...
...
Next Story

Illu Illalu Pillalu September 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- 2 రోజుల్లో ధీరజ్ ప్రేమ పెళ్లి- రామరాజు భద్రావతి ఒప్పందం

Illu Illalu Pillalu Serial September 19th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 19వ ఎపిసోడ్‌లో ఈరోజు ఏదోటి తేలాలని, ప్రేమ ఇంటికి వచ్చేయాలని రామరాజు అంటాడు. వల్లిని భద్రావతి లాగిపెట్టి కొడుతుంది. 2 రోజుల్లో ధీరజ్, ప్రేమలకు అధికారికంగా పెళ్లి చేస్తానని రామరాజు ఛాలెంజ్ చేస్తాడు.

Published on: Sep 19, 2026, 08:35:39 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్ మరోసారి పరువు పోయేలా చేస్తే వాడి జీవితంలోకి ప్రేమ వెళ్లను అని ప్రేమ ఇచ్చిన మాటను గుర్తు చేస్తుంది భద్రావతి. కేసు వాపసు తీసుకుని రాజీ పడాలంటే నువ్వు ఇచ్చిన మాట ఉందిగా అంటుంది.

ఈరోజు ఏదోటి తేల్చేద్దాం

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 19వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 19వ ఎపిసోడ్

మరోవైపు మనల్నే లోపల వేస్తానంటున్నారు. ఎందుకు ఇదంతా అని వల్లి అంటుంది. నీ బొంద. అందరిని అరెస్ట్ చేసేంత పెద్ద స్టేషనా అది అని వేదవతి అంటుంది. సర్ది చెప్పాల్సిన మీరే కోప్పడితే ఎలా. మావయ్య గారు మీరు అలా కోపంగా కొట్టేయడమేనా అని నర్మద అంటుంది. నా కోడలికి పెళ్లిచూపులు అనేసరికి ఆవేశం తట్టుకోలేకపోయాను. ఈరోజు ఏదోటి తేల్చేద్దాం. ఎలాగైనా ప్రేమ మనింటికి రావాలి అని రామరాజు అంటాడు.

సరే ప్రేమను మనింటికి తీసుకెళ్దాం. ఇప్పుడు అయితే కేసు వాపసు తీసుకుందాం అంటుంది నర్మద. ప్రేమ మనింటికి రావాలి. దానికోసం ఏమైనా చేస్తానంటాడు రామరాజు. రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్తాయి. భద్రావతిని ఆపి నేనే కష్టపడి మావయ్య గారిని రాజీకి ఒప్పించాను. మీరు పోలీస్ స్టేషన్‌లో ఉండకుండా చేశాను చూశారా అని శ్రీవల్లి అంటుంది.

వల్లిని కొట్టిన భద్రావతి

దాంతో కోపంగా వల్లిని లాగిపెట్టి చెంపచెల్లుమనిపిస్తుంది భద్రావతి. నిన్ను కొట్టాలా చంపాలా. నా తమ్ముడు, సుక్కు విషయంలో మీరు చేసినదానికి మీ కుటుంబం మొత్తాన్నే లేపేద్దామనుకున్నా. కానీ, ప్రేమ, ధీరజ్ గొడవ పడటానికి కారణం మీరే అని తెలిసి ప్రేమ ఇంట్లోంచి వెళ్లిపోతుందని, జీవితాంతం మమ్మల్ని ద్వేషిస్తుందని ఆగాను. ఈ ఒక్క విషయంలోనే బతికిపోయారు అని భద్రావతి వార్నింగ్ ఇస్తుంది.

నా పెళ్లాంతో మాట్లాడొద్దని చెప్పడానికి నువ్వెవరు అని ధీరజ్ అంటాడు. చూశారా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూడండి. నా తమ్ముడి కాళ్లు పట్టుకుని క్షమించని అడగాలి అని భద్రావతి డిమాండ్ చేస్తుంది. నాకు కొట్టడం తప్పా పట్టుకోవడం తెలియదు అని ధీరజ్ అంటాడు. నేను సెటిల్ చేస్తానుగా అని మీ డిమాండ్స్ ఏంటో చెప్పండంటాడు ఎస్సై కుటుంబరావు.

మాది ఒక్కటే షరతు. మా కోడలు ప్రేమ మా ఇంటికి రావాలి. ఏదైనా ఉంటే మా ఇంట్లో మేము చూసుకుంటాం. మేము మాట్లాడుకుంటాం. ప్రేమ వచ్చేయమ్మా అని వేదవతి అంటుంది. రేయ్ చిన్నోడ పిలవరా అని వేదవతి అంటుంది. సేయ్ రాక్షసి మా అమ్మ పిలుస్తుంటే సైలెంట్‌గా ఉంటావేంటీ పదా అని ధీరజ్ అంటాడు. నువ్వు ఒక్కమాటతో పిలిస్తే వచ్చేదాన్నిరా కానీ మా నాన్నను కొట్టి మా ఇంటి పరువును పోగొట్టావుగా. అది తట్టుకోలేకపోతున్నా అని ప్రేమ అంటుంది.

అసలు అది పెళ్లే కాదు

కన్‌ఫ్యూజ్ అయ్యానని చెప్పానుగా అని ధీరజ్ అంటాడు. అన్నీ నువ్వే చేస్తావు. నువ్వు ఆడించో బొమ్మలు అనుకున్నావా. నేను రాను అని ప్రేమ అంటుంది. నీ బాధను అర్థం చేసుకోగలను కానీ బంధాన్ని తెంచుకోవద్దు అని రామరాజు అంటాడు. భద్రావతి చప్పట్లు కొడుతుంది. నా కోడలి పరిస్థితిని చూసి పసుపు తాడు కట్టారు. అది పెళ్లి కాదు. దానికి విలువ లేదు. ఆ పెళ్లికి చట్టబద్ధత లేదు. చట్టప్రకారం పెళ్లి జరగలేదు అని భద్రావతి అంటుంది.

ప్రేమ కేవలం నా మేనకోడలు తప్పా మీ ఇంటి కోడలు. మీ ఇంటికి రాదు అని భద్రావతి అంటుంది. అది చెప్పాల్సింది నువ్వు కాదని ప్రేమను అడుగుతుంది వేదవతి. వీళ్ల పెళ్లికి ఒక పెద్దమనిషిని సాక్ష్యం తీసుకురా. అప్పుడు పంపిస్తా. తీసుకొస్తావా అని భద్రావతి ఛాలెంజ్ చేస్తుంది. రెండు రోజుల్లో నా కొడుకు, కోడలికి అందరిముందు అగ్ని సాక్షిగా పెళ్లి చేస్తాను. చట్టప్రకారం మాత్రమే కాదు మనస వాచా వాళ్లు భార్యాభర్తలు అని చెప్పిస్తాను. రెండ్రోజుల్లో వీళ్ల పెళ్లి చేయకుంటే నాపేరు రామరాజే కాదు అంటాడు.

పెళ్లి చేయకుంటే ఏం చేస్తావని భద్రావతి అడుగుతుంది. నా మేనకోడలు మీ ఇంటికి శాశ్వతంగా దూరమవుతుంది. ప్రేమ జోలికి మీ కుటుంబం ధీరజ్ రాకూడదని భద్రావతి అంటుంది. ఎంత దారుణంగా అంటున్నావ్. నువ్వు బాగుపడవు. నాశనం అయిపోతావ్ అని వేదవతి శాపనార్థాలు పెడుతుంది. ఏదో విధంగా కలపాలి కానీ విడదీయడం ఏంటని రేవతి అంటుంది.

రామరాజు, భద్రావతి అగ్రిమెంట్

రెండ్రోజుల్లో నువ్వు పెళ్లి చేయకుంటే ప్రేమ మా ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది. అందుకు సిద్ధమా అని భద్రావతి అంటుంది. సిద్ధం అని రామరాజు సవాలుకు దిగుతాడు. నేను పెళ్లి చేయలేకుంటే నా కోడలిని శాశ్వతంగా దూరం చేసుకోడానికి సిద్ధం. వచ్చి అక్షింతలు వేసేందుకు సిద్ధంగా ఉండండని రామరాజు అంటాడు. అగ్రిమెంట్ పేపర్స్ మీద రామరాజు, భద్రావతి సంతకాలు చేస్తారు. వేదవతి ఎంత చెప్పిన రామరాజు వినిపించుకోడు.

అంతా వెళ్లిపోతారు. ప్రేమ దగ్గరికి భద్రావతి, సేనాపతి వెళ్లి డ్రామా చేస్తారు. జరిగింది చెప్పి రెచ్చగొడుతుంది భద్రావతి. నువ్వు వాళ్లింటికి వెళ్లవని తెలిసి రామరాజు కొత్త నాటకం మొదలుపెట్టాడని అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks