Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వేలం పాటలో రూ. 30 లక్షల ఒక్క రూపాయికి ధీరజ్ సొంతం చేసుకున్నట్లు ప్రకటిస్తారు. అంతా చప్పట్లు కొడతారు. ధీరజ్ మనం గెలిచామురా అని ప్రేమ గొప్పలు పోతుంది. నా భర్తను ఎవరిముందు ఓడిపోనివ్వను. గెలిపించాను అని భద్రావతితో అంటుంది ప్రేమ.
12 లక్షలదానికి 30 లక్షలు

నేను ఓడిపోవడం కాదే కావాలనే ఇరికించాను. రూ. 12 లక్షలు కూడా విలువ చేయనిదాన్ని 30 లక్షలు కట్టేలా చేశాను. వీడి మొహానికి ఎక్కడి నుంచి కడతాడు 30 లక్షలు. అంటే 18 లక్షలు నష్టం. నేనే గెలిచినట్లుగా అని భద్రావతి అంటుంది. సర్ క్యాష్ ఎలా ఇస్తారు అని వేలం పాట వాళ్లు అడుగుతారు. కట్టేందుకు టైమ్ ఉంటుంది కదా అని ప్రేమ అంటుంది.
ఉంటుంది కానీ చూసుకోవాలి. ఆలోపు కట్టకపోతే ఐదు లక్షలు పెనాల్టీ పడుతుందని వాళ్లు చెబుతారు. ధీరజ్, ప్రేమ వెళ్లిపోతారు. భద్రావతి మరో కొత్త ఆట మొదలుపెడుతుంది. సరికొత్త ఆట అని అనుకుంటుంది. రైస్ మిల్లుకు శ్రీవల్లి లంచ్ తీసుకొస్తుంది. వల్లిని చూసి చందు కోపంతో ఊగిపోతాడు. నిన్ను చిన్న మాట అంటేనే తిండితిప్పలు మానేస్తావ్. నీకోసం భోజనం తెచ్చాను తిందువురా బావ అని వల్లి అంటుంది.
నన్ను చంపేందుకు భోజనంలో విషం కలిపావా అని చందు అంటాడు. వల్లి షాక్ అవుతుంది. ధీరజ్, ప్రేమలను విడగొట్టావ్. ఎన్నో చేశావ్. ఇన్ని చేసిన నీకు నా ప్రాణాలు తీయడం పెద్ద లెక్కా అని చందు అంటాడు. అలా అనకు బా నువ్వంటే నాకు ప్రాణం. అవసరం అయితే నీకోసం చస్తాను బావ అని వల్లి అంటుంది. నీ మీద కోపంతో చంపినా చంపేస్తాను. వెళ్లిపో అని చందు అంటాడు.
చందు కాళ్లు పట్టుకున్న వల్లి
చంపేయ్ బావ. కానీ, చంపేముందు నన్ను క్షమించు. ముఖ్యంగా నేను ఎన్ని తప్పులు చేసిన సరే నీ మీద ప్రేమ ఉందని గుర్తించు అని చందు కాళ్లు పట్టుకుంటుంది వల్లి. కోపంతో శ్రీవల్లిని పక్కకు తోసేస్తాడు చందు. అంతా చూస్తారు. రామరాజు, తిరుపతి వస్తారు. వల్లిని లేపుతారు. అందరిని పంపిస్తాడు రామరాజు. ఆయన తినకుండా బాధపడతారని భోజనం తీసుకొచ్చానని వల్లి ఏడుస్తుంది.
{{/usCountry}}చంపేయ్ బావ. కానీ, చంపేముందు నన్ను క్షమించు. ముఖ్యంగా నేను ఎన్ని తప్పులు చేసిన సరే నీ మీద ప్రేమ ఉందని గుర్తించు అని చందు కాళ్లు పట్టుకుంటుంది వల్లి. కోపంతో శ్రీవల్లిని పక్కకు తోసేస్తాడు చందు. అంతా చూస్తారు. రామరాజు, తిరుపతి వస్తారు. వల్లిని లేపుతారు. అందరిని పంపిస్తాడు రామరాజు. ఆయన తినకుండా బాధపడతారని భోజనం తీసుకొచ్చానని వల్లి ఏడుస్తుంది.
{{/usCountry}}ఏడుస్తూ నటిస్తున్నావా. తడిగుడ్డతో గొంతు కోసే రకమే నువ్వు. ఇంకోసారి ఇలా వస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు చందు. నేను చేసిన తప్పులకు పశ్చాత్తాప పడుతున్నాను. అందుకే కేసు వాపసు తీసుకున్నా. కన్నీళ్లతో కాలిపోతున్నాను. ఒక తండ్రిగా నాకు అవకాశం ఇవ్వండని వల్లి వేడుకుంటుంది. ఎలా అమ్మా. ఇప్పటికే నావాళ్లు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. దానిని నిలబెట్టుకోలేదని రామరాజు అంటాడు.
నా పెద్ద కోడలు దేవత అని పిచ్చోడిలా నమ్మాను. నిన్ను పెళ్లి చేసి నా పెద్ద కొడుకుకు బాధ కలిగించానని ఇప్పటికీ ఉంది అని రామరాజు అంటాడు. తిరుపతికి చెప్పి ఇంటిదగ్గర వదిలేయమంటాడు రామరాజు. మరోవైపు కూరగాయలు తీసుకొస్తాడు ఇడ్లీ బాబాయ్. ఏయ్ లుంగీ మాస్టర్ త్వరగా వంట చేయమని భాగ్యం అంటుంది. వల్లి ఎక్కడికెళ్లిందని ఇడ్లీ బాబాయ్ అడుగుతాడు.
నా లుంగీ చిరిగిపోతుంది
పోయినదానికి తెలియదా రావడం అని భాగ్యం అంటుంది. నీకేంటే ఆ ఎస్సై వస్తే నా లుంగీ చిరిగిపోతుందని ఇడ్లీ బాబాయ్ భయపడతాడు. వస్తే రానివ్వు ఏమవుద్దని భాగ్యం అంటుంది. ఇంతలోనే ఎస్సై వస్తుంది. వల్లి ఉందా. ఓసారి పిలవండని ఎస్సై అడుగుతుంది. నేను కూరగాయలకు వెళ్లాను. ఈయనే ఉన్నారు. ఏమయ్యా అమ్మడిని పిలు అని భర్తనే ఇరికిస్తుంది భాగ్యం.
నేను ఎన్నో మోసాలు చూశాను కానీ ఇది చూల్లేదని ఇడ్లీ బాబాయ్ గొణుగుతాడు. మా వల్లి లోపల రెస్ట్ తీసుకుంటుంది. డిస్టర్బ్ చేయకండని మరీ మరీ చెప్పిందని ఇడ్లీ బాబాయ్ అంటాడు. వల్లిని ఓసారి చూసి వెళ్తానని లోపలికి వెళ్తుంది ఎస్సై. శ్రీవల్లిని తిరుపతి దింపుతాడు. మీరు చాలా మంచి మనిషి. నా స్వార్థానికి మిమ్మల్ని కూడా బలి చేశాను. రూ. 6 లక్షల విషయంలో మిమ్మల్ని దొంగను చేశాను. వీలైతే క్షమించండని వల్లి అంటుంది.
నాకు అక్క బావే దేవుడు. వాళ్లను మోసం చేశావన్న బాధ తప్పితే నన్ను దొంగని చేశావనే కోపం లేదు. వీలైతే మారు. అప్పుడప్పుడు నర్మదకు కనిపించు. తనే నీ విషయంలో హెల్ప్ చేయగలదు. నా పెద్ద అల్లుడు జీవితాంతం ఒంటరిగా మిగిలిపోకూడదని అని తిరుపతి చెబుతాడు. వల్లి ఇంట్లోకి వెళ్తుంది. ఇడ్లీ బాబాయ్‌ని కొట్టి వల్లి ఎక్కడ అని కోప్పడుతుంది ఎస్సై.
ప్రేమను గెంటేసిన ధీరజ్
ఇంతలో వల్లి వస్తుంది. రైస్ మిల్లుకు వెళ్లినట్లు చెబుతుంది. అర్థం చేసుకోగలనని ఎస్సై అంటుంది. ఇడ్లీ బాబాయ్‌కి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ఎస్సై. మరోవైపు లగేజ్ సర్ది ప్రేమను గెంటేస్తాడు ధీరజ్. మొన్న వల్లిని, ఇవాళ ప్రేమను. రేపు నర్మదను గెంటేస్తారా. ఈ ఇల్లు కోడళ్లను గెంటేసే ఇల్లుగా మారుతోందని సుకన్య గోల చేస్తుంది.
వేదవతి ఒక్కటిచ్చి అశుభాలు మాట్లాడకని తిడుతుంది. ఏమైందని ధీరజ్‌ను అడుగుతుంది వేదవతి. దాని తింగరితనంతో ఏం చేసిందో దాన్నే అడగండని ధీరజ్ అంటాడు. పాటపాడినందుకే చిందులు తొక్కుతున్నాడు. అద్భుతంగా పాడాను. ట్రావెల్ ఏజెన్సీ మనకే వచ్చిందని ప్రేమ చెబుతుంది. ధీరజ్‌ని తిడుతుంది వేదవతి. రూ. 12 లక్షల ప్రాపర్టీని 30 లక్షలకు పాడిందని ధీరజ్ చెబుతాడు.
ఈ బేబీ చూసుకుంటుందిగా
దాంతో అంతా షాక్ అవుతారు. వేదవతి కళ్లుతిరిగిపోతుంది. చూడు ధీరజ్ వామ్మో 30 లక్షలా అంటే భయమేస్తుంది. 30 లక్షలు అంతేనా అనుకుంటే ఏం కాదని ప్రేమ చెబుతుంది. ఇది వీళ్ల బాదంకాయ్ భద్రావతి కచేరి పాడినట్లు పోటీగా పాడుకుంటూ వెళ్లారు. నేను చెప్పినా వినలేదు. అంత డబ్బు ఎవరు కడతారు. దీని బాబు ఆ అని ధీరజ్ అంటాడు. బాబుదాకా అవసరం లేదు. ఈ బేబీ చాలని ప్రేమ అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.