Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో దేవుడుకి ధీరజ్, ప్రేమను దండం పెట్టుకోమ్మని వేదవతి చెబుతుంది. దీని మొండితనం పోవాలని మొక్కుకో అని వేదవతి అంటుంది. నాకు కాదు నీ కొడుక్కి పనికిమాలిన కోపం తగ్గించుకోమ్మని ప్రేమ చెబుతుంది.
నోరు తగ్గించుకోవాలే

ధీరజ్, ప్రేమ వాదించుకుంటారు. వేదవతి ఆపుతుంది. నోరు తగ్గించుకోవాలే అని ప్రేమకు వేదవతి చెబితే.. రామరాజు సెటైర్ వేస్తాడు. రామరాజు, వేదవతి సెటైర్లు వేసుకుంటారు. రేపు అయ్యేలా ఉందని శారదాంబ వెళ్తానంటే.. వేదవతి ఆపుతుంది. ప్రేమ ఇంటిదీపం వెలిగిస్తుంది. తర్వాత చీర పైకి ఎగ్గట్టి నట్టింట్లో అత్తయ్య నేను ఇంటికి తిరిగి వచ్చానని అరుస్తుంది.
డ్యాన్స్ చేస్తుంది. నర్మదతో కలిసి చేస్తుంది. తర్వాత ధీరజ్, ప్రేమ డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత రామరాజు ఇంటిల్లిపాది సంతోషంతో డ్యాన్స్ చేస్తారు. ప్రేమ మాస్ డ్యాన్స్ చేస్తుంది. అంతా తననే చూస్తారు. ధీరజ్ ఆపి అందరిని చూపిస్తాడు. దాంతో సిగ్గుతో అత్త వెనుక దాక్కుంటుంది ప్రేమ. ప్రేమ రాడానికి నేను ఎంతో కష్టపడ్డాను అని వేదవతి అంటే.. అదంతా చేసింది నర్మద అని రామరాజు అంటాడు.
నర్మద పిల్లా బచ్చా
దానిమొహం పిల్లా బచ్చా అది. దానికి ఎలా చేయాలో చెప్పింది నేనే అని వేదవతి అంటుంది. నీ తెలివితేటలు ఏంటో పాతికేళ్ల నుంచి నేను చూడట్లేదా ఏంటీ. కానీ నువ్వు చెప్పింది ఒక్కటి మాత్రం నిజం బుజ్జమ్మా. నీ గవర్నమెంట్ కోడలు ఏదైనా సాధిస్తుంది అని రామరాజు అంటాడు.
చాలా రోజుల తర్వాత బుజ్జమ్మ అని రామరాజు పిలవడంతో యాహూ అని ఎగిరి గంతేస్తుంది వేదవతి. నర్మదతో కలిసి వేదవతి డ్యాన్స్ చేస్తుంది. మీ మావయ్య నాతో మాట్లాడారే. క్షమించేశారే. బుజ్జమ్మ అన్నారు అని నర్మదకు ముద్దుపెడుతుంది వేదవతి. ఇదే ముద్దు మీ ఆయనకు పెడితే అయాస్కాంతంలా అతుక్కుంటారుగా. నాకు పెట్టి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని నర్మద అంటుంది.
ఏదోలా దెబ్బ కొడుతూనే ఉన్నారు
{{/usCountry}}చాలా రోజుల తర్వాత బుజ్జమ్మ అని రామరాజు పిలవడంతో యాహూ అని ఎగిరి గంతేస్తుంది వేదవతి. నర్మదతో కలిసి వేదవతి డ్యాన్స్ చేస్తుంది. మీ మావయ్య నాతో మాట్లాడారే. క్షమించేశారే. బుజ్జమ్మ అన్నారు అని నర్మదకు ముద్దుపెడుతుంది వేదవతి. ఇదే ముద్దు మీ ఆయనకు పెడితే అయాస్కాంతంలా అతుక్కుంటారుగా. నాకు పెట్టి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని నర్మద అంటుంది.
