...
...
Next Story

Illu Illalu Pillalu: చెవిలో పువ్వుతో ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ..భ‌ర్త‌ దగ్గరకు ఎప్పుడో? క్యూరియాసిటీ కొన‌సాగేలా ప్లాన్

Illu Illalu Pillalu: స్టార్ మాలో టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్తున్న సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. సస్పెన్స్ రేకెత్తించే ట్విస్ట్ లు, మనసును తాకే ఎమోషన్స్ తో ఈ సీరియల్ సాగిపోతుంది. తాజాగా ప్రేమ, ధీరజ్ మధ్య దూరం హాట్ టాపిక్ గా మారింది. దీని చుట్టూ కథను నడిపిస్తున్నారు మేకర్స్.

Published on: Aug 22, 2026, 20:39:11 IST
Advertisement

Illu Illalu Pillalu: బుల్లితెరపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అదరగొడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. స్టార్ మాలో ప్రైమ్ టైమ్ లో వస్తున్న ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ తో అదరగొడుతోంది. ప్రస్తుతం కథ మొత్తం ప్రేమ, ధీరజ్ చుట్టూ తిరుగుతోంది.

చెవిలో పువ్వుతో ప్రేమ

చెవిలో పువ్వుతో ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ..భ‌ర్త‌ దగ్గరకు ఎప్పుడో? క్యూరియాసిటీ కొన‌సాగేలా ప్లాన్
చెవిలో పువ్వుతో ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ..భ‌ర్త‌ దగ్గరకు ఎప్పుడో? క్యూరియాసిటీ కొన‌సాగేలా ప్లాన్

ఓ వైపు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తనదైన యాక్టింగ్ తో ప్రేమగా మెప్పిస్తోంది మన్విత జగదీష్. మరోవైపు సోషల్ మీడియాలోనూ క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా చెవిలో పువ్వుతో కొన్ని క్యూట్ పోజులిచ్చింది మన్విత.

ఎప్పుడు కలుస్తారో?

ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రేమ, ధీరజ్ తిరిగి ఎప్పుడు కలుస్తారో అనే సస్పెన్స్ కొనసాగుతోంది. భద్రావతితో కలిసి శ్రీవల్లి కుట్ర చేసి ప్రేమ, ధీరజ్ విడిపోయేలా చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య శాశ్వతంగా దూరం పెంచేందుకు కుట్రల మీద కుట్రలు పన్నుతున్నారు.

ఇంకా దూరంగా

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆడియన్స్ కు కామన్ గా ఓ సందేహం వస్తోంది. ప్రేమ ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ధీరజ్ కోపంలో అర్థం ఉంది. వాళ్ల అమ్మను సేనాపతి నానా మాటలు అనడంతో ధీరజ్ నోరుజారాడు. కానీ ప్రేమ ఆ విషయం అర్థం చేసుకోవడం లేదు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ, ధీరజ్ ది క్యూట్ జోడీ. ఈ జంటకు స్పెషల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇప్పుడు మేకర్స్ ఆ క్రేజ్ ను వాడుకునేందుకు స్పెషల్ ప్లాన్ వేశారని చెప్పొచ్చు. లవ్ బర్డ్స్ అయిన ప్రేమ, ధీరజ్ ను విడగొట్టి ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. దీంతో వీళ్లు తిరిగి ఎప్పుడు కలుస్తారనే క్యూరియాసిటీ ఏర్పడింది.

ఇప్పుడు ఆ క్యూరియాసిటీని కొనసాగించేలా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ను మేకర్స్ నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రేమ, ధీరజ్ మధ్య దూరం తగ్గి.. వాళ్లు ఎప్పుడు కలుస్తారో అని ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks