా నమ్మాలంటే నేను ఇంట్లోకి వెళ్లాలిగా అలా లేనప్పుడు బతికెందుకు అని వల్లి అంటుంది. కొంచెం ఓపిక పట్టాలక్కా అని నర్మద అంటుంది. సరే ఓపిక పడతాను. నువ్వు నాకు మాటిస్తావా. నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నువ్వు తీసుకుంటానని మాటివ్వు. అలా మాటిస్తే రేపు ఆశతో బతుకుతానని శ్రీవల్లి అంటుంది.

దాంతో సరేనని మాటిస్తుంది నర్మద. నేను మాటిస్తున్నా. నువ్వు మారావన్న విషయాన్ని ఎలాగైనా ఇంట్లో తెలిసేలా చేస్తాను. కానీ దానికి టైమ్ పడుతుంది. కోర్టు వాయిదాకు ఎలాగు టైమ్ ఉంది కాబట్టి నువ్వు లీగల్ ప్రొసీజర్స్ ఏం పెట్టుకోకు. సంతకం చేయమని ఫోర్స్ చేసినా పెట్టకు. బావగారు వచ్చి కోప్పడిన పెట్టను అని తెగేసి చెప్పు అని నర్మద అంటుంది.

దాంతో సంతోషిస్తుంది వల్లి. నర్మదను ప్రేమతో హగ్ చేసుకుంటుంది. ఏరోజైనా ఆ ఇంటికి వస్తానన్న ఆశతో బతుకుతానని వల్లి అంటుంది. మరోవైపు బ్యాంక్ వాళ్లతో చింతామణి కోసం ధీరజ్ ఎదురుచూస్తుంటాడు. మరోవైపు సూట్‌కేస్‌లో క్యాష్ పెట్టి బాండ్ పేపర్స్ పక్కాగా రెడీ చేశావుగా. చిన్న మిస్టేక్ చేసిన ధీరజ్ గాడు తప్పించుకుంటాడని చింతామణితో అంటుంది భద్రావతి.

ధీరజ్ గాడిని పాలేరు చేసే ఛాన్స్

పక్కాగా ప్రిపేర్ చేశానని చింతామణి అంటుంది. రామరాజుగాడిలాగే ధీరజ్ గాడిని మా ఇంటి పాలేరు చేసే అవకాశం వచ్చిందని భద్రావతి అంటుంది. మరోవైపు రామరాజుతో సుకన్య మాట్లాడుతుంది. తల్లి మాటలతో వల్లి అలా చేసింది కానీ చాలా మంచింది. చందు బావతో మాట్లాడి వల్లికి న్యాయం చేయమని సుకన్య అంటుంది.

వేదవతి వచ్చి కాఫీ ఇచ్చి తాగి మళ్లీ బాధపడమంటుంది. బావగారు ఆవేశంలో నోరు జారారు. ఆ ఆవేశం మీరు పంచిందేగా అని ప్రేమ అంటుంది. సుకన్యను తిడుతుంది వేదవతి. మీవల్లేగా ఇలా గొడవలు అయిందని అంటుంది. భాగ్యం చేసిన పనికి దాని పీక పిసికేసేదాన్ని అంటుంది. చందుకు ఇంకో పెళ్లి చేయకండని సుకన్య అంటుంది.

ఆ వల్లి చేసినదానికి విడాకులు ఇచ్చిన తప్పులేదని వేదవతి అంటుంది. నువ్వు కూడా ఏంటీ బుజ్జమ్మా. వాడికి నువ్వే విడాకులు ఇప్పించేలా ఉన్నావని తిడతాడు రామరాజు. పెళ్లి బంధం గురించి గొప్పగా చెప్పి మన ఇంటి ఆడపిల్లకు ఇలా జరిగితే ఊరుకుంటామా. తల్లి మాటలు విని తప్పటడుగులు వేసిందని రామరాజు అంటాడు.

వల్లిని ఇంట్లో పెడతాను

మీ మాటలు చూస్తుంటే వల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేలా ఉన్నారే అని వేదవతి భయంతో అంటుంది. పెడతాను. పెడితే తప్పేంటని. ఇప్పుడే వల్లిని తీసుకొస్తాననట్లేదు. అలాగే విడాకులు ఇప్పించాలని లేదు. చందులాగే కోపంతో నిర్ణయం తీసుకోకూడదు. ఇన్ని రోజులు వాడు వల్లితో కాపురం చేశాడంటే కచ్చితంగా వాడికి వల్లిపై ప్రేమ ఉండే ఉంటుందని రామరాజు అంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks