...
...
Next Story

Illu Illalu Pillalu September 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-మారని ధీరజ్, ప్రేమ-బ‌ల్ల‌క్కాయ్‌ చెంప పగలగొట్టిన భద్రావతి

Illu Illalu Pillalu September 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 7 ఎపిసోడ్ లో వేదవతిని ఆశీర్వదించకుండా రామరాజు బాధపెడతాడు. ధీరజ్, ప్రేమను కలిపేందుకు నర్మద ఐడియా ఇస్తుంది. కానీ వాళ్లిద్దరు మళ్లీ గొడవ పడతారు. ఇక భద్రావతి ఏమో బల్లక్కాయ్ చెంప చెళ్లుమనిపించి షాక్ ఇస్తుంది.

Published on: Sep 7, 2026, 08:02:54 IST
Advertisement

Illu Illalu Pillalu September 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రామరాజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. కానీ ధీరజ్ పక్కన ప్రేమ లేకపోవడం చూసి రామరాజు ఫీల్ అవుతాడు. దాని కారణం వేదవతి అని కోపంగా చూస్తాడు. ప్రేమ ఏమో గోడపై నుంచి ఇంట్లోకి తొంగి చూస్తుంది.

వల్లిని దీవించిన చందు

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

పూజ అయిపోయిన తర్వాత వేదవతి అందరికీ వాయినాలు ఇస్తుంది. ముగ్ధ వెళ్తూ బై ధీరజ్ అని చేయి ఊపుతుంది. నర్మద ఫ్రెండ్ అని ధీరజ్ కవర్ చేస్తాడు. నర్మదను సాగర్ దీవిస్తాడు. శ్రీవల్లి దీవించమంటే చందు ఒప్పుకోడు. రామరాజు చెప్పేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో దీవిస్తాడు.

రామరాజు కోపం

కొడుకుకు చెప్పడమేనా భార్యను దీవించరా? అని రామరాజును వేదవతి అడుగుతుంది. ఈ ఇంట్లో నిజంగా సంతోషం ఉందా? నిజమైన సంతోషంతో పూజ జరిగిందా? ఇద్దరు కొడుకులు భార్యలతో కలిసి పూజలో కూర్చున్నారు. కానీ చిన్న కొడుక్కి ఆ ఆనందం లేదు. అందుకు కారణం నువ్వు కాదా? నీలో ఆ బాధ ఉందా? అని వేదవతిని రామరాజు అడుగుతాడు.

చిన్నోడు, ప్రేమ దూరమైనందుకు ఎంత బాధ పడుతున్నానో నాకు తెలుసని వేదవతి ఎమోషనల్ అవుతుంది. ఈ పరిస్థితికి కారణం నువ్వే. వాళ్లకు పెళ్లి చేసి తప్పు చేశావని భార్యను నిందిస్తాడు రామరాజు. అమ్మ మంచి చేసి కూడా నిందలు మోస్తుంది. అమ్మను బాధపెట్టకండి. ఆశీర్వదించండి ప్లీజ్ అని ధీరజ్ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ రామరాజు కరగడు. ధీరజ్, ప్రేమ కలిసి ఉన్నప్పుడే దీవిస్తాననడంతో వేదవతి ఏడుస్తుంది.

నర్మద ఐడియా

బయట ప్రేమ ఏమో ముగ్ధతో గొడవ పెట్టుకుంటుంది. ఇంటికి ఎందుకు వచ్చావ్? నిజంగా వాడే నిన్ను పిలిచాడు కదా? అని ప్రేమ ఫైర్ అవుతుంది. అప్పుడు ధీరజ్ ను తీసుకొని వేదవతి, నర్మద బయటకు వస్తారు. ధీరజ్ మన్మధ లీలలు చెప్తే నో అన్నారు కదా. మీ అమాయకపు చక్రవర్తి దీనికి కన్నుకొట్టి గంప కింద కోడిపిల్లలా కమ్మాడని ప్రేమ అంటుంది.

నీకు, నీ భర్త మీద ప్రేమ ఎక్కువైంది. అందుకే ప్రతిదాన్ని భూతద్దంలో నుంచి చూస్తున్నావ్. ఈ అమ్మాయి ముగ్ధ తెలిసినవాళ్లతో క్యాజువల్ గా వచ్చింది. ధీరజ్ ఏం పిలవలేదు అని నర్మద చెప్పేసరికి ప్రేమ సైలెంట్ అవుతుంది. ముగ్ధ బై చెప్పి వెళ్లడంతో ప్రేమ మళ్లీ నోరు పారేసుకుంటుంది. అమ్మాయిలు, అనుమానం కవల పిల్లలు అని వేదవతి చెప్తుంది.

ప్రేమను దీవించమని

ప్రేమను ఆశీర్వదించమని వేదవతి చెప్తే ధీరజ్ తెగ బిల్డప్ ఇస్తాడు. మాట్లాడటం మానేస్తానని వేదవతి అనడంతో ధీరజ్ అక్షింతలు తీసుకుంటాడు. ఈ సారి ప్రేమ బెట్టు చేస్తుంది. నాకు పొగరుబోతు రాజుగారి ఆశీర్వాదం అక్కర్లేదని ప్రేమ అంటుంది. భర్త ఆశీర్వాదం తీసుకోవడం నీ సౌభాగ్యానికి మంచిదని నర్మద చెప్పేసరికి ప్రేమ వింటుంది.

ధీరజ్, ప్రేమ మళ్లీ

ధీరజ్ కాళ్లు మొక్కుతుంది ప్రేమ. ధీరజ్ ఆశీర్వదిస్తాడు. ఆ సీన్ బ్యూటీఫుల్ గా ఉంటుంది. ఎలాగైనా నా కాళ్లు పట్టుకుంటావని ఆశీర్వదించడానికి ఒప్పుకొన్నానని ధీరజ్ ట్విస్ట్ ఇస్తాడు. దీంతో ప్రేమ, ధీరజ్ మళ్లీ గొడవ పడి, ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోతారు. దేవుడా.. కొడుకు, కోడలిని కాకుండా కత్తి, కొడవలిని ఇచ్చావేంటయ్యా అని వేదవతి అనుకుంటుంది.

బల్లక్కాయ్ కు చెంపదెబ్బ

మరోవైపు బల్లక్కాయ్ ను పిలిపించి చెప్ప చెళ్లుమనిపిస్తుంది భద్రావతి. నీ నంగనాచి నాటకాలు నా దగ్గర ఆడకు అని భద్రావతి వార్నింగ్ ఇస్తుంది. సుకన్యను ప్రేమించిన విషయాన్ని తిరుపతి చెప్పడం గురించి వల్లికి భద్రావతి చెప్తుంది. దీంతో వల్లి షాక్ అవుతుంది. నా తమ్ముడికి అంత ధైర్యం లేదు. కానీ అలా మాట్లాడాడంటే నువ్వే రెచ్చగొట్టావని తెలుస్తోందని భద్రావతి అంటుంది.

నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నా. నువ్వు నాకు సహాయం చేశావని నిన్ను మినహాయించా? తోక జాడిస్తే తాట తీస్తా. నీ గురించి నిజాలన్నీ బయటపెడతానని భద్రావతి బెదిరిస్తుంది. సుకన్యను తిరుపతి లవ్ చేయడానికి కారణం నేను కాదు. అది మీ బ్లడ్ లోనే ఉందని వల్లి అంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe