Illu Illalu Pillalu September 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లి సీక్రెట్ సిమ్ కార్డ్- ప్రేమ, మామను కొట్టిన ధీరజ్

Illu Illalu Pillalu Serial September 17th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 17వ ఎపిసోడ్‌లో ఫ్రెండ్ స్మితను నర్మద కలుస్తుంది. ధీరజ్, ప్రేమ మోపిదేవి వెళ్లినరోజే భాగ్యం వాళ్లు వెళ్లారని స్మిత చెబుతుంది. భద్రావతికి వల్లి నుంచి ఒక్క కాల్ కూడా వెళ్లలేదని స్మితకు చెబుతుంది.

Published on: Sep 17, 2026, 08:48:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో కారుపై ధీమా అని రాసి మా అనే పేరు చెరిపేస్తాడు ధీరజ్. అది చూసి ప్రేమ తిడుతుంది. ధీరజ్, ప్రేమ గొడవపడతారు. అంతలో రామరాజు వస్తాడు. ప్రేమ కంగారు పడుతుంది. ధీరజ్ కారు వాష్ చేసుకుంటాడు. అప్పుడే సాగర్ ఫోజ్ కొడుతూ వస్తాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 17వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 17వ ఎపిసోడ్

రామరాజుపై ధీరజ్ పంచ్

దారిలో ఈ నాస్టీ బకెట్ ఏంట్రా అని తన్ని సాగరే పడిపోతుంటాడు. ధీరజ్ పట్టుకుంటాడు. జీవితంలో కూడా ఇలాగే సరిగా నడవకుంటే బొక్కబోర్లా పడతారని రామరాజు అంటాడు. ఎలా నడవాలో తెలుసు అని సాగర్ వెళ్లిపోతాడు. ప్రేమను చూసి ఒకవేళ నా భార్యే అలిగి పుట్టింటికి వెళ్లిపోయింటే ఈపాటికి తీసుకొచ్చేవాన్ని. కానీ, నువ్వు మాత్రం చేతకానీ చవటలా చేతులు కట్టుకుని ఉన్నావని రామరాజు అంటాడు.

ఇంట్లో ఉన్న భార్యతో మాట్లాడడు కానీ పుట్టింటికి వెళ్లి తీసుకొచ్చుకుంటాడట అని ధీరజ్ పంచ్ ఇస్తాడు. భార్యను తీసుకురావడం తెలియదు కానీ నాన్నపై పంచ్ వేయడం వస్తుందని రామరాజు తిట్టేసి వెళ్లిపోతాడు. ధీరజ్‌ను ప్రేమ చూడటం చూసిన సేనాపతి వచ్చి పలకరిస్తాడు. మాట్లాడాలని పక్కకు తీసుకెళ్తాడు. ఈరోజు మనింటికి చాలా ముఖ్యమని రోజు. వేరే ఊరి నుంచి చాలా ముఖ్యమైన బంధువులు వస్తున్నారని చెబుతాడు తండ్రి సేనాపతి.

మన వంశస్థుల మధ్య మనం గౌరవం ఇంకా పోలేదు. వాళ్ల ముందు ధీరజ్ వల్ల పోదుగా అని సేనాపతి అంటాడు. వాడు పరువు పోయేలా చేయడని ప్రేమ అంటుంది. మనవాళ్లు వచ్చే టైమ్ అయింది నువ్వు రెడీ అవ్వు అంటాడు తండ్రి. నేనెందుకు అని ప్రేమ అడుగుతుంది. ఎందుకు. మనవాళ్లు సడెన్‌గా ఎందుకు వస్తున్నారనుకున్నావ్. మీ అన్నయ్య పెళ్లి కోసం. మీ అన్నయ్య పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలని సేనాపతి అంటాడు.

సైకోలా నవ్విన సేనాపతి

దానికి చాలా సంతోషంగా సరేనంటుంది ప్రేమ. తర్వాత రామరాజు ఇంటివైపు సైకోలా నవ్వి వెళ్లిపోతాడు రామరాజు. మరోవైపు ఫ్రెండ్ స్మితను నర్మద కలుస్తుంది. ఈ ఆధారాలపైనే విడిపోయిన ధీరజ్, ప్రేమల బంధం నిలబడి ఉందంటుంది నర్మద. శ్రీవల్లి, భద్రావతికి సంబంధించిన కాల్ డేటా అని ఇస్తుంది. మోపిదేవికి ధీరజ్, ప్రేమ వెళ్లిన రోజే వల్లి వాళ్ల అమ్మనాన్న కూడా మోపిదేవి వెళ్లారు. అక్కడి నుంచి వల్లికి కాల్ చేశారు. ప్రేమకు మోపిదేవి నుంచి కాల్ చేసింది ఫేక్ పర్సన్ అని స్మిత చెబుతుంది.

ఇదంతా చూస్తుంటే ధీరజ్, ప్రేమల పెళ్లి విషయం తెలుసుకునేందుకే శ్రీవల్లి వేసిన ప్లాన్ అయింటుందని నర్మద అంటుంది. ఆ ఫేక్ ఎస్సై దొరికితే అసలు విషయాలు బయటపడతాయ్ అని స్మిత అంటుంది. ఇంకా అసలు విషయం ఏంటీ రామరాజుపై పగతోనే భద్రావతి ప్లాన్ చేసింది. ధీరజ్ ప్రేమల పెళ్లి విషయం భద్రావతికి కచ్చితంగా వల్లినే చెప్పి ఉంటుందని నర్మద అంటుంది.

పక్కా ప్లాన్ ప్రకారమే బర్త్ డే చేయించారు. ధీరజ్, ప్రేమలను విడగొట్టారని స్మిత అంటుంది. నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా భద్రావతి ఫోన్‌కు వల్లి ఫోన్ నుంచి ఒక్క కాల్ కూడా వెళ్లనట్లు డేటా ఉందని స్మిత చెబుతుంది. మరోవైపు ఈ సీక్రెట్ సిమ్ కార్డు ఒక్క భద్రావతితో మాట్లాడేందుకు మాత్రమే. అందుకే దీన్ని ఎవ్వరి కంటికి కనిపించకుండా ఉంచాలని దాచిపెడుతుంది శ్రీవల్లి.

మీ ఇంటి చుట్టుపక్కల నుంచే లొకేషన్ చూపిస్తుంది

అలా నర్మద, స్మితకే వల్లి పెద్ద షాక్ ఇస్తుంది. ఇటువైపు భద్రావతికి ఒక అన్‌నోన్ నెంబర్ నుంచి చాలా సార్లు కాల్స్ వెళ్లాయి. దాని గురించి పూర్తి వివరాలు తెలియవు. మనవాళ్లు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోన్ స్విచాఫ్ వస్తుంది. కానీ, ఆ నెంబర్ నుంచి కాల్ చేసే లొకేషన్ మాత్రం మీ ఇంటి చుట్టుపక్కలే ఉంది. నాకు రెండు రోజులు టైమ్ ఇవ్వు దాని గురించి పూర్తిగా తెలుసుకుంటా అని స్మిత చెబుతుంది.

అది ఎవరు చేసి ఉంటారు అని నర్మద అనుకుంటుంది. ఈ సిమ్ కార్డు దొరికితే నాకు సావే. నా మొగుడికి కూడా తెలియకూడదు అని శ్రీవల్లి అనుకుంటుంది. మరోవైపు మనవాళ్లు ఎప్పుడు వస్తారా. మనం అనుకున్న బీభత్సం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూస్తున్నా అని భద్రావతి సేనాతో అంటుంది. ఇంతలో బంధువులు వస్తారు.

చాలా రోజుల తర్వాత మనం వంశం వాళ్లను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని శారదాంబ అంటుంది. ప్రేమను మీ ఆయన ఏం చేస్తారని అడుగుతారు. కచ్చితంగా జమీందారి ఇంటికే పంపించి ఉంటారని ఒకావిడ అంటుంది. విశ్వకు పెళ్లి అని తెలుస్తుంది. దాంతో విశ్వ షాక్ అవుతాడు. అసలు మిమ్మల్ని రప్పించిన పర్పస్ వేరే ఉందని భద్రావతి అనుకుంటుంది.

భద్రావతి స్కెచ్ సక్సెస్

బయట ఉన్న ముగ్గురితో చెప్పింది గుర్తుందిగా. ధీరజ్ రాగానే అనాలి. వాడి రక్తం మరిగిపోవాలని భద్రావతి చెబుతుంది. వాళ్లు సరేనంటారు. ఈ భద్రావతి స్కెచ్ వేస్తే ఎలా ఉంటుందో కాసేపట్లో చూడబోతున్నావ్ అని భద్రావతి అనుకుంటుంది. ధీరజ్ వస్తాడు. అమ్మాయి అందాల రాశిలా, మనోడికి తగిన జోడీ అనుకుంటూ మాట్లాడుకుంటారు.

ధీరజ్ విని ఏమైందని అడుగుతాడు. ప్రేమకు పెళ్లి చూపులు అని చెబుతారు. దాంతో ధీరజ్ షాక్ అవుతాడు. నాకు ఇప్పుడే పెళ్లి వద్దని శారదతో విశ్వ అంటాడు. తర్వాత చెబుతాలేరా అని శారదాంబ అంటాడు. ధీరజ్ కోపంగా ఇంట్లోకి వస్తాడు. ప్రేమ.. అని అరుస్తాడు. స్వీట్లు, పండ్లు అన్ని పడేస్తాడు. పెళ్లి గురించి మాట్లాడేందుకు వచ్చారు. తప్పేముందని ప్రేమ అంటుంది.

దాంతో ప్రేమను కొడతాడు ధీరజ్. అంతా షాక్ అవుతారు. ధీరజ్ కాలర్ పట్టుకుంటాడు సేనాపతి. దాంతో మామ సేనాపతిని కూడా కొడతాడు ధీరజ్. ఈ అబ్బాయి పట్టపగలే తాగొచ్చాడా ఏంటని అంటారు. నా వంశం వాళ్ల ముందే మావాళ్ల పరువు తీస్తావా అని ప్రేమ అంటుంది. అసలు వాళ్లను కాదు నిన్ను అనాలి ఎవరిని పెళ్లి చేసుకుంటావే అని గొడవ చేస్తాడు ధీరజ్.

ధీరజ్ రచ్చ

గొడవ చేయొద్దాని భద్రావతి బతిమిలాడినట్లు డ్రామా చేస్తుంది. ప్రేమ భర్త ఇంత వరెస్ట్‌గా ఉన్నాడేంటీ. పోయి పోయి ఇలాంటి వెధవని ఇచ్చి చేశారేంటని తిడతారు. విశ్వ చెప్పేందుకు ట్రై చేసిన ధీరజ్ వినడు. అలా గట్టిగా ధీరజ్‌ను ఇరికిస్తుంది భద్రావతి. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More