ఏదోలా దెబ్బ కొడుతూనే ఉన్నారు
{{/usCountry}}నీకు అస్సలు సిగ్గులేదే. అత్తతో కూడా ఇంత పచ్చిగా మాట్లాడతావేంటే అని వేదవతి అంటుంది. అందరిని రామరాజు పంపిస్తాడు. ఇప్పుడెళ్లి మాట్లాడండి అని నర్మద అంటుంది. మరోవైపు జరిగింది తలుచుకుని పగతో రగిలిపోతుంది భద్రావతి. సేనాపతి వచ్చి మాట్లాడుతాడు. మీరెవరు నాకు మొహం చూపించొద్దు. పాతికేళ్లుగా రామరాజుపై ఓడిపోతూనే ఉన్నా. ప్రతిసారి ఏదోలా దెబ్బ కొడుతూనే ఉన్నాడు అని భద్రావతి అంటుంది.
ఇప్పుడు నా మేనకోడలికి కూడా శత్రువులా మారిపోయాను అని భద్రావతి అంటుంది. వాడిపై వందరెట్లు పగ తీర్చుకునేందుకు ఏదొక రూపంలో అవకాశం వస్తుందని సేనాపతి అంటాడు. అప్పటివరకు ఈ గది నుంచి బయటకు రాను. రామరాజు బతుకు చిన్నాభిన్నం చేసేవరకు గదిలోంచి బయటకు రానని, గదిలోనే బందీగా ఉంటానని నరసింహా సినిమాలో నీలాంబరిలా భద్రావతి అంటుంది.
ఇంట్లో పాతుకుపోయినట్లే
అంటే నీలాంబరి శపథం చేస్తుంది భద్రావతి. మరోవైపు ఇడ్లీ బాబాయ్‌కి తగిలిన దెబ్బలకు కాపుడం పెడుతుంది భాగ్యం. చింతామణి చేతులు పడిపోను, దాని చేతులు మిక్సీలో పడిపోను అని తిడతాడు ఇడ్లీ బాబాయ్. ఇంతలో ఫోన్ మాగితే ఇడ్లీ బాబాయ్ భయపడతాడు. సుకన్య మాట్లాడుతుంది. ఇక ఇంట్లో పాతుకుపోయినట్లే అంటుంది.
ఇక ఇద్దరు కలిసి ఇంట్లో చెడుగుడు ఆడండని భాగ్యం అంటుంది. మా మామ ముందు నా బండారం బయటపెడతానని నర్మద అంది. అది ఎప్పుడు ఎలా బయటపెడుతుందో అని భయంగా ఉందని వల్లి అంటుంది. నర్మద మన గురించి చెప్పకుండా ఉండేందుకు ఒకటి చేయి అని మరో ప్లాన్ ఇస్తుంది భాగ్యం. సరేనంటుంది శ్రీవల్లి.
చిలిపి యుద్ధం స్టార్ట్ చేయి
ఉప్పు నిప్పులా గొడవపడకండే అని ప్రేమకు సర్దిచెబుతుంది తల్లి రేవతి. ముందు ధీరజ్‌ను ఆపి తర్వాత ప్రేమగా చెప్పు. తనే నీకు క్షమాపణ చెబుతాడు. పెళ్లానికి మొగుడు క్షమాపణ చెబితే వచ్చే కిక్కే వేరు. నీకు ఒక బాబు పుడితే మీ నాన్న పంతాలు వదిలేసి మిమ్మల్ని ఇంటికి పిలుస్తాడు. మీరు ఈ యుద్ధాలు మానేసి చిలిపి యుద్ధాలు మొదలుపెట్టండని శారదాంబ అంటుంది.
మొగుడిని రేయ్ అని కాకుండా పద్ధతిగా పిలే అని రేవతి అంటుంది. ఇంతలో ధీరజ్ వచ్చి మీ అప్పగింతలు చూస్తుంటే నవ్వొస్తుంది. జాగ్రత్తలు నాకు చెప్పాలి. ముందే అది మెంటల్, రాక్షసిలా కరిచేస్తుంది అని అంటాడు. ధీరజ్‌ను గిల్లుతుంది ప్రేమ. శారదాంబ వాళ్లు వెళ్లిపోతారు. మళ్లీ తిరిగి వచ్చి ఈరోజు నుంచే మొదలుపెట్టండి అని చెబుతుంది.
తిరిగి సామ్రాజ్యంలోకి ప్రేమ
తర్వాత ధీరజ్‌కు ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి ఏడుస్తుంది ప్రేమ. లవ్ గిఫ్ట్స్ అన్ని చూసి ఎమోషనల్ అవుతారు ప్రేమ, ధీరజ్. తిరిగి నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాను అని సంతోషిస్తుంది ప్రేమ. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.